E-Paper
Advertisement

‘వారణాసి’పై యుద్ధం ఎఫెక్ట్.. ఇక ‘దేవర’ సెట్టింగే గతా? జక్కన కాంప్రమైజ్ అవుతారా?

‘వారణాసి’పై యుద్ధం ఎఫెక్ట్.. ఇక ‘దేవర’ సెట్టింగే గతా? జక్కన కాంప్రమైజ్ అవుతారా?
Advertisement

Rajamouli Movie :మహేష్ బాబు – రాజమౌళి..ఈ కాంబినేషన్లో సినిమా వస్తుంది అనగానే అంచనాలు ఆకాశాన్ని అంటాయ్.అయితే తాజాగా వస్తున్న వార్తలు చూస్తుంటే ఈ అంచనాలపై ఆవిరి అయ్యేలానే ఉన్నాయ్.అవును..గ్లోబల్ అడ్వెంచర్ అంటూ ఊరించిన జక్కన్న, ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఉన్న సిట్చుయేషన్స్ చూసి భయపడుతున్నాడా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.

అంటార్టికా to అల్యూమినియం ఫ్యాక్టరీ

Advertisement

అనుకున్న ప్లాన్ ప్రకారం ‘వారణాసి’ టీమ్ ఇప్పుడు అంటార్టికా, జార్జియా, కెన్యా వంటి దేశాల్లో కీలక షెడ్యూల్స్ లో చేయాలి.ఇప్పటికే కొన్ని పూర్తి చేసుకుని వచ్చినా, బ్యాలెన్స్ ఉన్న భారీ ఎపిసోడ్లని సమ్మర్ లో చేద్దామనుకుని ప్లాన్ వేసుకున్న పరిస్థితి.అయితే పశ్చిమాసియాలో యుద్ధం ఏ క్షణం ఏ మలుపు తిరుగుతుందో అర్థం కాని డైలమాలో అప్దిపోవడంతో , ఒకవేళ పెద్ద షెడ్యూల్ వేసుకుని విదేశాలకు వెళ్తే అక్కడ చిక్కుకునే  ప్రమాదం ఉందని జక్కన్న బృందం భయపడుతుందట.అందుకే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక, ఫారిన్ షెడ్యూల్స్ రద్దు చేసుకుని ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ, శంషాబాద్ చుట్టుపక్కల షూటింగ్‌ను లాగించేస్తున్నారని తెలుస్తుంది.

రాజమౌళి కాంప్రమైజ్ అవుతున్నారా?

Advertisement

అన్నిటికంటే షాకింగ్ విషయం ఏమిటంటే, క్వాలిటీ కోసం కోట్లు ఖర్చు చేసే రాజమౌళి, ఇప్పుడు ‘దేవర’ సినిమా కోసం వేసిన పాత సెట్లను వాడుకుంటున్నారనే వార్త ఫిలిం నగర్లో సెన్సేషన్ సృష్టిస్తోంది.విదేశీ సముద్ర తీరాల్లో తీయాల్సిన అండర్ వాటర్ సీక్వెన్స్‌లను, యుద్ధం వల్ల ప్రయాణాలు కుదరకనో లేక బడ్జెట్ అదుపులో ఉంచుకోవడానికో కానీ, హైదరాబాద్‌లోనే ‘దేవర’ కోసం తయారు చేసిన వాటర్ సెట్స్‌లో షూటింగ్ చేస్తున్నారట. దీన్ని చూస్తుంటే, “పర్ఫెక్షన్ కు మారుపేరు అయిన జక్కన్న కూడా ఇప్పుడు అడ్జస్ట్‌మెంట్‌లు మొదలుపెట్టారా?” అని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. గ్లోబల్ సినిమా అని చెప్పి, పక్కా లోకల్ సెట్టింగ్స్‌తో సరిపెట్టుకోవడం మహేష్ బాబు ఫ్యాన్స్‌కు మింగుడుపడటం లేదు.

లీకైన ఫైట్ సీన్లు.. అలెర్ట్ అయిన టీమ్!
ఈ సినిమా టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని వార్తలు వస్తున్న సమయంలో రెండు మూడు రోజుల క్రితమే ఒక పడవలో జరుగుతున్న ఫైట్ సీక్వెన్స్ లీక్ అవ్వడం మేకర్స్ ని ఫుల్ టెన్షన్ లో పెట్టేసింది.ఇప్పటికే కుంబా పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ తన షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ, మహేష్ బాబు – ప్రియాంక చోప్రాపై తీయాల్సిన మెయిన్ సీన్స్ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయట. లీకేజీల వల్ల సినిమా అసలు థీమ్ బయటపడిపోతుండటంతో టీమ్ ఇప్పుడు అలెర్ట్ అవుతుందని ఇన్ సైడ్ టాక్.

2027 ఏప్రిల్ విడుదల సాధ్యమేనా?
ప్రస్తుతానికి 2027 ఏప్రిల్ (ఉగాది) విడుదలని టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నా, అవాంతరాలు చూస్తుంటే ఆ డేట్ మిస్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. రాజమౌళి క్వాలిటీ విషయంలో ఎంత పక్కాగా ఉంటాడో తెల్సిందే.అవసరమైతే సినిమాను ఏళ్ల తరబడి పోస్ట్ పోన్ చేస్తాడు తప్ప కాంప్రమైజ్ అవ్వడు.ఇక సినిమా విషయానికి వస్తే కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్టును కె.ఎల్. నారాయణ మరియు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్న సంగతి తెల్సిందే.చూడాలి మరి పర్ఫెక్షనిస్ట్ అని పేరున్న జక్కన్న ఈ రూమర్స్ కి ఏం సమాదానమిస్తాడో !

also read:యశ్ ‘టాక్సిక్’ షాకింగ్ అప్‌డేట్.. ఇది గ్యాంగ్‌స్టర్ సినిమా కాదా? బాంబు పేల్చిన రాకింగ్ స్టార్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×