E-Paper
Advertisement

ఆకలితో అరుపులు భయంతో కేకలు… ఒక్కో ఎపిసోడ్ ఒక్కో అద్భతం… ఐయండిబిలో 7.2 టాప్ రేటింగ్

ఆకలితో అరుపులు భయంతో కేకలు… ఒక్కో ఎపిసోడ్ ఒక్కో అద్భతం… ఐయండిబిలో 7.2 టాప్ రేటింగ్
Advertisement

Horror Thriller OTT: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ మంచి కంటెంట్ ఉన్న సిరీస్ లను నిర్మించడంలో ప్రసిద్ది. ప్రేక్షకులు కూడా ఈ ప్లాట్ ఫామ్ ను ఎక్కువగా వాచ్ చేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ సిరీస్ చూస్తే మీరు నొరెళ్ళబెట్టి చూస్తారు కూడా. ఇది నెట్‌ఫ్లిక్స్ సుమారు ₹200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఒక విజువల్స్ వండర్ గా చెప్పుకుంటారు. మీరు గనుక సిరీస్ ని చూస్తే నిజమేననిపిస్తుంది. ఈ సిరీస్‌లో మనుషులు ఉన్నట్టుండి రాక్షసులగా మారుతుంటారు. ‘అవెంజర్స్’, ‘అవతార్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన లెగసీ ఎఫెక్ట్స్, ‘స్ట్రేంజర్ థింగ్స్’ సాంకేతిక నిపుణులు పనిచేశారు. అందుకే ఈ సిరీస్ క్వాలిటీ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక ఈ సిరీస్ కు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు కూడా వచ్చింది.  ఈ సిరీస్ పేరు ఏమిటి ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఈ సిరీస్ పేరు ఏమిటంటే

ఈ కొరియన్ హారర్ వెబ్ సిరీస్ పేరు ‘స్వీట్ హోమ్’ (Sweet Home). 2020లో వచ్చిన ఈ సిరీస్ ను లీ యుంగ్-బోక్ దర్శకత్వం వహించారు. ఇందులో సాంగ్ కాంగ్, లీ జిన్-వూక్, లీ సి-యంగ్, లీ దో-హ్యూన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఇందులో మొత్తం 3 సీజన్లు ఉన్నాయి (సీజన్ 1: 2020, సీజన్ 2: 2023, సీజన్ 3: 2024). ఇది నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌తో కూడా అందుబాటులో ఉంది. ఈ సిరీస్ విడుదలైన మొదటి నెలలోనే ప్రపంచవ్యాప్తంగా 2.2 కోట్ల వ్యూస్ తో రికార్డు సృష్టించింది. ఇందులోని నటీనటులు తమ పాత్రల కోసం కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ముఖ్యంగా నటి లీ సి-యంగ్ తన సిక్స్‌ ప్యాక్ బాడీ, బాక్సింగ్ స్కిల్స్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

చా హ్యున్ అనే కుర్రాడు ఇంట్లో వాళ్లందరినీ కోల్పోయి, బతుకు మీద ఆశ లేక ఒక పాత అపార్ట్‌మెంట్‌లోకి దిగుతాడు. అతను సూసైడ్ చేసుకుందాం అనుకునే లోపే, ఒక భయంకరమైన విపత్తు వస్తుంది. అతను అక్కడికి వెళ్లిన కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వింతైన మార్పులు మొదలవుతాయి. మనుషులు హఠాత్తుగా భయంకరమైన రాక్షసులుగా మారుతుంటారు. ఈ రాక్షసులు మనిషిలోని కోరికలు ఆధారంగా ప్రాణాంతకంగా మారుతుంటారు. ఉదాహరణకు, ఎప్పుడూ కండలు పెంచాలనుకునే వాడు ఒక రాకాసి బాడీ బిల్డర్ గా, ఆకలితో ఉన్నవాడు ఆహారం కోసం వెతికే రాక్షసిగా మారుతాడు. ఇప్పుడు అతను ఉన్న అపార్ట్‌మెంట్ గేట్లు మూసేసి, లోపల ఉన్నోళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ రాక్షసులతో పోరాడాల్సి వస్తుంది.

ట్విస్ట్ ఏంటంటే, ఆ మెయిన్ కుర్రాడికి కూడా ఆ జబ్బు సోకుతుంది. కానీ అతను పూర్తిగా రాక్షసుడిగా మారకుండా, సగం మనిషిలా సగం రాక్షసుడిలా ఉండిపోతాడు. అతనికి వింత శక్తులు వస్తాయి. అపార్ట్‌మెంట్‌లో ఉన్నోళ్లందరూ మొదట అతన్ని చూసి భయపడినా, రాక్షసుల నుండి తమను కాపాడటానికి వాడి శక్తినే వాడుకుంటారు. చివరికి ఆ అపార్ట్‌మెంట్ ఒక యుద్ధక్షేత్రంలా మారిపోతుంది. రాక్షసులు లోపలికి రాకుండా వీళ్లు చేసే రచ్చ, ఒకరికొకరు సాయం చేసుకునే తీరు మామూలుగా ఉండదు. మిలిటరీ వాళ్లు కూడా రంగంలోకి దిగి పరిస్థితిని కంట్రోల్ చేయాలని చూస్తారు. ఇలాంటి గందరగోళంలో ఆ కుర్రాడు ఏవిధంగా అక్కడి వాళ్ళకు సహాయపడ్డాడు ? మిగిలిన వాళ్లు బతికి బయటపడ్డారా? అనేదే అసలు సిసలైన క్లైమాక్స్.

Advertisement

Read Also : చీకటి గదిలో శవం… గుండెల్లో గుబులు పుట్టించే భయం… ఫ్యూజులు అవుటయ్యే స్టోరీ

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×