E-Paper
Advertisement

Vivo X200T: వివో నుంచి మరో సంచలనం.. 6,200mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్!

Vivo X200T: వివో నుంచి మరో సంచలనం.. 6,200mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్!
Advertisement

Vivo X200T: ప్రముఖ మొబైల్ ఉత్పత్తిదారు వివో.. ZEISS సంస్థతో చేతులు కలిపి, పొటోగ్రఫీని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లేలా vivo X200T మోడల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఫొటోల కోసమే కాకుండా.. పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్‌ను ఆశించే యూజర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ ఫోన్ ధర, ఫీచర్లు, పనితీరు గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.

ఈ Vivo X200T ఆకట్టుకునే గ్లాస్, అల్యూమినియం ఫ్రేమ్ బాడీతో వస్తుంది. దీనిలో అమర్చిన 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే యూజర్లకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందిస్తుంది. ముఖ్యంగా 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి తోడు 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో ఫోన్ వాడకం చాలా స్మూత్‌గా ఉంటుంది.

Advertisement

Also Read: 9000mAh బ్యాటరీతో భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ నార్డ్ 6.. అత్యాధునిక ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

ఇకపోతే.. ఈ ఫోన్‌లో వెనుక వైపు మూడు 50MP కెమెరాలను అమర్చారు. దీనిలో ప్రైమరీ కెమెరాతో పాటు అల్ట్రావైడ్, పెరిస్కోప్ లెన్స్‌లు ఉన్నాయి. అలాగే దీనిలో 100x హైపర్ జూమ్ సదుపాయం ఉండటంతో చాలా దూరంగా ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా క్యాప్చర్ చేయొచ్చు. సెల్ఫీల కోసం ఫ్రెంట్‌లో 32MP1 కెమెరాను ఇచ్చారు. ప్రొఫెషనల్ వీడియోలు తీయాలనుకునే వారు దీనిలో 4K క్వాలిటీతో రికార్డ్ చేసుకోవచ్చు.

Advertisement

ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు ఈ ఫోన్ మెరుగైన పనితీరును అందిస్తుంది. బ్యాటరీ పరంగా చూసుకుంటే.. దీనిలో 6,200mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీనికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. దీంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 35 గంటల పాటు బ్యాకప్ ఇస్తుంది.

భారత మార్కెట్లో Vivo X200T రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999 ఉండగా, 512GB వేరియంట్ ధర రూ.69,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.5వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ పొందే అవకాశం కూడా ఉంది. ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో వస్తున్న ఈ ఫోన్‌కు 5ఏళ్ల వరకు ఓఎస్ అప్‌డేట్స్ లభిస్తాయి.

Also Read: మార్కెట్లోకి Poco X8 Pro ఐరన్ మ్యాన్ ఎడిషన్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×