E-Paper
Advertisement

వీఐ ‘ఇన్‌స్టాడేటా’ ఆఫర్.. ఫ్రీగా 1GB ఎమర్జెన్సీ డేటా.. కానీ ఒక షరతు!

వీఐ ‘ఇన్‌స్టాడేటా’ ఆఫర్.. ఫ్రీగా 1GB ఎమర్జెన్సీ డేటా.. కానీ ఒక షరతు!
Advertisement

Vi InstaData: స్మార్ట్‌ఫోన్ యూజర్లను ప్రధానంగా వెంటాడే సమస్యల్లో డేటా షార్టేజ్ ఒకటి. రోజుకు 2GB, 3GB వచ్చేలా రీఛార్జ్ చేయించినప్పటికీ.. డేటా ఐస్ లా కరిగిపోవడం చాలా మందిని వేధిస్తోంది. దీంతో అర్జంట్‌గా ఆన్‌లైన్ పేమెంట్ చేయాలన్నా, మెసేజ్ పంపాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునేందుకు ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా (Vi) ఒక సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. అదే ‘వీఐ ఇన్‌స్టాడేటా’ (Vi InstaData). దీని ద్వారా వినియోగదారులు పైసా ఖర్చు లేకుండానే 1GB అదనపు డేటాను పొందవచ్చు. అయితే ఇందుకు వీఐ పెట్టిన కండిషన్ టెక్ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది.

అసలేంటీ ‘వీఐ ఇన్‌స్టాడేటా’ ఆఫర్?

సాధారణంగా రోజువారీ డేటా లిమిట్ అయిపోతే చాలా మంది అదనపు డేటా ప్యాక్‌ను రీఛార్జ్ చేసుకుంటారు. కానీ ‘వీఐ ఇన్‌స్టాడేటా’ ఫీచర్ ద్వారా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా డేటాను పొందొచ్చు. అయితే దానికి బదులుగా ప్రస్తుత యాక్టివ్ ప్లాన్ వ్యాలిడిటీ నుండి రెండు రోజులను వదులుకోవాల్సి ఉంటుంది. అంటే డబ్బులకు బదులు వ్యాలిడిటీని ఎక్స్ఛేంజ్ చేయడం అన్నమాట.

షరతులు వర్తిస్తాయ్ ..

Advertisement

ఈ అత్యవసర డేటా సదుపాయాన్ని ఉపయోగించుకునే ముందు కస్టమర్లు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ ఆఫర్ కింద లభించే 1GB అదనపు డేటా కేవలం ఆ రోజు రాత్రి 11:59 గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆ లోపు వాడకపోతే మిగిలిన డేటా ఎక్స్‌పైర్ అయిపోతుంది. మీరు ఈ డేటాను యాక్టివేట్ చేసిన ప్రతిసారీ ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీ రెండు రోజులు తగ్గిపోతుంది. అయితే ప్లాన్‌లోని మిగతా బెనిఫిట్స్ కాల్స్, ఎస్ఎంఎస్ లు వంటివి యథావిధిగా కొనసాగుతాయి. అయితే రోజుకు ఒకసారి మాత్రమే ఈ డేటాను వాడుకోవాల్సి ఉంటుంది.

Also Read: నింగికి నిచ్చెన వేసిన తెలుగు శాస్త్రవేత్తలు.. ‘స్కైరూట్’ సృష్టికర్తల సక్సెస్ స్టోరీ!

ఎవరైనా యూజ్ చేసుకోవచ్చా?

Advertisement

ఈ సర్వీస్ వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉండదు. కేవలం ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే లభిస్తుంది. కస్టమర్ వాడుతున్న అన్‌లిమిటెడ్ డైలీ డేటా ప్యాక్‌ పొందాలంటే యాక్టివ్ ప్లాన్ లో కనీసం 5 రోజుల వ్యాలిడిటీ మిగిలి ఉండాలి. రోజువారీ డేటా బ్యాలెన్స్ 10MB కంటే తక్కువకు పడిపోయినప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్-ఓన్లీ ప్లాన్స్, ‘వీఐ నాన్‌స్టాప్ హీరో’ ప్లాన్స్ వాడుతున్న వారికి ఈ సదుపాయం వర్తించదు. జమ్మూ కాశ్మీర్ మినహా దేశవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

యాక్టివేట్ చేసుకోవడం ఎలా?

వీఐ ఇన్ స్టాడేటా ఆఫర్ కు అర్హులై ఉండి.. అత్యవసరంగా డేటా కావాలనుకుంటే కొన్ని స్టెప్స్ ఫాలో కావాలి. ముందుగా మొబైల్ నుండి *111# USSD కోడ్ ద్వారా లేదా కంపెనీ సూచించిన ఇతర మార్గాల ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. కస్టమర్ తన సమ్మతిని తెలిపిన వెంటనే ప్లాన్ గడువు నుండి రెండు రోజులు తగ్గిపోతాయి. ఆపై 1GB డేటా వెంటనే క్రెడిట్ అవుతుంది. అర్జంట్ పనుల కోసం రీఛార్జ్ చేసే వీలు లేనప్పుడు ఇది ఒక మంచి ఆప్షన్. అయితే వ్యాలిడిటీ తగ్గుతుందనే విషయాన్ని వీఐ యూజర్లు తప్పక గుర్తుంచుకోవాలి.

Also Read: రూ.549 ప్లాన్‌కు ఎయిర్‌టెల్ చెక్.. రేసులోకి రూ.449, రూ.699.. ఏది బెస్ట్ ఛాయిస్?

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×