Indiramma Houses: స్వేఛ్చ బ్యూరో: హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ)పరిధి లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి వచ్చే మార్చి చివరినాటికి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించారు.మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్ధలాల సేకరణ,అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి, పూర్తయిన ఇండ్ల కేటాయింపు తదితర అంశాలపై సచివాలయంలోని తన కార్యాలయంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తో కలిసి సమీక్షించారు.
ఈ సమావేశంలో హౌసింగ్ కార్యదర్శి విపి గౌతమ్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమీషనర్లు పాల్గొన్నారు.పట్టణాల్లోని మురికివాడల్లో జీవనం కొనసాగిస్తున్న పేదలు అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారని, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఇండ్లు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని మంత్రి వివరించారు. హైదరాబాద్‌కు దూరంగా గతంలో 42వేల ఇండ్లను నిర్మించగా అందులో సగం మంది మాత్రమే అక్కడ నివసిస్తున్నారని ఇటీవల నిర్వహించిన క్షేత్రస్ధాయి సర్వేలో తేలిందన్నారు.
Also Read: Kannada Comedy Horror : ఐదు దెయ్యాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యే అభాగ్యుడు… ఓటీటీలోకి కన్నడ కామెడీ హారర్
ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని నిరుపేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా, వారి నివాస ప్రాంతాలకు దగ్గరగా స్ధానిక పరిస్ధితులను బట్టి ఐదు నుంచి 10 అంతస్ధుల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలనే ఆలోచన చే్స్తున్నామని, వచ్చే క్యాబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక ఆర్,ఆర్, ఆర్,- ఓ ఆర్ ఆర్ పరిధిలో మధ్యతరగతి ప్రజల కోసం గతంలో కెపిహెచ్‌బిలో నిర్మించిన మాదిరిగానే ఇండ్లను నిర్మిస్తామని ఇందుకు నాలుగు ప్రాంతాల్లో స్దలాలను గుర్తించి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Also Read: Kannada Comedy Horror : ఐదు దెయ్యాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యే అభాగ్యుడు… ఓటీటీలోకి కన్నడ కామెడీ హారర్