Vivo X300 Ultra 400MP Camera| చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో.. ఫొటోగ్రఫీ ప్రియులకు ప్రీమియం కెమెరా ఫోన్ త్వరలోనే విడుదల చేయనుందని సమాచారం. దీని పేరు వివో X300 అల్ట్రా.
కంపెనీ ఈ మోడల్ అధికారిక డేట్ కన్ఫర్మ్ చేయకపోయినా.. ఇటీవలి లీక్స్ దీని డెవలప్‌మెంట్, గ్లోబల్ లాంచ్ ప్లాన్స్‌ను బలంగా సూచిస్తున్నాయి.
ఇటీవల యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ డేటాబేస్‌లో ఒక వివో స్మార్ట్‌ఫోన్ కనిపించింది. లిస్టింగ్‌లో మోడల్ నంబర్ V2562 ఉంది. ఇది ఇంటర్నేషనల్ లెవెల్‌లో Vivo X300 Ultra వేరియంట్ గా ఉంటుందని సమాచారం. EEC లిస్టింగ్ యూరోపియన్ మార్కెట్లలో అందుబాటును కన్ఫర్మ్ చేస్తోంది. అయితే లిస్టింగ్‌లో డీటెయిల్డ్ స్పెసిఫికేషన్లు లేదా ఫీచర్లు వెల్లడి కాలేదు.
పాపులర్ టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు ఇటీవల కొత్త ఇన్ఫర్మేషన్ షేర్ చేశాడు. వివో X300 Ultra చైనాలో వచ్చే ఏడాది లాంచ్ చేయవచ్చని చెప్పాడు. ఎక్స్‌పెక్టెడ్ లాంచ్ విండో మొదటి త్రైమాసికంలో ఉండవచ్చు. గ్లోబల్ మార్కెట్లకు కొద్ది తర్వాత రావచ్చు.
వివో X300 అల్ట్రాలో క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉండవచ్చు. ఈ చిప్‌సెట్ టాప్-టైర్ పర్‌ఫామెన్స్, ఎఫిషియెన్సీ ఇస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్, AI ఫీచర్లు స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ ఫోన్‌ను ఫ్లాగ్‌షిప్ కేటగిరీలో బలంగా నిలబెడుతుంది.
వివో X300 అల్ట్రాలో అడ్వాన్స్‌డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. రిపోర్ట్స్ ప్రకారం.. ఫోన్ వెనుక భాగంలో రెండు 200 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్లు ఉండవచ్చు. ఇది డ్యూయల్ 200MP రియర్ కెమెరాలతో మొదటి స్మార్ట్‌ఫోన్ అవుతుంది. ప్రైమరీ సెన్సార్ 200MP సోనీ IMX90E లెన్స్ ఉండవచ్చు. రెండవ 200MP శామ్‌సంగ్ HPB పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా జూమ్ ఫొటోగ్రఫీకి ఉపయోగపడుతుంది. మూడవ రియర్ కెమెరా 50MP సోనీ LYT-828 సెన్సార్ ఉండవచ్చు.
వివో X300 అల్ట్రాలో బలమైన ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు. సెల్ఫీ కెమెరా 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండవచ్చు. డీటెయిల్డ్ సెల్ఫీలు, హై-క్వాలిటీ వీడియో కాల్స్ సపోర్ట్ చేస్తుంది.
లీక్స్ ప్రకారం.. పెద్ద 6.8 అంగుళాల OLED డిస్‌ప్లే ఉండవచ్చు. స్క్రీన్ షార్ప్ 2K రిజల్యూషన్ ఆఫర్ చేయవచ్చు. వైబ్రంట్ కలర్స్, డీప్ కాంట్రాస్ట్ ఇస్తుంది. స్మూత్ రిఫ్రెష్ రేట్స్ సపోర్ట్‌తో వీక్షణ సౌకర్యం మెరుగవుతుంది.
వివో X300 అల్ట్రాలో 7,000mAh బ్యాటరీ ఉండవచ్చు. ఇది మునుపటి జనరేషన్ కంటే గణనీయమైన అప్‌గ్రేడ్. వివో X300 అల్ట్రాలో 6,000mAh బ్యాటరీ ఉంది. పెద్ద బ్యాటరీ ఉండడంతో రఫ్ యూసేజ్ చేసినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Also Read: నకిలీ ట్రాఫిక్ చలాన్ స్కామ్.. క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ
వివో ఇటీవల ఇండియాలో X300 సిరీస్‌ను లాంచ్ చేసింది. బేస్ Vivo X300 బలమైన ఫ్లాగ్‌షిప్ లెవల్ స్పెసిఫికేషన్లు ఇస్తుంది. 6.31 అంగుళాల LTPO OLED డిస్‌ప్లే ఉంది. స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, హై టచ్ సాంప్లింగ్ సపోర్ట్ చేస్తుంది.
Vivo X300లో 200MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. 50MP వైడ్-యాంగిల్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. 50MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ హ్యాండిల్ చేస్తుంది. ఫోన్‌లో 6,040mAh బ్యాటరీ ఉంది. 90W వైర్డ్ 40W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
Vivo X300 ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6పై పనిచేస్తుంది. ఇన్-డిస్‌ప్లే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది సెక్యూరిటీ మరియు అన్‌లాక్ స్పీడ్ మెరుగుపరుస్తుంది.
Vivo X300 Ultra స్మార్ట్‌ఫోన్ ఫొటోగ్రఫీని కొత్త లెవల్‌కు తీసుకెళ్తుంది. బలమైన ప్రాసెసర్ మరియు పెద్ద బ్యాటరీ స్ట్రాంగ్ వాల్యూ జోడిస్తాయి. అధికారిక డీటెయిల్స్ లాంచ్ సమీపిస్తున్నప్పుడు వెలుగులోకి వస్తాయి.