E-Paper
Advertisement

Best Air Purifiers: ఎయిర్ ప్యూరిఫైయర్‌తో ఆస్తమా,అలర్జీలకు చెక్ .. ఇంతకీ ఎలాంటివి కొంటే మంచిది ?

Best  Air Purifiers: ఎయిర్ ప్యూరిఫైయర్‌తో ఆస్తమా,అలర్జీలకు చెక్ .. ఇంతకీ ఎలాంటివి కొంటే మంచిది ?
Advertisement

Best Air Purifiers : ఈ రోజుల్లో బయట అడుగుపెడితే పొగ, ధూళి, కాలుష్యం మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే.. మనం సురక్షితం అనుకునే మన ఇంట్లోని గాలి కూడా బయటి గాలి కంటే 2 నుంచి 5 రెట్లు ఎక్కువ కలుషితమై ఉంటుందని మీకు తెలుసా? వంట గదిలోని పొగ, పెంపుడు జంతువుల వెంట్రుకలు, దుమ్ము , కంటికి కనిపించని బ్యాక్టీరియా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో స్వచ్ఛమైన గాలి చాలా అవసరం. ఇందుకు ఎయిర్ ప్యూరిఫైయర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే.. మార్కెట్లో ఉన్న వందలాది ఎయిర్ ప్యూరిఫైయర్లలో మీ ఇంటికి ఏది సరైనదో.. అంతే కాకుండా ఎయిర్ ప్యూరిఫైయర్లు దేని ఆధారంగా కొనాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మీ ఇంటి కోసం బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ :

Advertisement

1. HEPA ఫిల్టర్ – ప్రాణం లాంటిది:
ఎయిర్ ప్యూరిఫైయర్ కొనేటప్పుడు మీరు చూడాల్సిన మొదటి విషయం HEPA ఫిల్టర్. ఇది గాలిలోని.. 99.97% సూక్ష్మ కణాలను (0.3 మైక్రాన్ల పరిమాణంలో ఉన్నవి కూడా) పట్టుకోగలదు. దుమ్ము, పుప్పొడి , బ్యాక్టీరియాను తొలగించడంలో ఇది అద్భుతంగా పని చేస్తుంది. “HEPA-like” అని రాసి ఉన్న వాటిని కాకుండా.. అసలైన True HEPA ఫిల్టర్ ఉన్న మోడల్స్‌నే ఎంచుకోండి.

2. రూమ్ సైజ్, CADR రేటింగ్:
మీ రూమ్ ఎంత పెద్దది? అనే దానిపై ప్యూరిఫైయర్ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీరు CADR (Clean Air Delivery Rate) రేటింగ్‌ను చూడాలి. ఈ రేటింగ్ ఎంత ఎక్కువగా ఉంటే.. ఆ మిషన్ అంత వేగంగా గాలిని శుభ్రం చేస్తుంది. బెడ్ రూమ్ కోసం చిన్న కెపాసిటీ ఉన్నది సరిపోతుంది. కానీ హాల్ లేదా పెద్ద గదుల కోసం ఎక్కువ CADR ఉన్న ప్యూరిఫైయర్ అవసరం.

Advertisement

3. మూడు పొరల రక్షణ:
బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్లలో కనీసం మూడు రకాల ఫిల్టర్లు ఉండాలి.

Pre-filter: ఇది పెద్ద దుమ్ము కణాలు, జంతువుల వెంట్రుకలను ఆపుతుంది.

Activated Carbon Filter: ఇది వంట గది వాసనలు, సిగరెట్ పొగ , గాలిలోని రసాయన వాయువులను (VOCs) పీల్చుకుంటుంది.

HEPA Filter: ఇది సూక్ష్మక్రిములను అంతం చేస్తుంది.

Also Read: ఏఐ టూల్స్ వాడుతున్నారా ? ఇలా చేయకపోతే.. మీ పర్సనల్ డేటా రిస్కులో పడ్డట్లే !

4. శబ్దం, కరెంట్ :
చాలా మంది ప్యూరిఫైయర్‌ను రాత్రిపూట బెడ్ రూమ్‌లో వాడుతుంటారు. కాబట్టి అది చేసే శబ్దం తక్కువగా ఉండాలి. 25 నుంచి 50 డెసిబుల్స్ (dB) లోపు శబ్దం చేసే మిషన్లు నిద్రకు ఇబ్బంది కలిగించవు. అలాగే.. ఇవి రోజంతా నడవాలి కాబట్టి ‘స్టార్ రేటింగ్’ ఉన్న కరెంట్ ఆదా చేసే మోడల్స్ మేలు.

5. స్మార్ట్ ఫీచర్లు:
ఇప్పుడు వస్తున్న ప్యూరిఫైయర్లలో గాలి నాణ్యతను తెలిపే AQI డిస్ప్లే, వైఫై కనెక్టివిటీ, మొబైల్ యాప్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటున్నాయి. గాలి నాణ్యతను బట్టి ఆటోమేటిక్‌గా ఫ్యాన్ స్పీడ్ పెరిగే ‘ఆటో మోడ్’ ఉన్నవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

6. మెయింటెనెన్స్, ఫిల్టర్ ఖర్చు:
ఎయిర్ ప్యూరిఫైయర్ కొనడం ఒక ఎత్తైతే.. దాని ఫిల్టర్లను మార్చడం మరొక ఎత్తు. సాధారణంగా 6 నుంచి 12 నెలలకు ఒకసారి ఫిల్టర్లు మార్చాల్సి ఉంటుంది. కొనేముందే ఆ బ్రాండ్ ఫిల్టర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయా , వాటి ధర ఎంత అనేది చెక్ చేసుకోండి.

ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ కు స్వచ్ఛమైన గాలి పునాది. కేవలం బ్రాండ్ పేరు చూసి కాకుండా.. పైన చెప్పిన True HEPA, CADR రేటింగ్, ఫిల్టర్ లైఫ్ వంటి అంశాలను చెక్ చేసుకుని మీ బడ్జెట్‌లో ఉన్న బెస్ట్ మోడల్‌ను ఎంచుకోండి. ఫిలిప్స్ (Philips), షావోమీ (Xiaomi), డైసన్ (Dyson), హనీవెల్ (Honeywell) వంటి బ్రాండ్లు ప్రస్తుతానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×