E-Paper
Advertisement

Vi Family Plan: వీఐ సర్‌ప్రైజింగ్ ప్లాన్.. అపరిమిత 5G డేటా, ఉచిత ఓటీటీలు.. 3000 SMSలు, ఫ్రీ కాల్స్!

Vi Family Plan: వీఐ సర్‌ప్రైజింగ్ ప్లాన్.. అపరిమిత 5G డేటా, ఉచిత ఓటీటీలు.. 3000 SMSలు, ఫ్రీ కాల్స్!
Advertisement

Vi Family Plan: ప్రముఖ టెలికాం రంగ సంస్థ వోడాఫోన్ ఐడియా (Vi).. తన యూజర్ల కోసం ప్రీపెయిడ్ తో పాటు పోస్ట్ పెయిడ్ ప్లాన్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దానిలో ప్రధానంగా ఓ ఫ్యామిలీ ప్లాన్.. అందరినీ ఆకట్టుకుంటోంది. రూ.751 ధర కలిగిన ఈ ప్లాన్ తో.. యూజర్లకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలగనున్నాయి. ఒకే బిల్లుతో ఇద్దరు వ్యక్తులు (1 ప్రైమరీ + 1 సెకండరీ) ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను వినియోగించుకోవచ్చు. అదనపు కనెక్షన్ తీసుకోవడం ద్వారా ఫ్యామిలీ అంతా ఒకే ప్లాన్ ను వినియోగించుకోవచ్చు. ఇంతకీ ప్లాన్ ప్రయోజనాలు, అదనపు కనెక్షన్ కు అయ్యే ఖర్చు ఎంతో ఈ కథనంలో పరిశీలిద్దాం.

రూ.751 ప్లాన్ ప్రయోజనాలు

రూ.751 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లో ప్రైమరీ యూజర్ కు మెరుగైన ప్రయోజనాలు లభిస్తాయి. నెలకు 70GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. ఒకవేళ 5 నెట్ వర్క్ పరిధిలో ఉంటే ఎటువంటి అదనపు పరిమితి లేకుండా అన్ లిమిటెడ్ 5G డేటాను వాడుకోవచ్చు. అలాగే అపరిమిత కాల్స్, నెలకు 3000 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. మరోవైపు రెండవ సభ్యుడికి (Secondary Member) 40GB డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం, నెలకు 3000 ఎస్ఎంఎస్‌లు అందిస్తారు.

అదనపు ప్రయోజనాలు

Advertisement

వీఐ అందిస్తున్న డేటా రోల్ ఓవర్ ఫీచర్.. ఈ పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ కు వర్తిస్తుంది. వాడుకోగా మిగిలిన డేటాను తదుపరి నెలకు బదిలీ చేసుకోవచ్చు. అలాగే అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఎటువంటి డేటా లిమిట్ లేకుండా ఉచితంగా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి అదనంగా 20GB డేటాను సైతం బోనస్ గా ఈ ప్లాన్ లో పొందవచ్చు.

ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు

ఈ ప్లాన్ లో ఏదైనా రెండు ఓటీటీ సబ్ స్క్రిప్షన్లను ఉచితంగా పొందవచ్చు. ప్రైమరీ యూజర్ తనకు ఇష్టమైన ఓటీటీని అంటే అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, సోని లైవ్, సన్ నెక్ట్స్ వంటి ఓటీటీల్లో ఏదైనా రెండింటిని ఎంచుకోవచ్చు. ఇది కాకుండా వీఐ మూవీస్ అండ్ టీవీ యాక్సెస్ కూడా ఈ ప్లాన్ కింద ప్రైమరీ యూజర్ కు లభిస్తుంది.

Advertisement

Also Read: Amravati Case: అమరావతిలో 19 ఏళ్ల మృగం.. 180 మంది బాలికలను వేధించి.. అశ్లీల వీడియోలతో బెదిరింపులు!

మరిన్ని కనెక్షన్లు కావాలంటే..

అయితే ఈ ప్లాన్ లో మరింత మంది కుటుంబ సభ్యులను చేర్చుకోవచ్చు. గరిష్టంగా ఏడుగురు ఈ ప్లాన్ లో చేరవచ్చు. అయితే ఒక్కో అదనపు కనెక్షన్ కు రూ.299 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ప్రారంభ ధర రూ.751 కాగా, జీఎస్టీని ఇందుకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్లాన్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం వీఐ యాప్ లేదా వెబ్ సైట్ ను సందర్శించండి.

Also Read: BSNL మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. ఏకంగా 150 రోజుల పాటు.. ప్రతీరోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×