BigTV English

Vijay Sales Mind Blowing Offers: ఇదేంది భయ్యా.. ఐఫోన్లు, వన్‌ప్లస్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు.. ఇక రచ్చ రచ్చే!

Vijay Sales Mind Blowing Offers: ఇదేంది భయ్యా.. ఐఫోన్లు, వన్‌ప్లస్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు.. ఇక రచ్చ రచ్చే!

Vijay Sales Mind Blowing Offers: మీరు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ఇది మీకు ఫోన్ కొనడానికి సరైన సమయం కావచ్చు. విజయ్ సేల్స్ ప్రస్తుతం iPhone, OnePlus, Redmi, Vivo సహా దాదాపు అన్ని బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ సేల్స్‌లో అందుబాటులో ఉన్న ఐదు ఉత్తమైన డీల్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో Redmi, OnePlus, iPhone మోడల్‌లు ఉన్నాయి.


Redmi 13C 5G
మీరు తక్కువ బడ్జెట్‌లో 5G ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే Redmi 13C 5G అందుబాటులో ఉంది. 4GB RAM+ 128GB స్టోరేజ్ కలిగిన ఫోన్ వేరియంట్ ధర రూ.10,499. ఈ ఫోన్ విజయ్ సేల్స్‌లో కూడా అదే ధరలో అందుబాటులో ఉంది. అయితే YES బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ద్వారా కొనుగోలు చేస్తే రూ. 2500 డిస్కౌంట్ లభిస్తుంది. దీని ద్వారా ఫోన్ ధర రూ. 7,999 అవుతుంది. ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల డిస్‌ప్లే, MediaTek Dimensity 6100+ ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది.

iPhone 15
iPhone 15 128GB వేరియంట్ రూ. 79,900లగా ఉంది. విజయ్ సేల్స్‌లో రూ. 70,990గా ఉంది. అంటే రూ. 8910 ఫ్లాట్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ICICI, SBI బ్యాంక్ కార్డ్‌ల ద్వారా చేసే కొనుగోళ్లపై రూ. 6,000 తగ్గింపు ఉంది. కానీ వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 7,500 తగ్గింపు ఉంది. దీని వల్ల ఫోన్ ధర రూ. 63,490 అవుతుంది. అంటే మీరు లాంచ్ ధర కంటే రూ. 16,410 తక్కువగా దక్కించుకోవచ్చు.


Also Read: అంబానీ మావ తాటతీశాడు.. రూ.3వేలకే 5G ఫోన్.. ఫీచర్లు సూపరో సూపర్!

iPhone 14
iPhone 14 128GB మోడల్ ధర రూ. 69,900 అయితే విజయ్ సేల్స్‌లో రూ. 60,990గా ఉంది. అంటే రూ. 8,910 ఫ్లాట్ తగ్గింపుతో లభిస్తుంది. ఈ మోడల్‌లో మీరు ICICI, SBI బ్యాంక్ కార్డ్‌ల ద్వారా చేసే కొనుగోళ్లపై రూ. 3,000 తగ్గింపును పొందుతారు. మీరు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్ EMI, వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ EMI పేమెంట్స్‌పై రూ. 7,500 తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ల ద్వారా ఫోన్ ధర రూ. 53,490. లాంచ్ ధర కంటే రూ. 16,410 తక్కువకు మీరు దీన్ని సొంతం చేసుకోవచ్చు.

OnePlus Nord CE4 5G
OnePlus కంపెనీ Nord CE4 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ఇస్తోంది. అయితే దీని 8GB RAM+256GB వేరియంట్ ధర రూ. 26,999గా ఉంది. కానీ వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ EMI ద్వారా కొనుగోలు చేసినట్లయితే ఈ ఫోన్ రూ. 7,500 తక్కువకు లభిస్తుంది. దీని కారణంగా ఫోన్ ధర రూ. 19,499 అవుతుంది. ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ Snapdragon 7 Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 100W ఛార్జింగ్ సపోర్ట్‌‌తో వస్తుంది.

Also Read: బుర్రపాడు రా నాయనా.. సామ్‌సంగ్ నుంచి రెండు చీపెస్ట్ 5G ఫోన్లు.. మాటల్లేవ్ అంతే!

OnePlus Nord CE 3 Lite
8GB RAM + 128GB స్టోరేజ్ కలిగిన OnePlus Nord CE 3 Lite ఫోన్  వేరియంట్ విజయ్ సేల్స్‌లో రూ. 17,999కి అందుబాటులో ఉంది. వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ EMI  ద్వారా మీరు ఈ ఫోన్‌పై రూ.7,500 తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫర్ల ద్వారా ఫోన్ ధర రూ.10,499కి తగ్గిస్తుంది. ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌‌తో వస్తుంది. ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 67W SUPERVOOC ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీ ఉంది.

Related News

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Gaming Phone: 16GB ర్యామ్, 120W ఛార్జింగ్ గల రియల్‌మి గేమింగ్ ఫోన్.. అమెజాన్ ఫెస్టివల్‌లో ₹18,000 ధర తగ్గింపు!

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

Big Stories

×