E-Paper
Advertisement

Vivo Y37 Pro Launched: వివో దూకుడు.. 6000mAh బ్యాటరీతో మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్, ఫీచర్లు అరాచకం!

Vivo Y37 Pro Launched: వివో దూకుడు.. 6000mAh బ్యాటరీతో మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్, ఫీచర్లు అరాచకం!
Advertisement

Vivo Y37 Pro Price: టెక్ బ్రాండ్ వివో కంపెనీ ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో దూసుకుపోతుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఎన్నో మోడళ్లను లాంచ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇక తాజాగా మరో మోడల్‌ను తీసుకొచ్చింది. వివో కంపెనీ తాజాగా Vivo Y37 Pro స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ కొత్త సరసమైన స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీతో వస్తుంది.

అంతేకాకుండా 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది కాకుండా కొత్త Vivo ఫోన్‌లో HD + LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ Snapdragon 4 Gen 2 SoCలో పని చేస్తుంది. 8GB RAM + 256GB స్టోరేజ్‌ వేరియంట్‌తో వస్తుంది. ఈ వారంలో కంపెనీ నుండి వచ్చిన రెండవ Y-సిరీస్ స్మార్ట్‌ఫోన్ మోడల్ ఇది. ఇంతకుముందు Y300 ప్రో చైనాలో ప్రారంభించబడింది. ఇప్పుడు లాంచ్ అయిన Vivo Y37 Pro స్మార్ట్‌ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Advertisement

Vivo Y37 Pro Specifications

Also Read: కుమ్ముడే కుమ్ముడు.. ఏకదాటిగా దూసుకుపోతున్న వివో.. మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్!

Advertisement

Vivo Y37 Pro స్మార్ట్‌ఫోన్ 6.68-అంగుళాల HD+ (1608×720 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. కంపెనీ దీనిలో Qualcomm స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 SoCని అందించింది. దానితో 8GB RAM + 256GB స్టోరేజ్‌ను అందించింది. ఇక కెమెరా సిస్టమ్ విషయానికొస్తే.. Vivo Y37 Pro డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.8 ఎపర్చరుతో 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, f/2.4 ఎపర్చరుతో 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఇక ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో f/2.2 ఎపర్చర్‌తో 5 మెగాపిక్సెల్ షూటర్ అందించబడింది.

ఈ ఫోన్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. Vivo Y37 Pro సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ 4 OSతో ఫోన్ షిప్పింగ్ చేయబడింది. ఫోన్‌లో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 4.2, USB 2.0 టైప్-సి పోర్ట్, GPS, 3.5mm ఆడియో పోర్ట్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ దుమ్ము, నీటి నిరోధకత కోసం IP64 రేట్ చేయబడిందని Vivo తెలిపింది.

Vivo Y37 Pro Price

Vivo Y37 Pro స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ CNY 1,799 (సుమారు Rs. 21,300) ధర వద్ద లాంచ్ అయింది. ఇది పింక్, బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్‌లతో చైనాలో ప్రారంభించబడింది. Vivo అధికారిక వెబ్‌సైట్ ద్వారా దీనిని చైనాలో కొనుగోలు చేయవచ్చు.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×