Vivo T3x 5G: Vivo గత నెలలో Vivo T3x 5Gని బడ్జెట్ ధరతో భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఫోన్ మూడు RAM ఎంపికలతో వస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు తీసుకొచ్చారు. దీనిపై అనేక బ్యాంకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీనిపై అనేక ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫోన్‌ను డీల్‌లో కొనుగోలు చేసినట్లయితే చాలా డబ్బును ఆదా చేసుకోవచ్చు. దీని స్పెసిఫికేషన్లు, ఆఫర్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం.
ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ Vivo T3x 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. మొబైల్ అసలు ధర రూ.17,499 ఉండగా 22 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. దీంతో ఫోన్‌ను రూ. 13,499లకి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా మీరు కొన్ని బ్యాంక్ క్రెడిట్/ డెబిట్ కార్డులను ఉపయోగించి రూ.1000 వరకు తగ్గింపు పొందొచ్చు. అంటే ఫోన్‌ను రూ.12,499లకే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
Also Read : మరికొన్ని గంటలే ఛాన్స్.. రూ.27 వేల స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్ !
దీని బేస్ వేరియంట్ ధర రూ. 13,499, 6 జీబీ వేరియంట్ ధర రూ. 14,999, టాప్ వేరియంట్ రూ. 16,499కి కొనుగోలు చేయవచ్చు. ఫోన్ 4GB/6GB/8GB RAMతో 128 GB స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. సెలెస్టియల్, క్రిమ్సన్ బ్లిస్ కలర్స్‌లో ఫోన్ ఉంటుంది. రూ.11,200 ఎక్సేంఛ్ ఆఫర్ కూడా ఇస్తుంది.
Vivo T3x 5G స్పెసిఫికేషన్స్
ఈ ఫోన్‌లో 6.72 అంగుళాల IPS LCD డిస్‌ప్లే ఉంది. ఇది 1000 nits పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీని రిజల్యూషన్ 1080 x 2408 పిక్సెల్స్. ఇందులో Qualcomm Snapdragon 6 Gen 1 (4 nm) చిప్‌సెట్ ప్రాసెసర్ అందుబాటులో ఉంది. ఫోన్‌లో Adreno 710 GPU ఉంటుంది.
Also Read : TATA, BSNL మాస్టర్ ప్లాన్.. ఇక ఆ నెట్వర్క్‌ల పని అవుట్!
Vivo T3x 5G కెమెరా విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కలిగి ఉంది. వీడియో కాలింగ్, సెల్ఫీ కోసం ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది. పవర్ కోసం ఫోన్‌లో 6,000 mAh బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ల వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14లో పని చేస్తుంది.