Vivo Y58 5G Price Drop: టెక్ బ్రాండ్ Vivo కొంతకాలంగా Y సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ప్రత్యేక వ్యూహాన్ని అవలంబిస్తోంది. ఈ సిరీస్‌లో కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ అందరి చూపు తనవైపుకు తిప్పుకుంటుంది. ఈ వై సిరీస్‌లో కంపెనీ రెండు నెలల క్రితం Vivo Y58 5Gని దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది. అప్పటి నుంచి ఈ ఫోన్ మంచి రెస్పాన్స్‌ను అందుకుంటుంది. అయితే తాజాగా ఈ ఫోన్ ధర తగ్గించబడింది. ప్రస్తుతం అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నడుస్తుంది. ఇందులో Vivo Y58 5G ఫోన్ 8GB + 128GB వేరియంట్‌పై అదిరిపోయే డిస్కౌంట్ లభిస్తుంది. ఇది 50 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 6000 mAh బ్యాటరీతో వచ్చింది. మరి ఎంతమేర డిస్కౌంట్ వచ్చింది అనే విషయానికొస్తే..
Vivo Y58 5G Specifications
Vivo Y58 5G స్మార్ట్‌ఫోన్ 6.72-అంగుళాల LCD డిస్‌ప్లేతో FHD+ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1024 nits పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఉంది. అలాగే 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ఎక్స్‌టెండ్ ద్వారా ర్యామ్‌ని 8GB వరకు పెంచుకోవచ్చు. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.
Also Read: తగ్గిందోచ్.. శాంసంగ్ ప్రీమియం ఫోన్‌పై రూ.19 వేల భారీ డిస్కౌంట్.. కూపన్ డిస్కౌంట్లు కూడా..!
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. Vivo Y58 5G 6,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. డ్యూయల్ స్పీకర్లు, IP64 రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.
Vivo Y58 5G Price
Vivo Y58 5G స్మార్ట్‌ఫోన్ 8GB + 128GB వేరియంట్ అసలు ధర రూ.23,999 గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఈ వేరియంట్ అమెజాన్‌లో రూ. 18,499కి లిస్ట్ అయింది. అంటే దాదాపు రూ.5,500 భారీ తగ్గింపు లభించిందన్నమాట. ఇది కాకుండా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. దాదాపు రూ.1000 వరకు తగ్గింపు పొందొచ్చు. అప్పుడు ఇది రూ.17,499కే సొంతం అవుతుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. దీంతోపాటు భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.17,500 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ పూర్తిగా వర్తిస్తే.. వివో ఫోన్‌ను కేవలం రూ.1000 లకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందాలంటే పాతఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. అంతేగాక పిన్‌కోడ్ బట్టి వాల్యూ మారుతుంది.