E-Paper
Advertisement

Chandrababu call to Chintamaneni: బాబు నుంచి చింతమనేనికి ఫోన్, అందుకేనా?

Chandrababu call to Chintamaneni: బాబు నుంచి చింతమనేనికి ఫోన్, అందుకేనా?
Advertisement

Chandrababu call to Chintamaneni: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో వాతావారణం వేడెక్కింది. అధికార వైసీపీకి ముందుగా అభ్యర్ధులను ప్రకటించడం, బీ ఫామ్ తీసుకోవడం, నామినేషన్లు వేయడం జరుగుతోంది. ఈ విషయంలో విపక్ష టీడీపీ కాస్త ఆలస్యంగా ఉంది. అయినా సరే నేతలు మాత్రం తమతమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటూపోతున్నారు. అయితే పొత్తుల కారణంగా చాలామంది నేతలకు టీడీపీ బీఫామ్ ఇవ్వడం ఆలస్యమైంది.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున చింతమనేని ప్రభాకర్ బరిలో ఉన్నారు. అయితే పొత్తు కారణంగా దెందులూరు, తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. వీటికి అనపర్తి అభ్యర్థి ఎంపిక ముడిపడి ఉండడంతో బీ ఫామ్ ఇవ్వడం ఆలస్యమైంది. రెండురోజుల కిందట దెందులూరు టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే బీ ఫామ్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పించలేదు.

Advertisement

బుధవారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి చింతమనేనికి ఫోన్‌ రావడంతో వెంటనే శ్రీకాకుళం బయలుదేరి వెళ్లారు. బీఫామ్ తీసుకోవాలని అధినేత చెప్పడంతో తన ప్రచారానికి విరామం
ఇచ్చి అక్కడికి బయలుదేరి వెళ్లారు. సాయంత్రానికి చింతమనేని దెందులూరుకు రానున్నారు. గురువారం బిఫామ్‌ను ఎన్నికల అధికారికి సమర్పించనున్నారు.

ALSO READ: కంటతడి పెట్టిన బొత్స, కారణం అదేనా?

Advertisement

మరోవైపు అనపర్తి నుంచి బీజేపీ బరిలో ఉంది. అక్కడ కమలనాధులకు పెద్దగా బలం లేకపోవడంతో టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసి చంద్రబాబు కన్వీన్స్ చేశారు. కూటమి గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని, ఏ పార్టీ నుంచి బరిలోకి దిగినా ఒకటేనని చెప్పడంతో నల్లమిల్లి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన నామినేషన్ దాఖలు చేశారు. దీంతో దెందులూరు సీటుపై లైన్ క్లియర్ అయ్యింది.

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×