E-Paper
Advertisement

గోల్డెన్ ఛాన్స్ బ్రో.. రూ.12వేలు తగ్గిన Vivo Y400 ధర, నీటిలోనూ ఫొటోలు తీసే ఫీచర్లు దీని సొంతం!

గోల్డెన్ ఛాన్స్ బ్రో.. రూ.12వేలు తగ్గిన Vivo Y400 ధర, నీటిలోనూ ఫొటోలు తీసే ఫీచర్లు దీని సొంతం!
Advertisement

Vivo Y400 Price Drop: ప్రీమియం లుక్ ఉన్న మంచి ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకొక గుడ్ న్యూస్. అదిరిపోయే కెమెరా, పవర్‌ఫుల్ బ్యాటరీతో కొద్ది రోజుల క్రితమే మార్కెట్లోకి వచ్చిన Vivo Y400 5G ఫోన్ ధర ఇప్పుడు భారీగా తగ్గింది. ఏకంగా రూ.12వేల వరకు డిస్కౌంట్ లభిస్తుండటంతో, తక్కువ ధరకే ఫ్లాగ్‌షిప్ రేంజ్ ఫీచర్లను సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు మన ముందుకు వచ్చింది.

భారీగా తగ్గిన ధర:

మార్కెట్లోకి వచ్చినప్పుడు ఈ ఫోన్ ధర రూ.43,999గా ఉండేది. కానీ ఇప్పుడు రకరకాల ఆఫర్ల తర్వాత కేవలం రూ.31,999కే అందుబాటులో ఉంది. గ్లామ్ వైట్, ఆలివ్ గ్రీన్ వంటి క్లాసీ కలర్స్‌లో ఉన్న ఈ ఫోన్‌పై డైరెక్ట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లు, పాత ఫోన్ ఇస్తే ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తున్నాయి. ప్రీమియం ఫోన్ వాడాలనుకునే మధ్యతరగతి వారికి ఇది నిజంగా సూపర్ డీల్ అని చెప్పొచ్చు.

Advertisement

Also Read: రూ.9 వేలకే 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే.. దిమ్మతిరిగే ఫీచర్లతో HMD కొత్త 5G ఫోన్!

వేగవంతమైప పనితీరు:

ఈ Vivo Y400 ఫోన్‌లో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. దీని 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల ఫోన్ వాడుతున్నప్పుడు చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. బయట ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా హై బ్రైట్‌నెస్‌ను అందించారు. ఇక దీనిలో ఉన్న స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 8GB RAM వల్ల ఫోన్ అస్సలు లాగ్ అవ్వదు. గేమ్స్ ఆడినా, నెట్ బ్రౌజ్ చేసినా స్పీడ్ అదిరిపోతుంది.

50 మెగాపిక్సల్ సోనీ కెమెరా:

Advertisement

ఇక ఫొటోల అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లకు ఈ ఫోన్ తెగ నచ్చేస్తుంది. దీనిలో 50MP సోనీ మెయిన్ కెమెరా ఉండటంతో పిక్చర్స్ చాలా రియలిస్టిక్‌గా వస్తాయి. అలాగే సెల్ఫీల కోసం 32MP కెమెరా కూడా ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 6000mAh బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. దీంతో కొన్ని నిమిషాలు ఛార్జింగ్ పెడితే చాలు.. రోజంతా వాడుకున్నా బ్యాటరీ అయిపోదు.

నీటిలోనూ ఫొటోలు తీయొచ్చు:

ఈ ఫోన్‌కున్న మరో ప్రత్యేకత దాని గట్టిదనం. IP68/69 రేటింగ్ ఉండటం వల్ల దుమ్ము, ధూళి పడినా లేదా నీటిలో పడినా ఏమీ కాదు. అలాగే ఈ ఫోన్ ద్వారా నీటి అడుగున కూడా ఫొటోలు తీసుకోవచ్చంటే నమ్ముతారా? అంత పక్కాగా దీన్ని తయారు చేశారు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్‌వేర్‌తో వస్తున్న ఈ ఫోన్, తక్కువ ధరలో మంచి క్వాలిటీ కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Also Read: ఏసీ వాడకంలో ఈ 5 మార్పులు చేసుకుంటే.. 30 శాతం వరకు విద్యుత్ ఆదా!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×