BigTV English

Vivo T3x 5G @ Rs 49: మైండ్ బ్లోయింగ్.. అరకిలో మామిడి పండ్ల ధరకే కొత్త 5జీ ఫోన్.. ఇది కదా ఆఫర్ అంటే!

Vivo T3x 5G @ Rs 49: మైండ్ బ్లోయింగ్.. అరకిలో మామిడి పండ్ల ధరకే కొత్త 5జీ ఫోన్.. ఇది కదా ఆఫర్ అంటే!

Get Vivo T3x 5G @ Rs 49 Only: అదిరిపోయే ఫీచర్లు కలిగిన కొత్త 5జీ ఫోన్‌ను అతి తక్కువ ధరలో కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఇప్పుడంతా 5జీ మయమైపోవడం.. 5జీ ఫోన్లకు గిరాకీ భారీగా పెరిగిపోయింది. ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ధరలలో లేవు. అందువల్ల చాలా మంది కొత్త 5జీ ఫోన్‌ను కొనుక్కుందాం అనుకున్నా.. అధిక ధరల కారణంగా కొనుక్కోలేక పోతున్నారు.


అయితే ఇప్పుడు అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతి తక్కువ ధరలోనే కొత్త 5జీ ఫోన్‌ను కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో వివో కొత్త ఫోన్‌పై మంచి డిస్కౌంట్ ఆఫర్ ఉంది. వివో కంపెనీ ఇటీవలే రిలీజ్ చేసిన vivo T3x 5G స్మార్ట్‌ఫోన్‌పై క్రేజీ ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.

ఈ మొబైల్ అసలు ధర రూ.17,499 ఉండగా ఇప్పుడు 22 శాతం తగ్గింపుతో కేవలం రూ.13,499లకే కొనుక్కోవచ్చు. అంతేకాకుండా పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. Flipkart Axis Bank Cardపై 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ వస్తుంది. అంతేకాకుండా సెలెక్ట్ చేసుకున్న క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ట్రాన్షక్షన్‌పై రూ.500 వరకు తగ్గింపు పొందొచ్చు.


Also Read: రూ.17వేల స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరకే.. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే!

అప్పుడు దీనిని రూ.12,999లకే కొనుక్కోవచ్చు. అలాగే దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంది. ఏకంగా రూ.12,950 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ డిస్కౌంట్‌తో ఈ 5జీ మొబైల్‌ని కేవలం రూ.549లకే సొంతం చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కలుపుకుంటే ఈ 5జీ ఫోన్‌ను కేవలం రూ.49లకే కొనుక్కోవచ్చు అన్నమాట. ఒక రకంగా చూస్తే ఇది అరకిలో మామిడి పండ్ల ధరకే లభిస్తుందని చెప్పుకోవచ్చు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇంత భారీ మొత్తంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందాలంటే పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఎలాంటి హ్యాంగింగ్ కానీ బద్దలవడం కానీ ఉండకూడదు. అప్పుడు మాత్రమే పెద్ద మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వర్తిస్తుంది. అంతేకాకుండా పిన్‌ కోడ్ బట్టి కూడా వాల్యూ మారే అవకాశం ఉంది.

Related News

Jio Network: జియో, వి నెట్‌వర్క్‌లో అంతరాయం.. అసలు ఏమైంది?

Cooking Oil: ఏంటీ.. వాడేసిన వంట నూనెతో విమానాలు నడిపేస్తారా.. ఎక్కడో కాదు ఇండియాలోనే!

Chinese Robot: పిల్లలను కనే రోబోలు వచ్చేస్తున్నాయ్.. జస్ట్ ఇలా చేస్తే చాలు, పండంటి బిడ్డ మీ చేతిలో!

Infinix Hot 60i vs Tecno Spark Go: ₹10,000 లోపు ధరలో కొత్త 5G ఫోన్లు.. ఏది బెటర్?

Galaxy S24 Ultra Alternatives: గెలాక్సీ S24 అల్ట్రాకు పోటీనిచ్చే ప్రీమియం ఫోన్లు.. తక్కువ ధర, అద్భుత ఫీచర్లతో శాంసంగ్‌కు చెక్

Vivo G3 5G Launch: వివో G3 5G విడుదల.. ₹20,000 లోపు ధరలో 6000mAh బ్యాటరీ, HD+ డిస్‌ప్లే

Big Stories

×