E-Paper
Advertisement

Portable AC Benefits: మధ్యతరగతి వాళ్లు పోర్టబుల్ ఏసీలు కొనొచ్చా? ఒకవేళ కొంటే కలిగే లభాలేంటి?

Portable AC Benefits: మధ్యతరగతి వాళ్లు పోర్టబుల్ ఏసీలు కొనొచ్చా? ఒకవేళ కొంటే కలిగే లభాలేంటి?

Portable AC Benefits: ప్రస్తుతం మార్కెట్ లో లభించే ఏసీలు.. ప్రధానంగా రెండు వ్యత్యాసాలను కలిగి ఉన్నాయి. ఒకటి గోడకు తగిలించేది (Split ACs) అయితే.. రెండోది తేలిగ్గా తరలించగలిగే ఏసీలు (Portable ACs). కొందరిలో స్ప్లిట్ ఏసీల విషయంలో ఉన్న క్లారిటీ.. పోర్టబుల్ వాటికి వచ్చేసరికి ఉండటం లేదు. ముఖ్యంగా మధ్యతరగతి ఇళ్లకు అవి సరిగ్గా సరిపోతాయా? లేవా? అన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోర్టబుల్ ఎయిర్ కండీషనర్లను (Portable ACs) కొనుగోలు చేయడం వల్ల కలిగే ఆరు ప్రధాన లాభాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

ఎక్కడికైనా తెలిగ్గా తీసుకెళ్లొచ్చు

ఈ ఏసీలకు కింది భాగంలో చక్రాలు (casters) ఉండటం వల్ల.. వీటిని ఒక గది నుండి మరో గదికి చాలా సులభంగా తరలించవచ్చు. మీరు పగలు హాల్‌లో ఉన్నా, రాత్రి పడకగదికి వెళ్లినా, ఈ ఏసీని మీతో పాటే తీసుకెళ్లవచ్చు.

సులభమైన ఇన్‌స్టాలేషన్

స్ప్లిట్ ఏసీల మాదిరిగా గోడలకు రంధ్రాలు చేయడం లేదా బయటి వైపు యూనిట్లను అమర్చాల్సిన అవసరం లేదు. కిటికీ ద్వారా వేడి గాలిని బయటకు పంపే పైపును అమర్చుకుంటే సరిపోతుంది. దీనికి సాధారణంగా టెక్నీషియన్ల సహాయం కూడా అవసరం లేదు. ఫలితంగా ఇన్ స్టాలేషన్ ఛార్జీ ఆదా అయినట్లే.

అద్దె ఇళ్లకు ఉత్తమమైనది

మధ్యతరగతి చెందినవారిలో ఎక్కువ మంది అద్దె ఇళ్లల్లోనే జీవిస్తుంటారు. కాబట్టి తరచూ ఇళ్లు మారే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఇంటి యజమాని అనుమతి లేకుండానే వీటిని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఇల్లు మారేటప్పుడు మీతో పాటు కొత్త ఇంటికి తీసుకెళ్లవచ్చు.

స్థలం ఆదా

చిన్న గదులు, ఇరుకైన ఇంటిలోనూ ఎంచెక్కా పోర్టబుల్ ఏసీని వినియోగించవచ్చు. తక్కువ స్థలంలోనే ఇవి సరిగ్గా ఫిట్ అయిపోతాయి. అవసరం లేనప్పుడు వీటిని పక్కకు జరిపి స్టోర్ రూమ్‌లో దాచుకోవచ్చు.

తక్షణమే కూలింగ్

సాధారణంగా వేసవిలో ఏసీ ఇన్ స్టాలేషన్ చేసే వారికి భారీగా డిమాండ్ ఉంటుంది. మీరు ఏసీ కొన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇన్ స్టాలేషన్ కోసం ఎదురుచూడాల్సి రావొచ్చు. అదే పోర్టబుల్ ఏసీని ఇంటికి తీసుకొచ్చిన వెంటనే వినియోగించవచ్చు. తక్షణమే ఇవి కూలింగ్ ను అందిస్తాయి.

Also Read: Air Conditioner: ఏసీని 24 గంటల పాటు వాడుతున్నారా? ఇక మిమ్మల్ని పైవాడే కాపాడాలి!

వర్షాకాలంలోనూ వాడొచ్చు

చాలా పోర్టబుల్ ఏసీలలో కూలింగ్‌తో పాటు గాలిలోని తేమను తొలగించే ‘డీహ్యూమిడిఫైయర్’ (Dehumidifier) ఫీచర్ ఉంటుంది. వర్షాకాలంలో గదిలో వచ్చే ఉక్కపోత, తేమను తగ్గించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

Also Read: Trump vs Kim: కిమ్‌ను టార్గెట్ చేసిన ట్రంప్.. అణు యుద్ధం తప్పదా?

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×