E-Paper
Advertisement

Vivo Y300 Pro: దూకుడుమీదున్న వివో.. మరో కొత్త సిరీస్‌ నుంచి రెండు ఫోన్లు.. ఫీచర్లు లీక్..!

Vivo Y300 Pro: దూకుడుమీదున్న వివో.. మరో కొత్త సిరీస్‌ నుంచి రెండు ఫోన్లు.. ఫీచర్లు లీక్..!
Advertisement

Vivo Y300 and Vivo Y300 pro: Vivo కంపెనీ ప్రస్తుతం మరిన్ని స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. తాజాగా తన రాబోయే పాపులర్ సిరీస్ Y300కి సంబంధించి పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఈ సిరీస్ త్వరలో చైనాలో ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో Vivo Y300, Vivo Y300 Pro మోడల్‌లను పరిచయం చేసే అవకాశం ఉంది. కాగా ఈ సిరీస్‌లోని Vivo Y300 Pro ఫోన్ చైనాలో 3C సర్టిఫికేషన్‌ను కూడా పొందింది. అయితే ఈ ఫోన్ గురించి మరింత సమాచారం తాజాగా రివీల్ అయింది. దీని ప్యాకేజింగ్ బాక్స్ లాంచ్‌కు ముందే లీక్ అయింది.

ఈ లీక్ ప్రకారం.. ఫోన్‌కి సంబంధించిన పెద్ద బ్యాటరీ గురించి తెలిసింది. Vivo Y300 Pro ప్యాకేజింగ్ బాక్స్ ఫోటోలు దాని లాంచ్‌కు ముందే లీక్ వైరల్‌గా మారాయి. ఇక లీక్ అయిన దాని ప్రకారం చూస్తే.. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 6500mAhగా ఉన్నట్లు పేర్కొనబడింది. అంటే ఊహించినట్లుగానే కంపెనీ ఈ ఫోన్‌లో చాలా పెద్ద బ్యాటరీని ఉపయోగించబోతుంది. ఇక ఈ ఫోన్ ఈ ఫీచర్‌ను చాలా మంది చైనీస్ టిప్‌స్టర్లు లాంచ్‌కు ముందే వెల్లడించారు.

Advertisement

Also Read: ఉఫ్.. వివో ఫోన్‌పై డిస్కౌంట్ల వర్షం.. 8జీబీ ర్యామ్ వేరియంట్ ఇంత తక్కువ..!

6500mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌కు పెద్ద ఆకర్షణగా నిలుస్తుందని చెప్పబడింది. ఇక లీక్ అయిన దాని ప్రకారం.. అది పర్‌పుల్ కలర్‌ వేరియంట్‌లలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంటుందని 3C సర్టిఫికేషన్ వెల్లడించింది. ఇతర స్పెసిఫికేషన్ల గురించి ఇంకా ఖచ్చితమైన సమాచారం వెల్లడి కాలేదు. కానీ మునుపటి మోడల్ Vivo Y200 ప్రో స్పెసిఫికేషన్‌లను చూడటం ద్వారా రాబోయే ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండవచ్చో తెలుసుకోవచ్చు.

Advertisement

Vivo Y200 Pro స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల FullHD ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 695 5G చిప్‌సెట్‌ని కలిగి ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీనితో 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ కొత్త మోడల్‌లోని బ్యాటరీ పెద్ద అప్‌గ్రేడ్‌తో 6500mAh ఉంటుంది. అలాగే Vivo Y200 Pro స్మార్ట్‌ఫోన్‌‌ 64MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది. దీనితో 2 మెగాపిక్సెల్‌ల సెకండరీ లెన్స్ అందించబడింది. ఈ ఫోన్ స్లిమ్ బిల్డ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు Vivo Y300 ప్రోలో బ్యాటరీ కాకుండా ఇతర స్పెసిఫికేషన్లు త్వరలో వెల్లడి కానున్నాయి.

Related News

ఆఫీస్ నుంచే ఇల్లు క్లీన్ చేయొచ్చా? ఫోన్‌తో ఆపరేట్ అయ్యే రోబో వాక్యూమ్స్

ఫోటో, వీడియో ఎడిటింగ్ సరికొత్తగా! మీ బడ్జెట్‌లో టాప్ 5 డిస్‌ప్లే మానిటర్స్

మీ టీవీకి పర్‌ఫెక్ట్ జోడీ!హోమ్ థియేటర్ ఫీల్ ఇచ్చే.. టాప్ సౌండ్‌బార్స్

తాగునీరు విషయంలో కాంప్రమైజ్ వద్దు ! వీటితో హెల్దీ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్

అమ్మో..ఈ మిక్సర్ గ్రైండర్స్ ఇంత స్మార్టా? మీ టైమ్, మనీ ఆదా చేసే టాప్ 5 మిక్సర్లు ఇవే!

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

Big Stories

Advertisement
×