E-Paper
Advertisement

Amravati Case: అమరావతిలో 19 ఏళ్ల మృగం.. 180 మంది బాలికలను వేధించి.. అశ్లీల వీడియోలతో బెదిరింపులు!

Amravati Case: అమరావతిలో 19 ఏళ్ల మృగం.. 180 మంది బాలికలను వేధించి.. అశ్లీల వీడియోలతో బెదిరింపులు!
Advertisement

Amravati Case: మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 180 మంది బాలికలను (మైనర్లు) లైంగికంగా వేధించి వారి అశ్లీల వీడియోలను చిత్రీకరించిన ఆరోపణలపై అయాన్ అహ్మద్ తన్వీర్ అహ్మద్ (19) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సోషల్ మీడియా ద్వారా బాలికలను ట్రాప్ చేసి.. వారితో అసభ్యంగా ఉన్న 350 పైగా వీడియోలను చిత్రీకరించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ వీడియోలను ఉపయోగించి బాధితులను బ్లాక్‌మెయిల్ కూడా చేసినట్లు తెలుస్తోంది.

నిందితుడు అరెస్ట్.. రిమాండ్

అమరావతి జిల్లా పరాత్వడ ప్రాంత వాసిగా నిందితుడు మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ ను గుర్తించారు. లైంగిక దాడి ఆరోపణలతో అతడ్ని మంగళవారమే (ఏప్రిల్ 14న) అరెస్టు చేసిన అమరావతి జిల్లా పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితుడికి ఏప్రిల్ 21వ తేదీ వరకూ రిమాండ్ సైతం విధించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నిందితుడు ఉజేర్ ఖాన్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

బుల్డోజర్‌తో ఇల్లు కూల్చివేత

Advertisement

180 మంది బాలికలను వేధించినట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ ప్రజలు స్థానికంగా ర్యాలీలు సైతం నిర్వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం.. బుల్డోజర్ చర్యకు ఉపక్రమించింది. అమరావతిలోని అచల్‌పూర్ ప్రాంతంలో ఉన్న నిందితుడి నివాసంపై మున్సిపల్ అధికారులు బుల్డోజర్లతో దాడి చేశారు. ఇంటిలోని అక్రమంగా నిర్మించిన భాగాలను అధికారులు కూల్చివేశారు.

స్థానిక ఎమ్మెల్యే పర్యవేక్షణ

బుల్డోజర్ చర్యను స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ తాయడే స్వయంగా పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. కూల్చివేత ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఆయన అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బుల్డోజర్ చర్యపై అచల్ పూర్ మున్సిపల్ అధికారులు స్పందించారు. అక్రమ కట్టడాలకు సంబంధించి గతంలోనే నోటీసులు ఇచ్చామని స్పందన లేకపోవడంతో ఈ చర్య తీసుకున్నామని అధికారులు తెలిపారు.

Advertisement

Also Read: BSNL మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. ఏకంగా 150 రోజుల పాటు.. ప్రతీరోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!

ఎంఐఎం పార్టీతో సంబంధాలు..!

నిందితుడు మహ్మద్ అయాజ్.. గతంలో ఏఐఎంఐఎం (All India Majlis-e-Ittehadul Muslimeen) పార్టీ ఆఫీసులో పనిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏఐఎంఐఎం అమరావతి జిల్లా అధ్యక్షుడు హాజీ ఇర్ఫాన్ ఖాన్ తో ఉన్న ఫొటోలు, వీడియోలు నిందితుడి సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్నాయి. అంతేకాకుండా ఆయన చేతుల మీదుగా ఓ లేఖను సైతం అందుకుంటున్నట్లు నిందితుడు కనిపించాడు. అయితే నిందితుడు తమ పార్టీకి చెందినవాడంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏఐఎంఐఎం ఖండించింది. అతడితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చేసింది.

Also Read: Bosch AC: భారత ఏసీ మార్కెట్‌లో సంచలనం.. రంగంలోకి జర్మన్ కంపెనీ.. ఆసియాలోనే ఫస్ట్ టైమ్!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×