E-Paper
Advertisement

పెట్రోల్ vs సీఎన్‌జీ కారు.. సామాన్యుడికి ఏది లాభం? సూటిగా సుత్తిలేకుండా తెలుసుకోండి!

పెట్రోల్ vs సీఎన్‌జీ కారు.. సామాన్యుడికి ఏది లాభం? సూటిగా సుత్తిలేకుండా తెలుసుకోండి!
Advertisement

Petrol vs CNG: దేశంలో పెట్రోల్ కార్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అయితే ఇంధన ధరల పెరుగుదల కారణంగా ప్రస్తుతం సామాన్యుల చూపు.. ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతోంది. కొందరు ఈవీలు కొనుగోలు చేస్తుంటే.. అంతగా ఆర్థిక స్థోమత లేనివారు.. సీఎన్‌జీ వాహనాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ‘పెట్రోల్ వర్సెస్ సీఎన్‌జి’ (Petrol vs CNG) పోరు ఇప్పుడు మార్కెట్లో కనిపిస్తోంది. అయితే మధ్యతరగతి ప్రజలకు రెండింటిలో ఏది బెస్ట్? అనేది ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ధర పరంగా చూస్తే..

సాధారణంగా ఒకే మోడల్‌లోని పెట్రోల్ వేరియంట్‌తో పోలిస్తే.. సీఎన్ జీ కారు ధర దాదాపు రూ.90,000 నుండి రూ.1,20,000 వరకు (ఈవీ అయితే రూ.3-5 లక్షలు) ఎక్కువగా ఉంటుంది. అంటే కొనేటప్పుడు కస్టమర్లు ఈ అదనపు భారాన్ని కచ్చితంగా మోయాల్సిందే. అటు నిర్వహణ పరంగా చూసినా.. పెట్రోల్ కారుతో పోలిస్తే సీఎన్ జీ వాహనం కాస్త ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. CNG కార్లలో స్పార్క్ ప్లగ్స్ మార్చడం, సిలిండర్ ఫిట్‌నెస్ చెకింగ్ వంటి అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు.

మైలేజీ విషయంలో..

Advertisement

లాంగ్ రన్ లో డబ్బు ఆదా పరంగా చూస్తే.. పెట్రోల్ కారు కంటే సీఎన్ జీ ది బెస్ట్ గా నిలుస్తుందని చెప్పవచ్చు. పెట్రోల్ కారు లీటరుకు 15 – 18 కిలోమీటర్ల మైలేజీ ఇస్తే సీఎన్ జీ కారు కిలోకు 25-30 కిలోమీటర్ల మైలేజీని సునాయాసంగా ఇస్తుంది. పెట్రోల్ ధరతో పోలిస్తే సీఎన్ జీ గ్యాస్ ధర తక్కువగా ఉండటం వల్ల ప్రతీ కిలోమీటరుకు అయ్యే ఖర్చు సగానికి పైగా తగ్గుతుంది. రోజువారీ ప్రయాణం ఎక్కువగా చేసే వారైతే (రోజుకు 40-50 కిలోమీటర్లు).. సీఎన్ జీ కొనుగోలు సమయంలో పెట్టిన అదనపు పెట్టుబడి అంతా.. తిరిగి రెండేళ్లలోనే వెనక్కి వచ్చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

లాంగ్ డ్రైవ్‌కు ఏది బెస్ట్

లాంగ్ రైడ్స్, పర్ ఫార్మెన్స్ విషయంలో సీఎన్ జీ కంటే పెట్రోల్ కార్లు బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తాయి. పెట్రోల్ ఇంజన్లు మంచి పికప్, పవర్ ను కలిగి ఉంటాయి. హైవేలపై ప్రయాణించేటప్పుడు, ఓవర్‌టేక్ చేసేటప్పుడు పెట్రోల్ కారు ఇచ్చే కాన్ఫిడెన్సే వేరు. మరోవైపు సీఎన్ జీ కార్లు తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో పాటు బూట్ స్పేస్ (డిక్కీ) ను కూడా చాలా పరిమితం చేసేస్తుంది. సిలిండర్ వల్ల డిక్కీలో లగేజీ పెట్టుకోవడానికి ఏమాత్రం చోటు ఉండదు. అలాగే సీఎన్ జీ స్టేషన్ల వద్ద క్యూలో నిలబడటం కూడా కొంత అసౌకర్యానికి గురిచేయవచ్చు.

తిరిగి అమ్మాలంటే..

Advertisement

కొన్ని సంవత్సరాల వాడకం తర్వాత కారును అమ్మేటప్పుడు, పెట్రోల్ కార్లకు సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం మారుతున్న ట్రెండ్ ప్రకారం సెకండ్ హ్యాండ్ CNG కార్లకు కూడా ఆదరణ పెరుగుతోంది. కాకపోతే సీఎన్ జీ ఇంజన్ లైఫ్ పెట్రోల్ ఇంజన్ కంటే కొంచెం త్వరగా తగ్గే అవకాశం ఉంటుందని కొనుగోలుదారులు భావిస్తుంటారు. ఫలితంగా బాగా వాడిన సీఎన్ జీ కార్ల కంటే..పెట్రోల్ కార్లకే రీసేల్ వాల్యూ మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు.

Also Read: పెట్రోల్ vs ఎలక్ట్రిక్ కారు.. కిలో మీటర్‌కు రూ.1 అనేది.. నిజమా లేక మార్కెటింగ్ జిమ్మిక్కా?

ఫైనల్గా రెండింటిలో ఏది బెస్ట్..

కారును సిటీ లోపల తిరగడానికి మాత్రమే వాడాలని భావిస్తే.. సీఎన్ జీ కారు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. నెలకు 1000 కిలోమీటర్ల లోపు తిరిగేవారు సైతం నిరభ్యంతరంగా సీఎన్ జీని కొనుగోలు చేయవచ్చు. అలా కాకుండా పవర్ ఫుల్ ఇంజిన్, లాంగ్ డ్రైవ్స్ కోరుకుంటే పెట్రోల్ కారు తీసుకోవచ్చు. పైగా సీఎన్ జీ కార్లతో పోలిస్తే.. వీటి ధర కూడా తక్కువే. మెుత్తంగా మీ అవసరానికి తగ్గట్లు ఉన్న దానిని మీరే ఎంచుకోండి.

Also Read: కొత్త ఏసీ లేదా కూలర్ మెురాయిస్తోందా? రూపాయి ఖర్చు లేకుండా.. మరో ఏసీ, రూ.1 లక్ష పొందే ఛాన్స్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×