E-Paper
Advertisement

Klynk Smart Cooktop: దేశంలోనే తొలి ఇంటెలిజెంట్ ఇండక్షన్ స్టవ్.. వంట రాకున్నా.. మిమ్మల్ని గైడ్ చేసి మరి వండేస్తది!

Klynk Smart Cooktop: దేశంలోనే తొలి ఇంటెలిజెంట్ ఇండక్షన్ స్టవ్.. వంట రాకున్నా.. మిమ్మల్ని గైడ్ చేసి మరి వండేస్తది!
Advertisement

Klynk Smart Cooktop: గ్యాస్ కొరత నేపథ్యంలో పేదవారి నుంచి ధనికుల వరకూ ప్రతీ ఒక్కరి దృష్టి ఇండక్షన్ స్టవ్స్ పై పడింది. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలి ఇంటెలిజెంట్ ఇండక్షన్ కుక్ టాప్.. ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. క్లింక్ (Klynk) కంపెనీ అభివృద్ధి చేసిన ‘Semi Intelligent Induction Cooktop’తన అధునాతన ఫీచర్లతో ప్రతీ ఒక్కరినీ ఫీదా చేస్తుంది. ఇంతకీ ఈ స్టవ్ ప్రత్యేకత ఏంటీ? ఇందులోని ప్రధాన ఫీచర్లు? ఏంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

ఆటో గైడెడ్ కుకింగ్

ఈ సెమీ ఇండక్షన్ స్టవ్.. ఆటో గైడెడ్ కుకింగ్ ఫీచర్ ను కలిగి ఉంది. మీరు ఎంచుకున్న డిష్ ను ఏ విధంగా తయారు చేయాలో ఈ స్మార్ట్ కుక్ టాప్ చెప్పేస్తుంది. ఇంటరాక్టివ్ డిస్ ప్లే ద్వారా అనుసరించాల్సిన స్టెప్స్ ను యూజర్ కు సూచిస్తుంది. మీరు ఏ వంటకం చేయాలో ఎంచుకుంటే దానికి తగ్గట్టుగా టెంపరేచర్, టైమ్ ను ఇది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకుంటుంది.

హైపవర్ సామర్థ్యం

Advertisement

సెమీ కుక్ టాప్.. 2200 వాట్ల హై-పవర్ సామర్థ్యంతో రూపొందింది. ఫలితంగా వంటకాలను చాలా ఫాస్ట్ గా చేసేయవచ్చు. అలాగే దీనిలోని ‘టెంపరేచర్ ప్రోబ్’ (Temperature Probe) అనే సెన్సార్ సాయంతో ఆహారం ఎంత టెంపరేచర్ లో వండాలో సెట్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ తో పాటు పన్నీర్ వంటి వంటకాలను పర్ఫెక్ట్ గా చేసుకునేందుకు ఇది సాయపడుతుంది.

ఇన్ బిల్ట్ వెయింగ్ స్కేల్

ఈ కుక్ టాప్ మరో ప్రత్యేక ఏంటంటే.. ఇందులోనే బరువు చూసే యంత్రం ఉంటుంది. పాత్రను స్టవ్ మీద పెట్టి నేరుగా అందులోనే పదార్థాలను తూకం వేయవచ్చు. దీనివల్ల వంటకాల్లో పదార్థాల మోతాదు కచ్చితంగా ఉండి రుచి అద్భుతంగా వస్తుంది.

వైఫై, స్మార్ట్ యాప్ కనెక్టివిటీ

Advertisement

ఈ స్మార్ట్ ఇండక్షన్ స్టవ్ ను Klynk యాప్ ద్వారా ఫోన్ ద్వారానే ఆపరేట్ చేసుకోవచ్చు. స్టవ్ పై ఆహారం ఏ స్టేజీలో ఉందే ట్రాక్ చేయవచ్చు. వై-ఫై కనెక్టివిటీతో ఈ కుక్ టాప్ వచ్చినందువల్ల.. సాఫ్ట్ వేర్ అప్డేట్స్ ద్వారా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, రెసిపీలు యాడ్ అవుతుంటాయి.

మరికొన్ని లాభాలు..

సెమీలోని ఆటో గైడెడ్ కుకింగ్ ఫీచర్.. వంటరాని వారికి ఒక వరంగా చెప్పవచ్చు. ఇండక్షన్ కుక్‌టాప్ ఒక గురువులా మార్గనిర్దేశం చేస్తుంది కాబట్టి వంటపై అవగాహన లేనివారు సైతం రుచికరంగా ఆహారాన్ని వండుకోవచ్చు. 200కు పైగా చెఫ్-క్రాఫ్టెడ్ రెసిపీలను సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిలో వెయింగ్ స్కేల్, టెంపరేచర్ సెన్సార్ ఉండటం వల్ల ప్రతీసారి ఒకే రకమైన రుచిని ఆస్వాదించవచ్చు. కాగా, ఇది క్లింక్ వెబ్ సైట్ లో రూ.12,598కు అందుబాటులో ఉంది.

Also Read: AC Service charges: ఏసీ సర్వీస్‌కు ఎక్కువ చెల్లిస్తున్నారా? క్లీనింగ్, రీఫిల్లింగ్, రీపేర్లకు.. అయ్యే అసలు ఖర్చు ఇదే!

ముఖ్యగమనిక: ఈ స్మార్ట్ ఇండక్షన్ స్టవ్ కు సంబంధించిన సమాచారం.. కంపెనీ విడుదల చేసిన ఫీచర్ల ఆధారంగా అందించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. బిగ్ టీవీ ఈ కంటెంట్ కు ఎలాంటి బాధ్యత వహించదు. మీరు కొనుగోలు చేయాలని భావిస్తే ఒకటికి రెండుసార్లు ఫీచర్లు చెక్ చేసుకుంటే మంచిది.

Also Read: Automatic Roti Maker: హేయ్, ఇదేదో భలే ఉందే.. అలా పిండి వేస్తే.. ఇలా రోటీలు వచ్చేస్తున్నాయ్!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×