E-Paper
Advertisement

Family Drama OTT : 24 ఏళ్ల తర్వాత ఇంటికి… ట్విస్టుల మీద ట్విస్టులు… క్లైమాక్స్ హైలెట్

Family Drama OTT : 24 ఏళ్ల తర్వాత ఇంటికి… ట్విస్టుల మీద ట్విస్టులు… క్లైమాక్స్ హైలెట్
Advertisement

Family Drama OTT : ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో కొన్ని సిరీస్ లు ఆలోచనలో పడేస్తుంటాయి. ఎమోషన్స్ తో ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ హార్ట్ టచింగ్ ఉంటుంది. 24 ఏళ్ల తర్వాత తన సొంత ఊరుకి తిరిగి వచ్చిన ఒక వ్యక్తి చుట్టూ కథ ఉంటుంది. ఐయండిబిలో దీనికి ఎనిమిదికి పైగా రేటింగ్ ఉంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే 

‘నిర్మల్ పాఠక్ కి ఘర్ వాప్సీ’ (Nirmal Pathak Ki Ghar Wapsi) 2022లో వచ్చిన హిందీ వెబ్ సిరీస్. ప్రజాదరణ పొందిన ఈ సిరీస్ ని నరేన్ కుమార్ రూపొందించారు. ఇందులో వైభవ్ తత్వవాడి (నిర్మల్ పాఠక్), అల్కా అమీన్, పంకజ్ ఝా, వినీత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ SonyLIV లో తెలుగు భాషలో అందుబాటులో ఉంది. అలాగే Airtel Xstream Play లో కూడా చూడవచ్చు. మొత్తం 5 ఎపిసోడ్‌లు ఉన్నాయి.

స్టోరీ ఏమిటంటే

Advertisement

నిర్మల్ పాఠక్ అనే యువకుడు మూడేళ్ల వయసులో తన తండ్రితో కలిసి ఢిల్లీకి వెళ్లిపోయాడు. ఇప్పుడు 24 సంవత్సరాల తర్వాత పెద్దవాడై, సిటీలో పెరిగిన అతను తన స్వస్థలమైన బిహార్‌లోని బక్సర్ గ్రామానికి తిరిగి వస్తాడు. గ్రామస్తులు అతన్ని చాలా ప్రేమతో, గౌరవంగా చూస్తారు.  ఆ గ్రామం అంతా ఫెస్టివల్ మూడ్‌లో ఉంటుంది. అతనికి ఆ గ్రామం చాలా ఇష్టమవుతుంది. తన తండ్రి ఎందుకు గ్రామాన్ని వదిలి వెళ్ళాడు, తన తల్లి ఇక్కడే ఎందుకు ఉండిపోయింది అనే నిజాలను తెలుసుకోవాలని అనుకుంటాడు. తల్లి, బాబాయ్ సోదరుడి ప్రేమను చూసి నిర్మల్ ఎంతో సంతోషిస్తాడు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవదు. గ్రామంలో వేళ్లూనుకున్న కుల వివక్ష, అంటరానితనం, పాతకాలపు కట్టుబాట్లను చూసి అతను తీవ్రంగా చలించిపోతాడు.

ఒక వైపు తన కుటుంబ సభ్యుల పట్ల ఉన్న ప్రేమ, మరోవైపు గ్రామంలో మార్పు తీసుకురావాలనే తపన మధ్య నిర్మల్ ఆలోచనలో పడతాడు. అక్కడి కట్టుబాట్లను ప్రశ్నించడం వల్ల అతను ఊరి పెద్దలతోనే విభేదించాల్సి వస్తుంది. తన తండ్రి కూడా ఇలాంటి అన్యాయాలను ప్రశ్నించడం వల్లే, గ్రామం నుండి వెలివేయబడ్డాడాని నిర్మల్ తెలుసుకుంటాడు. చివరికి ఆగ్రామంలో నిర్మల్ ప్రయాణం ఎలా సాగిందనేది ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఫ్యూచర్ నుంచి వచ్చే పెళ్ళాం… భర్తకి షాకింగ్ ట్విస్టులు… ఇన్స్టా లో ట్రెండ్ అవుతున్న మాస్టర్ పీస్

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×