E-Paper
Advertisement

రూ.30 వేల బడ్జెట్‌లో అదిరిపోయే గేమింగ్ ఫోన్.. Vivo T5 Pro 5G పూర్తి వివరాలు మీ కోసం!

రూ.30 వేల బడ్జెట్‌లో అదిరిపోయే గేమింగ్ ఫోన్.. Vivo T5 Pro 5G పూర్తి వివరాలు మీ కోసం!
Advertisement

Vivo T5 Pro 5G: స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ ఉండే అతిపెద్ద సమస్య బ్యాటరీ. పొద్దున్నే ఫుల్ ఛార్జింగ్ పెట్టినా.. సాయంత్రం అయ్యేసరికి మళ్లీ ప్లగ్ పాయింట్ ఎక్కడుందా అని వెతుక్కోవాల్సి వస్తోంది. ఇప్పుడీ సమస్యకు వివో పరిష్కారం చూపిస్తూ.. తమ సరికొత్త మోడల్ ‘Vivo T5 Pro 5G’ని భారత్‌లో లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో మార్కెట్లో సందడి చేస్తున్న ఈ కొత్త ఫోన్ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

48 గంటల బ్యాటరీ బ్యాకప్:

సాధారణంగా తక్కువ బడ్జెట్‌లో ఫోన్లలో 5000mAh బ్యాటరీ ఉంటుంది. కానీ వివో ఈ Vivo T5 Proలో ఏకంగా 9020mAh బ్యాటరీని అమర్చింది. అయితే ఇంత భారీ బ్యాటరీ ఉంటే ఫోన్ బరువుగా ఉంటుందని అనుకుంటాం కదా. కానీ ఈ ఫోన్ కేవలం 213 గ్రాముల బరువు, చూడటానికి చాలా స్టైలిష్‌గా, సన్నగానే ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు ఛార్జింగ్ వైపు చూడాల్సిన అవసరమే ఉండదు. దానికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఉండటం వల్ల బ్యాటరీ కూడా చాలా వేగంగా నిండుతుంది.

Advertisement

Also Read: లక్ష రూపాయల iPhone 16 Pro.. ఇప్పుడు రూ.50,000కే వచ్చేస్తోంది, ఎలాగో తెలుసా?

5000 నిట్స్ బ్రైట్‌నెస్:

మూవీ లవర్స్, గేమ్స్ పిచ్చి ఉండేవారికి ఈ ఫోన్ బాగా నచ్చుతుంది. 6.83 అంగుళాల అమోలెడ్ స్క్రీన్, దానికి తోడు 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల ఫోన్ వాడేటప్పుడు చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. బయట ఎండలో ఉన్నా సరే స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 5000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. ఇక స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్ ఉండటం వల్ల మల్టీ టాస్కింగ్ చేసినా, భారీ గేమ్స్ ఆడినా ఫోన్ ఎక్కడా లాగ్ అవ్వదు.

రఫ్ అండ్ టఫ్ వాడొచ్చు:

Advertisement

కొంతమంది ఫోన్‌ను చాలా రఫ్‌గా వాడుతుంటారు. అలాంటి వారి కోసం వివో ఈ ఫోన్‌ను చాలా గట్టిగా తయారు చేసింది. నీటిలో పడినా, దుమ్ము తగిలినా ఏమీ కాకుండా ఉండేలా ప్రత్యేక రేటింగ్స్ ఇచ్చారు. అంతేకాదు.. గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా లోపల ఒక మంచి కూలింగ్ సిస్టమ్‌ను కూడా సెట్ చేశారు. దీనివల్ల ఎక్కువ సేపు వాడినా ఫోన్ చేతిలో చల్లగానే ఉంటుంది.

బడ్జెట్‌ ధరలోనే..

ఇక ధర విషయానికి వస్తే.. ఫీచర్లను బట్టి ఈ ఫోన్‌ను మంచి ధరకే తీసుకొచ్చారు. 8GB వేరియంట్ ధర రూ.29,999 నుంచి మొదలవుతోంది. టాప్ మోడల్ 12GB వేరియంట్ రూ.39,999 వరకు ఉంది. ఏప్రిల్ 21 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో స్టోర్లలో అమ్మకాలు మొదలవుతాయి. ఈ ఫోన్ మీద బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Also Read: ఓరి నాయనా.. iPhone 15 Proపై ఏకంగా రూ.59,000 తగ్గింపు, ఎక్కడ కొనుగోలు చేయాలంటే?

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×