E-Paper
Advertisement

Vivo X300 FE: వివో నుంచి మరో సంచలనం.. బడ్జెట్ ధరలో 8 Gen 5 ప్రాసెసర్, మైండ్ బ్లాకింగ్ అంతే!

Vivo X300 FE: వివో నుంచి మరో సంచలనం.. బడ్జెట్ ధరలో 8 Gen 5 ప్రాసెసర్, మైండ్ బ్లాకింగ్ అంతే!
Advertisement

Vivo X300 FE: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో నుంచి ‘Vivo X300 FE’ పేరుతో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ త్వరలో విడుదల కానుంది. గ్లోబల్ మార్కెట్‌లోకి రాకముందే ఈ ఫోన్ ఫీచర్లు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ప్రీమియం ఫీచర్లను అందరికీ అందుబాటులో ఉండే ధరకే తీసుకురావాలని వివో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపెర్ఫార్మెన్స్ విషయంలోనూ, లుక్స్ పరంగానూ ఈ ఫోన్ నేటి యువత టేస్ట్‌కు తగ్గట్టుగా ఉండబోతోంది.

బెజెల్ లెస్ డిజైన్:

ఈ Vivo X300 FE ఫోన్ ప్రధానంగా రెండు స్టోరేజ్ వేరియంట్లలో వచ్చే అవకాశం ఉంది. మల్టీటాస్కింగ్ కోసం 8GB RAM/256GB స్టోరేజ్ ఒకటైతే, గేమింగ్, హెవీ డేటా వాడే వారి కోసం 12GB RAM/512GB స్టోరేజ్ కలిగిన హైఎండ్ వేరియంట్ అందుబాటులో ఉండనుంది. అలాగే దీనిలో అదిరిపోయే హై రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌ను అమర్చారు. తద్వారా రీల్స్ స్క్రోలింగ్ అయినా, ఓటీటీలో సినిమాలు చూసినా విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. బెజెల్ లెస్ డిజైన్ వల్ల ఫోన్ పట్టుకుంటే చాలా ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. కళ్లపై ఒత్తిడి పడకుండా ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా ఐ ప్రొటెక్షన్ ఫీచర్లను కూడా చేర్చారు.

Advertisement

Also Read: మొబైల్‌ను ఒక్క చేత్తో పట్టుకుని రీల్స్, షార్ట్స్ చూడటం కష్టంగా ఉందా? ఈ గ్యాడ్జెట్స్ మీ కోసమే!

పవర్‌పుల్ బ్యాటరీ:

వివో ఫోన్ అంటేనే కెమెరాకు పెట్టింది పేరు. ఈ కొత్త మోడల్‌లో కూడా అదిరిపోయే సెన్సార్లను వాడుతున్నారు. తక్కువ వెలుతురులో కూడా ప్రొఫెషనల్ ఫొటోలు తీయడమే కాకుండా, 4K వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది. సెల్ఫీలు ఇష్టపడే వారి కోసం హై రిజల్యూషన్ ఫ్రంట్ కెమెరాను కూడా జోడించారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. రోజంతా ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఉండటానికి పవర్‌ఫుల్ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చారు. దీనికి తోడు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో, కేవలం కొన్ని నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది.

ధర వివరాలు:

Advertisement

కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. దీని ధర మిడ్‌రేంజ్ నుండి ప్రీమియం సెగ్మెంట్ మధ్యలో ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫీచర్లు కలగలిసిన ఈ ఫోన్ మార్కెట్లో హాట్ కేక్‌లా అమ్ముడవుతుందనడంలో సందేహం లేదు. మీరు గనుక కొత్త ఫోన్ కొనాలనే ఆలోచనలో ఉంటే.. మరికొద్ది రోజులు ఆగి ఈ Vivo X300 FEపై ఒక కన్నేయడం బెస్ట్ ఆప్షన్.

Also Read: ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు గట్టి పోటీ.. ఇండియన్ మార్కెట్లోకి వచ్చేస్తున్న నథింగ్ ఫోన్ 4a సిరీస్!

 

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×