E-Paper
Advertisement

Danish PM hit by Man: తీవ్ర కలకలం.. ఏకంగా దేశ ప్రధానిపై వ్యక్తి దాడి..

Danish PM hit by Man: తీవ్ర కలకలం.. ఏకంగా దేశ ప్రధానిపై వ్యక్తి దాడి..
Advertisement

Danish PM Assaulted by Man: ఆ దేశంలో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. ఆ దేశమే కాదు.. ప్రపంచ దేశాలు కూడా ఆందోళన చెందే ఘటన అక్కడ జరిగింది. ఏకంగా దేశ ప్రధానిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ వార్త విన్న ప్రపంచ దేశాలు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వార్తా కథనాలు ప్రచురితమైతున్నాయి. ఇటు సంబంధిత అధికారిక కార్యాలయం సైతం ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఐరోపా దేశమైనటువంటి డెన్మార్క్ ప్రధానిపై దాడి జరిగింది. దేశ రాజధాని నగరమైనటువంటి కోపెన్ హాగెన్ లో ప్రధాని మెటె ఫ్రెడ్రిక్సన్ పై ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ఏకంగా ప్రధానిపైనే దాడి జరగడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Advertisement

‘కోపెన్ హాగెన్ లోని కల్టోర్ వెట్ ప్రాంతంలో ఆమెపై దుండగుడు దాడికి పాల్పడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఒక్కసారిగా దాడి చేయడంతో ప్రధాని షాక్ కు గరయ్యారు’ అంటూ ఫ్రెడ్రిక్సన్ కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది. దాడి అనంతరం ఆమెను భద్రతా సిబ్బంది అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. అయితే, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే వివరాలు మాత్రం ఇంతవరకు వెల్లడించలేదు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐరోపా యూనియన్ కు ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: రష్యాలో ఘోర విషాదం.. నదిలో పడి నలుగురు భారతీయ విద్యార్థులు మృతి

Advertisement

ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల క్రితం స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రాబర్ట్ ఫికో తీవ్రంగా గాయపడ్డారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×