E-Paper
Advertisement

7000mAh బ్యాటరీతో ‘Realme 16 5G’ వచ్చేసింది.. ఆ సెల్ఫీ మిర్రర్ ఐడియా భలే ఉంది బాసూ!

7000mAh బ్యాటరీతో ‘Realme 16 5G’ వచ్చేసింది.. ఆ సెల్ఫీ మిర్రర్ ఐడియా భలే ఉంది బాసూ!
Advertisement

Realme 16 5G launched: ఈ ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్ల ధరలు చూస్తుంటే సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఏదైనా కొత్త మోడల్ వస్తే ధర పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. దీంతో చాలామంది కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేసినా.. విడుదలైన ఫోన్ల ధరలు చూసి వెనకడుగు వేస్తుంటారు. ఇప్పుడు అలాంటి వారి కోసమే తక్కువ బడ్జెట్‌లో ‘Realme 16 5G’ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈసారి రియల్‌మీ పాత మోడల్ కంటే ఎక్కువ ఫీచర్లు ఇచ్చేద్దామని కాకుండా, యూజర్లకు రోజువారీగా ఏం కావాలో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఛార్జింగ్ అయిపోతుందన్న టెన్షన్ లేకుండా ఉండటానికి 7000mAh బ్యాటరీ, ఫోన్ వెనుక సెల్ఫీ మిర్రర్ లాంటి కొత్త ఐడియాలతో ఈ ఫోన్ మన ముందుకు వచ్చింది.

ధర ఎంతంటే?

ఈ Realme 16 5G ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో విడుదలైంది. బేస్ మోడల్ 8GB + 128GB ధర రూ.31,999గా ఉంది. అలాగే 8GB + 256GB మోడల్ కావాలంటే రూ.33,999, ఇక హైఎండ్ మోడల్ 12GB + 256GB కావాలంటే రూ.36,999 పెట్టాల్సిందే. ఎయిర్ బ్లాక్, ఎయిర్ వైట్ రంగుల్లో మెరిసిపోతున్న ఈ ఫోన్.. ఏప్రిల్ 6 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ సైట్లలో సేల్‌కు రానుంది. మీకు ఇప్పుడే కావాలనుకుంటే ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు.

Advertisement

Also Read: టెక్ లవర్స్ డ్రీమ్ ఫోన్‌పై అమెజాన్‌లో క్రేజీ డీల్.. Galaxy Z Flip 7ను ఇలా సొంతం చేసుకోండి!

చూడటానికి భలే స్లిమ్‌గా ఉంది:

సాధారణంగా పెద్ద బ్యాటరీ ఉంటే ఫోన్ బరువుగా ఉంటుందనే భయం ఉంటుంది. కానీ ఈ రియల్‌మీ 15తో పోలిస్తే ఈ రియల్‌మీ 16 5G చాలా తేలికగా, స్లిమ్‌గా ఉంది. దీని బరువు కేవలం 183 గ్రాములే. దీంతో ఈ ఫోన్‌ను చేతిలో పట్టుకున్నా, జేబులో పెట్టుకున్నా చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. అలాగే దీనిలో 6.57 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. ఐపీ66/68/69 రేటింగ్ ఉండటం వలన వర్షంలో తడిచినా, పొరపాటున బురదలో పడినా ఫోన్‌కు ఏమీకాదు. మన్నిక విషయంలో రియల్‌మీ గట్టిగానే ప్లాన్ చేసింది.

ఆ సెల్ఫీ మిర్రర్ ముచ్చటేంటి?

Advertisement

ఇకపోతే కెమెరాల విషయానికి వస్తే.. ఒక ఇంట్రెస్టింగ్ మార్పు జరిగింది. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా పక్కన ఒక చిన్న సెల్ఫీ మిర్రర్ ఇచ్చారు. తద్వారా మెయిన్ కెమెరాతో సెల్ఫీ తీసుకోవాలనుకున్నప్పుడు మన ఫేస్ ఎలా కనిపిస్తుందో ఆ అద్దంలో చూసి ఫ్రేమ్ సెట్ చేసుకోవచ్చు. ఇక ముందు వైపు కూడా 50 మెగాపిక్సెల్ కెమెరానే ఉంది. అలాగే ఇందులో 7000mAh భారీ బ్యాటరీ ఇవ్వడంతో.. ఒకసారి ఛార్జ్ చేస్తే రెండ్రోజుల వరకు హ్యాపీగా వాడుకోవచ్చు. అయితే ఛార్జింగ్ స్పీడ్ మాత్రం 60W కి తగ్గించారు. కాబట్టి ఫుల్ అవ్వడానికి కొంచెం టైమ్ పడుతుంది.

ఈ ఫోన్ కొనాలా? వద్దా?

హెవీ గేమింగ్ కంటే కూడా ఫోన్ ఎక్కువ రోజులు ఆగాలి, ఎన్ని ఏళ్లయినా గట్టిగా ఉండాలి అనుకుంటే ఈ Realme 16 5G బెస్ట్ ఆప్షన్. దీనిలో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 కూడా ఉంది. ఒకవేళ మీకు కెమెరాలో వైడ్ యాంగిల్ షాట్స్ కావాలి, ఫోన్ సూపర్ ఫాస్ట్‌గా ఛార్జ్ అయిపోవాలి అనుకుంటే మాత్రం పాత రియల్‌మీ 15 లేదా మార్కెట్లో ఉన్న ఇతర ఫోన్లను పరిశీలించవచ్చు. పక్కాగా బ్యాటరీ లైఫ్, మన్నిక కోరుకునే వారికి మాత్రం ఇది మంచి ఫోన్.

Also Read: ఆ లుక్ ఏంది సామీ.. వీగన్ లెదర్, భారీ బ్యాటరీతో ‘Redmi Note 15 SE 5G’ భారత్‌లో లాంచ్!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×