E-Paper
Advertisement

Vivo T4X Smartphone: వివో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో దుమ్ములేపేస్తుంది..

Vivo T4X Smartphone: వివో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో దుమ్ములేపేస్తుంది..
Advertisement

Vivo T4X Smartphone:భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వివో ఇప్పుడు తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా బడ్జెట్‌, మిడ్ రేంజ్ సెగ్మెంట్లలో యూజర్లు ఎక్కువగా కోరుకునే పర్‌ఫార్మెన్స్‌, స్టైలిష్ అప్‌డేటెడ్ లుక్‌, స్మూత్ సాప్ట్‌వేర్ అనుభవం ఈ మూడు అంశాలను అందించడంలో వివో ఎప్పుడూ ముందుంటోంది. మార్కెట్‌లో ధర పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, మధ్య తరగతి ప్రజల నుండి గేమర్ వరకు అందరికీ సరిపోయే మోడళ్లను విడుదల చేస్తూ వివో తన మంచి గుర్తింపు పెంచుకుంది. ఇదే కారణంగా వివో తీసుకొచ్చే ప్రతి కొత్త డివైస్‌కి ముందుగానే డిమాండ్ ఏర్పడుతోంది. అదే తరహాలో టి4ఎక్స్ కూడా మార్కెట్‌లో రిలీజ్ కాగానే చర్చ మొదలైంది.

పర్‌‌ఫార్మెన్స్ విషయానికి వస్తే..

Advertisement

వివో టి4ఎక్స్ లోని పర్‌‌ఫార్మెన్స్ భాగానికి వస్తే, ఇందులో ఉన్న మీడియాటెక్ డిమెంసిటీ 7300 చిప్‌సెట్ మొత్తం అనుభవాన్ని ఒక స్థాయి పైకి తీసుకుపోతుంది. 2.5GHz ఓక్టా కోర్ స్పీడ్ వల్ల రోజువారీ పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. గేమింగ్ చేస్తూ ఉన్నా, సమాంతరంగా అనేక ఆప్స్ మార్చుతూ ఉన్నా, సోషల్ మీడియా లో స్క్రోల్ చేస్తున్నా ల్యాగ్ లేకుండా పని చేస్తుంది. 6జిబి ర్యామ్ వేరియంట్ నుంచి 8జిబి ర్యామ్ వేరియంట్ వరకు ఒప్షన్స్ ఇవ్వడం వల్ల భవిష్యత్తులో వచ్చే హెవీ ఆప్స్‌కి కూడా రెడీగా ఉంటుంది.

స్క్రీన్.. యూజర్‌కు ఫ్లూయిడ్ ఫీలింగ్

Advertisement

డిస్‌ప్లే విషయానికి వస్తే, వివోలో ఉన్న 6.72 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడిస్క్రీన్ మంచి విజువల్ అనుభవం ఇస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోలింగ్ ఎంతో స్మూత్‌గా ఉంటుంది. గేమింగ్‌లో ఫ్రేమ్ మార్పులు వేగంగా కనిపించడం వల్ల యూజర్‌కు ఫ్లూయిడ్ ఫీలింగ్ వస్తుంది. పంచ్ హోల్ డిజైన్ వల్ల స్క్రీన్ ఆధునికంగా కనిపిస్తుంది. రంగులు స్పష్టంగా కనిపించడం, వీడియోలు చూస్తున్నప్పుడు సహజత్వం ఉండడం వంటి అంశాలు ఈ డిస్‌ప్లేను ఈ ధరలో మంచి ఎంపికగా నిలబెడతాయి. వెలుతురు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా స్క్రీన్ కాంతి తగినంతగా ఉంటుంది.

Also Read: Nokia Z99 Mini 6G: లాంచ్‌కు సిద్ధమైన నోకియా జెడ్99 మినీ 6జి.. ఇండియాలో ధర ఎంతంటే?

50 ఎంపి ప్రైమరీ కెమెరా

కెమెరా భాగానికి వస్తే వివో టి4ఎక్స్ ఈ ధరలో మంచి కెమెరా అవుట్‌పుట్ ఇస్తుంది. వెనుక భాగంలో 50 ఎంపి ప్రైమరీ కెమెరా ఇవ్వడం వల్ల డే లైట్ ఫోటోలు స్పష్టంగా వస్తాయి. లైటింగ్ తక్కువగా వున్నా పరిస్థితుల్లో కూడా ఈ లెన్స్ తన పనితీరుతో నిలుస్తుంది. 2ఎంపి డెప్త్ సెన్సార్ వల్ల పోర్ట్రెయిట్ ఫోటోల్లో బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ సహజంగా కనిపిస్తుంది. ఈ సెగ్మెంట్‌లో అరుదుగా లభించే 4కె 30fps వీడియో రికార్డింగ్ కూడా ప్రత్యేకత. ఫ్రంట్ 8ఎంపి కెమెరా సెల్ఫీలు సహజంగా చూపిస్తుంది. వీడియో కాల్స్ కూడా క్లారిటీగా కనిపిస్తాయి.

6500mAh సామర్థ్యం గల బ్యాటరీ

బ్యాటరీ విషయానికి వస్తే దీన్ని రోజుకు ఒకసారి కూడా ఛార్జ్ చేయాల్సిన పనిలేకుండా చేసే 6500mAh సామర్థ్యం పెద్ద ఆకర్షణ. ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించే యూజర్లకు ఇది పెద్ద ప్లస్. వీడియోలు చూస్తూ ఉన్నా, గేమింగ్ చేస్తూ ఉన్నా, సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ ఉన్నా బ్యాటరీ తక్కువగా అవుతుందనే ఆందోళన ఉండదు. 44W ఫ్లాష్ ఛార్జింగ్ కూడా ఇవ్వడం వల్ల వేగంగా ఛార్జ్ అవుతుంది.

ధర విషయానికి వస్తే..

వివో అసలు ధరలను పరిశీలిస్తే అధికారిక వేదికల్లో ఇది రూ.14,499గా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో కొన్ని చోట్ల రూ.13,800 రేంజ్‌లో కూడా దొరుకుతోంది. వివో టి4ఎక్స్ తన ధరకు మించిన విలువను అందించే డివైస్‌గా నిలుస్తోంది. దాని పర్‌ఫార్మెన్స్, డిస్‌ప్లే, కెమెరా అవుట్‌పుట్, బ్యాటరీ లైఫ్ అన్నీ బడ్జెట్ రేంజ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. అప్‌డేటెడ్ లుక్‌తో పాటు రోజువారీ పనుల నుంచి గేమింగ్ వరకు అన్నింటినీ సాఫీగా నిర్వహించే సామర్థ్యం వల్ల ఇది యూజర్‌ అంచనాలకు సరిపోయే ఎంపికగా మారింది. తక్కువ ధరలో పూర్తి ఫీచర్లు కోరుకునే వారికి వివో టి4ఎక్స్ నిజంగా విలువైన ఎంపికగా నిలుస్తుంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×