Big Stories

Sanjiv Goenka – KL Rahul Controversy: అది మా మధ్య టీ కప్పులో తుఫాను లాంటిది.. కలిసిపోయిన ఓనర్- కెప్టెన్!

KL Rahul Joins Sanjiv Goenka’s Dinner: ఐపీఎల్ 2024 సీజన్ లో సంచలనాలే కాదు, చాలా వివాదాలను తీసుకొచ్చింది. అందులో ముఖ్యంగా సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా హద్దులు దాటి మైదానంలోనే కెప్టెన్ కేఎల్ రాహుల్ ను తీవ్రంగా దూషించడం ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరుగుతుందో, ఈ ప్రపంచానికి ఎవరికీ తెలీదు. కానీ గోయెంకా ప్రవర్తించిన తీరు చూస్తుంటే, డ్రెస్సింగ్ రూమ్ లో ఇంతకన్నా ఘోరంగా ఉంటుందని మాత్రం అంతా అనుకుంటున్నారు.

- Advertisement -

ఇదంతా ఒక ఫేజ్ అయితే, ఇందులోనే ఒక ట్విస్ట్ ఏమిటంటే, అంత సీరియస్ గా తిట్టిన ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకా కొద్దిగా కూల్ అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విమర్శలను చూశాడు. తనెంత తప్పు చేశాడో అర్థం చేసుకున్నాడు. ఆ తప్పును సరిదిద్ది ప్రయత్నం చేశాడు. వెంటనే కేఎల్ రాహుల్ ని పార్టీకి పిలిచాడు.

- Advertisement -

అందుకు కేఎల్ రాహుల్ ని కూడా అభినందించాలి. దానిని ఎంతో హుందాగా స్వీకరించాడు. అది స్పోర్ట్స్ స్పిరిట్ అంటే అని అందరూ రాహుల్ ని కొనియాడుతున్నారు. ఇది రోహిత్ శర్మలో లేదని అంటున్నారు. ముంబై ఫ్రాంచైజీ తనని తొలగించిన తర్వాత కొత్తగా వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యాను తీవ్రంగా ట్రోల్ చేస్తుంటే, అతనలా వేడుక చూశాడు కానీ, పత్రికాముఖంగా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు.

Also Read: Rohit Sharma : నా జీవితంలో ఎన్నో కష్టాలు చూశాను: కెప్టెన్ రోహిత్ శర్మ

దీనిని ఒక వర్గం తీవ్రంగా నిరసించింది. అయిందేదో అయ్యింది, ధోనీ, కొహ్లీ లాంటి మహామహులే ఇతరుల కెప్టెన్సీలో ఆడుతున్నారు. నేనెంత..? అని చెప్పి, అభిమానులను ఊరుకోమంటే సరిపోయేది.. ఆ ఒక్కమాటా తను అనలేదు. దాంతో హార్దిక్ పాండ్యా తీవ్ర అవమానాల పాలయ్యాడు.

ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా నేను పార్టీకి రాను అని చెప్పవచ్చు. అంతేకాదు తను ఆడాల్సిన మ్యాచ్ ఒక్కటే ఉంది. ఇంకెలాగూ బయటకు వెళ్లిపోయే ఉద్దేశంతో ఉన్నాడు. అందుకని పార్టీకి వెళ్లకుండా ఉంటే, దెబ్బకు దెబ్బ అనేలా ఉండేది. కానీ ఆ పని చేయలేదు.

ఎందుకంటే కొండలతో ఎవరూ ఢీ కొట్టలేరు. ఐపీఎల్ లో క్రికెట్ జట్ల ఫ్రాంచైజీలంతా కూడా కోట్లకు పడగలెత్తినవాళ్లు. పోయి పోయి వాళ్లతో పెట్టుకుంటే ఇప్పుడు బాగానే ఉంటుంది. అ తర్వాత బీసీసీఐ మీద ప్రెజర్ పెట్టి, జాతీయ జట్టులో స్థానం లేకుండా చేసేస్తారనే అపప్రధలున్నాయి. అందుకే తన కెరీర్ ని, భవిష్యత్తుని ద్రష్టిలో పెట్టుకుని కేఎల్ రాహుల్ మర్యాదగా వెళ్లి, గోయెంకా ఇచ్చిన పార్టీని ఎంజాయ్ చేసి వచ్చేశాడు.

Also Read: RCB vs CSK IPL 2024: ఆర్సీబీ, చెన్నై మ్యాచ్‌కు వరుణ గండం.. బెంగళూరు ఆశలపై నీళ్లు..?

ఈ నేపథ్యంలో గోయెంకా ఏమన్నాడంటే ఇది మా ఇద్దరి మధ్య టీ కప్పు తుఫాను లాంటిదని అన్నాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి ఆథియా శెట్టి…తుఫాను తర్వాత ప్రశాంతత అని కామెంట్ పెట్టింది.

అనంతరం ఈ ఎపిసోడ్ పై క్లూసెనర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఐపీఎల్ లో రాహుల్ పెర్ ఫార్మెన్స్ చాలా ఇప్పటివరకు, వికెట్ కీపర్ బ్యాటర్ 12 మ్యాచ్‌లలో 38.33 సగటుతో , 136.09 స్ట్రయిక్ రేట్‌తో 460 పరుగులు చేశాడు. ఫామ్ ఉన్నప్పటికీ, తన తీర్పు ప్రకారం రాహుల్ నాణ్యమైన ఆటగాడని నిరూపించుకున్నాడని, ఈ సీజన్‌లో అంత చెడ్డగా ఆడలేదని క్లూసెనర్ చెప్పాడు.

Also Read: కేఎల్ రాహుల్‌పై ఆగ్రహం.. లక్నో యాజమానికి ఏమైంది..? ఏ విషయంలో..?

మొత్తానికి కేఎల్ రాహుల్ ఎపిసోడ్ ఇలా ముగిసింది. లక్నో కూడా ఓటమి పాలైంది. ఇంక ఆఖరి మ్యాచ్ ఒక్కటే మిగిలి ఉంది. అది భారీ తేడాతో గెలవాలి. పక్కనే ఆర్సీబీ రన్ రేట్ ను మించిపోవాలి. చాలా ఒడిదుడుకుల మధ్య లక్నో ఊగిసలాడుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News