Vivo T3 Ultra Price: వివో కంపెనీకి దేశీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కొత్త కొత్త ఫోన్లలో అధునాతన ఫీచర్లు అందించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. అంతేకాకుండా తక్కువ ధరలో ఫోన్లను లాంచ్ చేయడంతో మరింత మంది వివో ఫోన్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఫోన్లను అతి తక్కువ ధరలో లాంచ్ చేసిన వివో త్వరలో మరో ఫోన్ మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉంది. వివో ఈ నెల అంటె సెప్టెంబర్‌లో దేశీయ మార్కెట్‌లో Vivo T3 ultra స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో లాంచ్‌కు ముందు ఈ ఫోన్ టీజర్ కంపెనీ అధికారిక సైట్‌లో రిలీజ్ చేయబడింది.
అంతేకాకుండా ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్ ల్యాండింగ్ పేజిలో లైవ్‌లో ఉంచబడింది. ఇక ఈ Vivo T3 ultraకి సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరతో సహా మరెన్నో వెల్లడయ్యాయి. ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Vivo T3 Ultra Specifications
మైక్రోసైట్ ప్రకారం.. Vivo T3 ultra స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 4,500 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Dimension 9200 Plus చిప్‌సెట్ అమర్చబడింది. అంతేకాకుండా దాని విభాగంలో అత్యంత వేగవంతమైన ఫోన్‌గా చెప్పబడుతోంది. 1600K AnTuTu స్కోర్‌తో ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 2, 8S Gen 3 ప్రాసెసర్‌ల ఆధారంగా స్మార్ట్‌ఫోన్‌లను అధిగమిస్తుందని భావిస్తున్నారు. కెమెరా సెటప్ విషయానికొస్తే.. వివో T3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ సోనీ కెమెరాతో అమర్చబడుతుంది.
Also Read: వివో నుంచి మెస్మరైజింగ్ స్మార్ట్‌ఫోన్.. కర్వ్డ్ డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో లాంచ్!
ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రైమరీ, యాక్సిలరీ కెమెరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. సమాచారం ప్రకారం.. Vivo T3 అల్ట్రా OIS మద్దతుతో 50MP SONY మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాను పొందవచ్చని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ IP68 రేటింగ్‌తో వస్తుంది. దీని కారణంగా ఇది దుమ్ము, నీటి నుండి రక్షణను నిర్ధారిస్తుంది. Vivo T3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 7.58mm స్లిమ్ ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. స్లిమ్ బాడీని కలిగి ఉన్నప్పటికీ, ఫోన్ పెద్ద 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB RAM + 12GB వర్చువల్ ర్యామ్‌తో వస్తుంది.
Vivo T3 Ultra Price
Vivo T3 ultra స్మార్ట్‌ఫోన్ 12GB+256GB వేరియంట్‌లో అందుబాటులో ఉండవచ్చని తెలుస్తోంది. అలాగే దీని ధర విషయానికొస్తే.. ఇది సుమారు రూ. 33,000 ఉండవచ్చని వెల్లడించింది. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 11 నాటికి ప్రారంభించవచ్చని కూడా సూచించబడింది. అందువల్ల ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చే వారంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Vivo T3 అల్ట్రా భారతదేశంలో ఇటీవల ప్రారంభించబడిన T3 ప్రోకి అప్‌డేటెడ్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది.