iPhone Meaning: I Phone …పేరులోనే లగ్జరీ కొట్టొచ్చినట్టు కనబడే ఈ ఫోన్ ని వద్దనే వారెవరుంటారు.కానీ ఈ I Phone లో I అంటే ఏంటో మీరెప్పుడైనా ఆలోచించారా ?.. నిజానికి టెక్నాలజీ ప్రపంచంలో ఈ చిన్న అక్షరం వెనకాల ఓ మాస్టర్ క్లాస్ బ్రాండింగ్ స్ట్రాటజీ ఉంది.యస్ .. ఇది కేవలం ఒక ఆల్ఫాబేట్ కాదు.ఆపిల్ కంపెనీ తలరాతను మార్చేసిన ఒక ‘మ్యాజికల్ కోడ్’.
ఇంటర్నెట్‌లోని మొదటి అక్షరం ‘i’ని తీసుకుని
మ్యాటర్ లోకి వెళ్తే అది 1998వ సంవత్సరం. ఆపిల్ సంస్థ తీవ్రమైన ఫినాన్షియల్ క్రైసిస్ లో ఉన్న సమయం అది. అప్పుడు కంపెనీని కాపాడటానికి స్టీవ్ జాబ్స్ చేసిన అద్భుతమే iMac. ఆ సమయంలో పర్సనల్ కంప్యూటర్ అంటేనే, గజిబిజి వైర్ల తో కూడిన ఒక పెద్ద బాక్స్.ఇక దానికి ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలంటే గంటల కొద్దీ సెటప్ చేయాల్సి వచ్చేది. దాన్ని గుర్తించిన స్టీవ్ తన టీమ తో బాక్స్ తీసిన నిమిషంలోనే ఇంటర్నెట్ వచ్చేలా ఈ డివైజ్‌ను తయారు చేశాడు. అందుకే ఇంటర్నెట్‌లోని మొదటి అక్షరం ‘i’ని తీసుకుని .దీనికి ‘i’ for Internet అని పేరు పెట్టాడు .
స్టీవ్ జాబ్స్ తన పట్టుదలతో ఈ అక్షరాన్ని గ్లోబల్ ఐకాన్‌గా
వాస్తవానికి ఈ ‘i’ అనేది ఆపిల్ సొంతం కాదు. ఆపిల్ కంటే ముందే ‘Infosear’ అనే కంపెనీ ఇంటర్నెట్ టెర్మినల్స్ కోసం దీనిని వాడాలని చూసింది. కానీ స్టీవ్ జాబ్స్ తన పట్టుదలతో ఈ అక్షరాన్ని గ్లోబల్ ఐకాన్‌గా మార్చేశారు.స్టీవ్ జాబ్స్ తన లాంచ్ ఈవెంట్‌లో ఒక స్లైడ్ వేసి మరీ ‘i’ అంటే ఏంటో ఇలా క్లియర్ గా చెప్పుకొచ్చాడు. మొదటిది Internet—అంటే ప్రపంచంతో కనెక్ట్ అవ్వడం. రెండవది Individual—అంటే ఇది నీ వ్యక్తిత్వానికి ప్రతీక, నీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపునిస్తుంది. మూడవది Instruct—కేవలం ఎంటర్ టైన్ కోసమే కాదు,స్టూడెంట్స్ తమ విజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఒక గురువులా పని చేస్తుందని. నాలుగవది Inform—ప్రపంచం ఏ మూల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇదొక సమాచార గని లా ఉపయోగపడుతుంది అని. ఐదవది Inspire—అంటే ఒక క్రియేటర్ ఆలోచనలకు రెక్కలు తొడిగి, కొత్త విషయాలను సృష్టించేలా స్ఫూర్తినిస్తుందన్నమాట
also read :బాక్సాఫీస్ దగ్గర ఏప్రిల్ ‘ఏప్రిల్ ఫూల్’ చేస్తుందా? ఈ వారం సినిమాలపై పెరుగుతున్న అనుమానాలు!
ఆ తర్వాత వచ్చిన ప్రతి ప్రొడక్ట్‌కు దీని పేరే పెట్టేంతగా
ఇక కాలక్రమంలో ఈ బ్రాండింగ్ ఎంత పవర్‌ఫుల్ అయిందంటే, ఆ తర్వాత వచ్చిన ప్రతి ప్రొడక్ట్‌కు దీని పేరే పెట్టేంతగా. నిజానికి 2001లో వచ్చిన iPodకు అసలు ఇంటర్నెట్‌తో పనే లేదు.జస్ట్ అది మ్యూజిక్ లవర్స్ పాటలు వినే ఒక చిన్న బాక్స్ మాత్రమే. అయినా ఆపిల్ దీనికి కూడా ‘i’ని తగిలించింది.ఎందుకంటే అప్పటికే మార్కెట్‌లో ‘i’ ఉంటే అది ఆపిల్ ప్రొడక్ట్, అది చాలా స్టైలిష్‌గా ఉంటుంది అనే ముద్ర పడిపోయింది కాబట్టి.ఇక ఆ తర్వాత 2007లో వచ్చిన iPhone గురించి ఇక చెప్పక్కర్లేదనుకుంటా.ఇంటర్నెట్, ఫోన్, మ్యూజిక్ ప్లేయర్—ఈ మూడింటిని కలిపి ‘iPhone’ అని పేరు పెట్టగానే ప్రపంచం షేక్ అయిపోయింది. ఎంతలా అంటే అది ఉంటేనే తాము సరైన స్టేటస్ మెయింటెన్ చేస్తున్నాం అనెంతగా.
‘iPhone’ అనే పేరు మీద అప్పటికే సిస్కో (Cisco) అనే కంపెనీకి రైట్స్
ఇక్కడ ఇంకొక క్రేజీ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా .. ఆపిల్ సంస్థ ఈ ‘i’ని తన సొంతం చేసుకోవడానికి చాలా లీగల్ పోరాటాలు చేయాల్సి వచ్చింది.అవును ‘iPhone’ అనే పేరు మీద అప్పటికే సిస్కో (Cisco) అనే కంపెనీకి రైట్స్ ఉండేవి. కానీ ఆ బ్రాండ్ ని వదులుకోవడానికి సిద్దంగా లేని స్టీవ్ జాబ్స్ కోర్టుల వరకు వెళ్లి, ఒప్పందాలు చేసుకుని మరీ ఆ పేరును దక్కించుకోవడం విశేషం.ఇక ప్రస్తుతం ఆపిల్ వాచ్ లేదా ఆపిల్ టీవీ వంటి కొత్త ప్రొడక్ట్స్ వస్తున్నప్పటికీ, ఐఫోన్ విషయంలో మాత్రం ఆ ‘i’ని అలాగే ఉంచారు. ఎందుకంటే ఆ చిన్న అక్షరం వెనుక ఒక పాతిక సంవత్సరాల ఎమోషన్, క్రేజీ బ్రాండింగ్ మరియు స్టీవ్ జాబ్స్ యొక్క విజన్ దాగి ఉన్నాయి కాబట్టి. ఏది ఏమైనా ‘i’ అనేది ఆపిల్ యొక్క గుండెకాయ లాంటిదని చెప్పక తప్పదు.
also read:బాక్సాఫీస్ దగ్గర ‘బైకర్’ పంక్చర్.. ‘రాకాస’ అరాచకం! శర్వా, సంగీత్ కష్టాలు మామూలుగా లేవుగా!