Big Stories

Vivo T3x 5G Sale Today: వివో కొత్త స్మార్ట్‌ఫోన్ సేల్ స్టార్ట్.. ధర, స్పెసిఫికేషన్, ఆఫర్ల వివరాలు ఇవే!

Vivo T3x 5G Sale Start Today: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో ఇటీవల ‘వివో టి3 ఎక్స్ 5జీ(Vivo T3x 5G)’ మొబైల్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. అయితే ఇవాళ ఈ మొబైల్ సేల్ స్టార్ట్ అయింది. ఆసక్తిగల కస్టమర్లు అధికారిక వెబ్‌సైట్ లేదా ఫ్లిప్‌కార్ట్ ద్వారా దీనిని కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఆఫర్, స్పెసిఫికేషన్ వివరాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం.

- Advertisement -

వివో టి3 ఎక్స్ 5జీ ఫోన్ మార్కెట్‌లో మూడు వేరియంట్లు రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499 ఉండగా 22 శాతం తగ్గింపుతో రూ.13,499లకి లిస్ట్ అయింది. అలాగే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.18,999 ఉండగా ఇప్పుడు 21 శాతం డిస్కౌంట్‌తో రూ.14,999లకి లిస్ట్ అయింది. అలాగే హై వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.20,499 ఉండగా.. ఇప్పుడు రూ.16,499లకే లిస్ట్ అయింది.

- Advertisement -

దీని మొదటి సేల్ ఈ రోజు ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ ద్వారా ఫస్ట్ ఫ్లిప్‌కార్ట్‌ ఆర్డర్‌పై రూ.250కి పైగా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చ. అంతేకాకుండా HDFC బ్యాంక్, SBI క్రెడిట్, డెబిల్ కార్డ్‌లను ఉపయోగించి Vivo T3x 5Gని కొనుగోలు చేసే కస్టమర్‌లు 4/128 జీబీ వేరియంట్‌పై రూ.1000 వరకు, 6/128 జీబీ, 8/128 జీబీ వేరియంట్‌పై రూ.1500 వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ బ్యాంక్ ఆఫర్ తర్వాత ఈ మూడు వేరియంట్ల ధరలు భారీగా తగ్గుతాయి. దీంతోపాటు భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

Also Read:  వివో నుంచి చీపెస్ట్ ఫోన్.. 50MP, 6000mAh బ్యాటరీ దీని సొంతం!

స్పెసిఫికేషన్స్:

Vivo T3x 5జీ స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది పూర్తి HD ప్లస్ (2408×1080 పిక్సెల్స్) రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1000 nits పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. మైక్రో SD కార్డ్‌తో స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ 3.0 ఫీచర్ వర్చువల్ ర్యామ్‌ను 8GBకి మరింత పెంచుతుంది. గేమర్స్ కోసం, ఇది 4D గేమ్ వైబ్రేషన్, గేమ్ వాయిస్ ఛేంజర్ వంటి లక్షణాలను కూడా కలిగి ఉంది.

ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 SoC ప్రాసెసర్ అమర్చబడింది. Android 14 ఆధారంగా OriginOS 4లో పని చేస్తుంది. 6,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫోన్‌లో రెండు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. వీటిలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. ఇధి 4K వీడియోలను షూట్ చేయగలదు (8GB RAM వేరియంట్‌లో మాత్రమే). సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఆడియో జాక్, స్టీరియో స్పీకర్లు, వాటర్, డస్ట్ రెసిస్టెంట్ IP64 రేటింగ్, USB టైప్-C పోర్ట్, 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ వెర్షన్ 5.1, GPS/GLONASS వంటి ఇతర ఫీచర్లు ఈ ఫోన్‌లో అందించబడ్డాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News