E-Paper
Advertisement

ఇంత రేటు తగ్గిందేంట్రా? జస్ట్ రూ.12వేలకే Vivo Y19s 5G ఫోన్ వచ్చేస్తోంది!

ఇంత రేటు తగ్గిందేంట్రా? జస్ట్ రూ.12వేలకే Vivo Y19s 5G ఫోన్ వచ్చేస్తోంది!
Advertisement

Vivo Y19s Price Drop: ఇప్పుడంతా స్మార్ట్‌ఫోన్ ప్రియులు 5G స్పీడ్ కావాలని కోరుకుంటున్నారు. అయితే మంచి 5G ఫోన్ కొనాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టాల్సి వస్తుందని వెనకడుగు వేస్తుంటారు చాలామంది. అలాంటి వారి కోసం వివో కంపెనీ గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. తమ పాపులర్ మోడల్ Y19s 5Gపై భారీగా ధర తగ్గించింది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో మంచి ఫోన్ కోసం చూసే స్టూడెంట్స్‌కు, ఉద్యోగస్తులకు ఇదొక క్రేజీ ఆప్షన్ అని చెప్పొచ్చు. మరి ఈ ఫోన్ మీద తగ్గిన ధర ఎంత? దీని ఫీచర్లు ఎలా ఉన్నాయో.. చూసేద్దామా!

డిస్కౌంట్ వివరాలు ఇలా..

వివో Y19s 5G మొదట్లో మార్కెట్లోకి వచ్చినప్పుడు దీని ధర రూ.14,999 వరకు ఉండేది. కానీ ఇప్పుడు దీని మీద ఏకంగా 17 శాతం వరకు రాయితీ ఇస్తున్నారు. ఇప్పుడీ ఫోన్ కేవలం రూ.12,499కే వచ్చేస్తోంది. ఇది కాకుండా కొన్ని బ్యాంక్ కార్డుల మీద అదనపు ఆఫర్లు, పాత ఫోన్ ఇస్తే ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా దొరుకుతాయి. అలాగే తక్కువ వడ్డీతో ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉండటంతో, సామాన్యులకు ఇంత కంటే మంచి అవకాశం రాదనే చెప్పాలి.

Advertisement

Also Read: గెలాక్సీ A27 ఫీచర్లు లీక్.. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో శాంసంగ్ కొత్త ప్లాన్.. ధర ఎంతంటే?

అద్భుతమైన పనితీరు..

ఈ ఫోన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాదు.. దీనిలో 6.74 అంగుళాల పెద్ద డిస్‌ప్లే ఇచ్చారు. దీనివల్ల వీడియోలు చూసినా, రీల్స్ స్క్రోలింగ్ చేసినా మెరుగైన పనితీరును అందిస్తుంది. అలాగే దీనిలో ఉన్న 90Hz రీఫ్రెష్ రేట్ వల్ల ఫోన్ వాడేటప్పుడు చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. ఇది ఫుల్ హెచ్‌డీ కాకపోయినా, ఫొటోలు, వీడియోల క్లారిటీ మాత్రం చాలా బాగుంటుంది. కళ్ల మీద ఒత్తిడి పడకుండా క్వాలిటీగా స్క్రీన్‌ను డిజైన్ చేశారు.

హ్యాంగ్ అయ్యే ప్రసక్తే లేదు..

Advertisement

సాధారణంగా బడ్జెట్ ఫోన్లు అనగానే హ్యాంగ్ అవుతాయేమో అనే భయం ఉంటుంది. కానీ దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ వాడారు. దీనివల్ల వాట్సాప్, ఫేస్‌బుక్ లాంటి యాప్స్ ఎక్కడా ఆగకుండా నడుస్తాయి. అలాగే 4GB RAM, 64GB మెమొరీ ఉంది. ఒకవేళ మీకు స్టోరేజ్ సరిపోదు అనుకుంటే.. మెమొరీ కార్డ్ వేసి ఏకంగా 2TB దాకా పెంచుకోవచ్చు. భారీ గేమింగ్ ఆడేవారికి ఈ ఫోన్ సెట్ కాకపోయినా.. రోజువారీ పనులు కోసం ఈ ఫోన్ బెస్టే.

ఛార్జింగ్ టెన్షన్ ఉండదు..

ఈ ఫోన్‌లో అందరికీ బాగా నచ్చే విషయం దీని 6000mAh బ్యాటరీ. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే చాలు.. ఒకటిన్నర నుండి రెండు రోజుల దాకా ఛార్జర్ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇక ఫోటోల విషయానికి వస్తే.. వెనుక 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ముందు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. పగటి వెలుతురులో ఫొటోలు భలేగా వస్తాయి. వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి కూడా ఇది చాలా క్వాలిటీగా ఉంటుంది.

Also Read: 10x జూమ్, 200MP కెమెరాతో రానున్న Oppo Find X9 Ultra.. ఐఫోన్ కూడా దీని ముందు దిగదుడుపే!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×