E-Paper
Advertisement

Vivo T3x 5G : వివో నుంచి చీపెస్ట్ ఫోన్.. 50MP, 6000mAh బ్యాటరీ దీని సొంతం!

Vivo T3x 5G : వివో నుంచి చీపెస్ట్ ఫోన్.. 50MP, 6000mAh బ్యాటరీ దీని సొంతం!
Advertisement

Vivo T3x 5G : టెక్ కంపెనీ వివో వరుసబెట్టి స్మార్ట్‌ఫోన్లలు మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. ఇటీవలే Vivo T3x స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసిన కంపెనీ ఇప్పుడు దాని తర్వాత వెర్షన్ Vivo T3x 5G స్మార్ట్‌పోన్‌ను లాంచ్ చేసింది. దేశంలో బడ్జెట్ ఫోన్లకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో కంపెనీ ఈ ఫోన్‌ను తక్కువ ప్రైజ్‌కి ఆఫర్ చేస్తోంది. ఇందులో పవర్‌ఫుల్ బ్యాటరీ ఉంది. అంతేకాకుండా ఇందులో అనేక లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌ను మంచి లుక్, డిజైన్‌తో చూడొచ్చు. ఈ ఫోన్ ధర తదితర విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.

వివో టీ3ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను వివో ఇండియా ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ చేసింది. ఏప్రిల్ 24న మధ్యాహ్నం 12 గంటలను ఈ ఫోన్ సేల్‌కు రానుంది. ఈ మేరకు వివో ఎక్స్‌లో టీజర్ విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 12,499గా ఉండనుంది. అంతేకాకుండా SBI, HDFC కార్డులపై రూ.1500 వరకు తగ్గింపు ఇస్తుంది. దీని ప్రకారం ఫోన్‌ను రూ. రూ.11 వేలకు దక్కించుకోవచ్చు. Vivo T3X 5G 6,000mAh బ్యాటరీతో వస్తుంది.

Advertisement

Also Read : రూ.20 వేల బడ్జెట్‌లో టాప్ రేటింగ్ ఫోన్లు ఇవే!

Vivo T3x 5G
Vivo T3x 5G

ఇది షేర్ చేసిన టీజర్‌లో రాబోయే ఫోన్ 6,000mAh బ్యాటరీతో సెగ్మెంట్‌లో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ అని పేర్కొన్నారు. సెలెస్టియల్ గ్రీన్, క్రిమ్సన్ రెడ్ కలర్స్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. 4GB RAM+128GB రూ. 12499, 6GB RAM+128GB రూ. 13499, 8GB RAM+128GB 14499గా ఉంది.

Advertisement

Vivo T3x 5G Qualcomm  స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 SoC‌పై లాంచ్ కానుంది.  ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల పూర్తి-HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 44W వైర్డ్ ఫ్లాష్ ఛార్జింగ్‌కు ఫోన్ సపోర్ట్ ఇస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సెటప్ ఉంది. దీంతో 4కె క్వాలిటీతో వీడియో రికార్డ్ చేయవచ్చు. 2 మెగాపిక్సెల్ డెప్త్ షూటర్ , LED ఫ్లాష్ ప్రైమరీ రియర్ సెన్సార్‌ ఉన్నాయి. సెల్ఫీ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఉంది. ఇది దుమ్ము, నీటి రక్షణ కోసం IP64 రేటింగ్‌ను కలిగి ఉంది.

Tags

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×