E-Paper
Advertisement

గెలాక్సీ A27 ఫీచర్లు లీక్.. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో శాంసంగ్ కొత్త ప్లాన్.. ధర ఎంతంటే?

గెలాక్సీ A27 ఫీచర్లు లీక్.. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో శాంసంగ్ కొత్త ప్లాన్.. ధర ఎంతంటే?
Advertisement

Samsung Galaxy A27 5G: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ A సిరీస్‌లో వరుసగా కొత్త ఫోన్లను దించుతోంది. మొన్ననే గెలాక్సీ A37, A57 మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి కదా.. ఇప్పుడు అందరి చూపు గెలాక్సీ A27 5G మీద పడింది. ఈ ఫోన్ కూడా త్వరలోనే ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ.. తాజాగా గీక్‌బెంచ్ వెబ్‌సైట్‌లో SM-A276B మోడల్ నంబర్‌తో ఒక కొత్త డివైజ్ దర్శనమిచ్చింది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈసారి శాంసంగ్ తమ సొంత ఎగ్జినోస్ చిప్‌సెట్‌ను కాదని, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌ను వాడుతున్నట్లు సమాచారం.

ధర ఎంత ఉండొచ్చు?

ముందుగా ఈ ఫోన్ ధర గురించి మాట్లాడుకుంటే.. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీకి డిమాండ్ పెరగడంతో ఫోన్ల విడిభాగాల ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. అందుకే ఈ ఏడాది విడుదలైన దాదాపు అన్ని ఫోన్ల రేట్లు కొంచెం గట్టిగానే ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న A37, A57 ఫోన్లు రూ.40వేల నుండి రూ.50వేల బడ్జెట్‌లో ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే.. ఈ కొత్త గెలాక్సీ A27 ధర మన దగ్గర సుమారు రూ.30వేల వరకు ఉండొచ్చని అంచనా. అయితే ఈ రేంజ్‌లో నథింగ్ ఫోన్ 4a వంటి మోడల్స్ ఉండటంతో.. శాంసంగ్ తన బ్రాండ్ నమ్మకాన్ని, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను నమ్ముకునే బరిలోకి దిగుతోంది.

Advertisement

Also Read: ఫోన్ తీయాల్సిన పనిలేదు.. నథింగ్ ఏఐ గ్లాసెస్ వచ్చేస్తున్నాయి, అన్నీ కళ్లద్దాలతోనే ఇక!

ప్రాసెసర్ మారితే పర్ఫార్మెన్స్ కథేంటి?

గతేడాది విడుదలైన గెలాక్సీ A26లో ఎగ్జినోస్ 1380 చిప్‌సెట్‌ను వాడారు. ఇది మామూలు పనులకు ఓకే కానీ, కాస్త హెవీగా వాడితే ఫోన్ స్లో అయ్యేది. ఇప్పుడు రాబోయే స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఎందుకంటే.. గీక్‌బెంచ్ స్కోర్లు చూస్తుంటే మరీ అద్భుతంగా ఏమీ లేవు. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ స్క్రీన్ ఉండబోతోంది. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల ఫోన్ వాడేటప్పుడు చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో వస్తుండటం దీనికి మరో ప్లస్ పాయింట్.

కెమెరాలో కీలక మార్పులు..

Advertisement

ఇక కెమెరాల సెటప్ చూస్తే.. వెనుకవైపు 50MP మెయిన్ కెమెరాతో పాటు అల్ట్రా వైడ్, మాక్రో లెన్స్‌లు ఉంటాయి. అయితే సెల్ఫీ కెమెరాను 13 నుండి 12MP తగ్గించినట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడ కంగారు పడక్కర్లేదు.. మెగాపిక్సెల్ తగ్గినా సెన్సార్ సైజు పెంచుతున్నారట. దీనివల్ల ఫొటోలు మరింత క్వాలిటీగా వస్తాయి. వీటన్నింటికంటే పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే.. ఛార్జింగ్ స్పీడ్. మొన్నటిదాకా 25 వాట్స్ దగ్గరే ఆగిపోయిన శాంసంగ్.. ఈసారి ఈ ఫోన్ కోసం 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తోంది. 5000mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ మరి యూజర్లను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

Also Read: ఫోన్ రీసెట్ చేసే ముందు ఈ ఒక్క పని చేయకపోతే.. మీ గూగుల్ అకౌంట్ డేంజర్లో పడ్డట్టే!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×