E-Paper
Advertisement

లాంచ్‌కు ముందే Vivo X300 FE ధర లీక్.. ఈ ‘అర్బన్ ఆలివ్’ లుక్ చూస్తే ఐఫోన్ కూడా పక్కకు తప్పుకోవాల్సిందే!

లాంచ్‌కు ముందే Vivo X300 FE ధర లీక్.. ఈ ‘అర్బన్ ఆలివ్’ లుక్ చూస్తే ఐఫోన్ కూడా పక్కకు తప్పుకోవాల్సిందే!
Advertisement

Vivo X300 FE: ఇండియన్ మార్కెట్‌లో వివో ఫోన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే మే 7వ తేదీన రాబోయే Vivo X300 సిరీస్ కోసం టెక్ ప్రియులంతా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే.. అధికారికంగా మార్కెట్లోకి రాకముందే ఈ సిరీస్‌లోని X300 FE మోడల్‌కు సంబంధించిన రిటైల్ బాక్స్ ఫొటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రముఖ టిప్‌స్టర్ సంజు చౌదరి షేర్ చేసిన ఈ వివరాలు చూస్తుంటే.. ఈసారి వివో గట్టి ప్లాన్‌తోనే వస్తున్నట్లు కనిపిస్తోంది.

మరీ అంత ఎక్కువ ధరా?

తాజాగా లీకైన బాక్స్ ఫొటోలో అందరినీ షాక్‌కు గురిచేసే విషయం దాని మీద ఉన్న MRP. 12GB + 256GB వేరియంట్ బాక్స్‌పై ఏకంగా రూ.1,19,999 అని ముద్రించి ఉంది. ఆ నెంబర్ చూడగానే గుండె జారినంత పనవుతుంది కానీ, కంగారు పడక్కర్లేదు. సాధారణంగా కంపెనీలు బాక్సుల మీద రేటు ఎక్కువ వేస్తాయి కానీ, అమ్మేటప్పుడు చాలా తగ్గిస్తాయి. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. అన్ని ఆఫర్లు పోను మనకు ఈ ఫోన్ సుమారు రూ.79,999కే వచ్చే ఛాన్స్ ఉంది. ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఇది మంచి డీల్ అవుతుంది.

Advertisement

Also Read: వన్‌ప్లస్ నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్.. 8600mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లేతో Ace 6 Ultra లాంచ్!

భారత్‌లోనే తయారీ..

X300 FE ఫోన్ కలర్స్ విషయంలో వివో చాలా జాగ్రత్తలు తీసుకుంది. నోయిర్ బ్లాక్, లిలాక్ పర్పుల్ రంగులతో పాటు భారతీయుల కోసం స్పెషల్‌గా అర్బన్ ఆలివ్ అనే కలర్‌ను కూడా తీసుకొస్తోంది. మరో గర్వించదగ్గ విషయం ఏంటంటే.. ఈ ఫోన్ మన ఇండియాలోనే తయారవుతోంది. బాక్సులో ఫోన్‌తో పాటు ఛార్జర్, కేబుల్, మంచి క్వాలిటీ ఉన్న ఫోన్ కేస్ కూడా వస్తున్నాయి. మరీ పెద్ద ఫోన్లు ఇష్టపడని వారికి, చేతిలో ఇమిడిపోయేలా ఉండే దీని 6.31 అంగుళాల డిస్‌ప్లే బాగా నచ్చుతుంది.

కెమెరానే హైలైట్..

Advertisement

లోపల ప్రాసెసర్ పవర్‌ఫుల్‌గా ఉంటేనే కదా ఫోన్ స్పీడ్‌గా ఉండేది. అందుకే దీనిలో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌ను వాడారు. ఇక కెమెరా గురించి ఎంత చెప్పినా తక్కువే. వెనుక మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, సెల్ఫీల కోసం ముందు మరో 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. దీంతో ఫోటోలు నెక్ట్స్ లెవల్‌లో ఉంటాయన్నమాట. ఇక 6,500mAh భారీ బ్యాటరీ ఉండటం వల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా వాడుకోవచ్చు. దానికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.

మార్కెట్లో గట్టి పోటీ తప్పదు..

మొత్తానికి Vivo X300 FE చూడటానికి స్టైలిష్‌గా, వాడటానికి పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. గూగుల్ పిక్సెల్, శాంసంగ్ లాంటి పెద్ద బ్రాండ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. మే 7న లాంచ్ రోజున ధర అధికారికంగా ప్రకటిస్తారు. ఒకవేళ ఊహించినట్టుగా రూ.80 వేల లోపు ధర ఉంటే మాత్రం.. కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. చూడాలి మరి వివో ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తుందో.

Also Read: ఏంది సామీ ఈ ఆఫర్? రూ.35 వేల ఫోన్.. ఇప్పుడు చాలా తక్కువ ధరకే వచ్చేస్తోంది!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×