E-Paper
Advertisement

OnePlus Nord 6: 9000mAh బ్యాటరీతో భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ నార్డ్ 6.. అత్యాధునిక ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

OnePlus Nord 6: 9000mAh బ్యాటరీతో భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ నార్డ్ 6.. అత్యాధునిక ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!
Advertisement

OnePlus Nord 6: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన పాపులర్ Nord సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus Nord 6ను త్వరలో భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. 2025లో విడుదలైన Nord 5కి కొనసాగింపుగా రాబోతున్న ఈ ఫోన్ గురించి ఇప్పటికే పలు లీకులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా పర్ఫార్మెన్స్, బ్యాటరీ విషయాల్లో ఈసారి వన్ ప్లస్ భారీ మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అద్భుతమైన పర్ఫార్మెన్స్:

తాజాగా లీకైన వివరాల ప్రకారం.. ఈ OnePlus Nord 6 క్వాల్‌కామ్ Snapdragon 8s Gen 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అలాగే 16GB వరకు RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉంది. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOS 16తో ఈ ఫోన్ బాక్స్ నుంచే వస్తుంది.

Advertisement

Also Read: పోగొట్టుకున్న వస్తువులను వెతకడం ఇక చిటికెలో పని.. ఆపిల్ కొత్త ఎయిర్‌ట్యాగ్ వచ్చేసిందోచ్!

డిస్‌ప్లే, భారీ బ్యాటరీ:

నార్డ్ 6లో 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్, 1.5K రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుండటంతో గేమింగ్ లవర్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది. అన్నింటి కంటే ముఖ్యంగా.. దీనిలో 9000 mAh భారీ బ్యాటరీ ఉండవచ్చని లీక్స్ ద్వారా తెలుస్తోంది. దీనికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం IP68, IP69K రేటింగ్స్ కూడా దీనిలో ఉండనున్నాయి.

కలర్ ఆప్షన్స్ ఇవే:

Advertisement

ఇకపోతే.. ఈ OnePlus Nord 6 ఫోన్ వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరాతో పాటు 2MP మోనోక్రోమ్ లెన్స్ ఉండే అవకాశం ఉంది. సెల్ఫీల కోసం ముందు వైపు 16MP కెమెరాను రావొచ్చు. డిజైన్ పరంగా వన్ ప్లస్ తన పాత నార్డ్ లుక్‌నే కొనసాగిస్తూనే.. బ్లాక్, బ్లూ, మ్యాట్ ఫినిష్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో దీన్ని లాంచ్ చేయనుంది.

అందుబాటులోకి ఎప్పుడంటే?

OnePlus Nord 6 ఫోన్ భారతదేశంలో మార్చి మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.30,000 నుండి రూ.35,000 మధ్య ఉండవచ్చని లీక్స్ ద్వారా తెలుస్తోంది.

Also Read: శాంసంగ్ నుంచి నెక్ట్స్ లెవల్ ఫోన్ ‘గెలాక్సీ S26 ప్లస్’ వచ్చేస్తోంది.. ఐఫోన్‌కు చెక్ పెట్టడం ఖాయమా?

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×