E-Paper
Advertisement

WhatsAppలో ఈ ఒక్క సెట్టింగ్ OFFలో ఉంటే.. మీ పర్సనల్ చాట్స్ హాకర్ల చేతికి చిక్కినట్టే!

WhatsAppలో ఈ ఒక్క సెట్టింగ్ OFFలో ఉంటే.. మీ పర్సనల్ చాట్స్ హాకర్ల చేతికి చిక్కినట్టే!
Advertisement

WhatsApp Chat Backup: నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరి ఫోన్లలో వాట్సప్ కచ్చితంగా ఉంటోంది. స్నేహితులతో మాట్లాడటమే కాకుండా, ఆఫీస్ పనులు, ఫొటోలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి మనం దీనిపైనే ఆధారపడుతున్నాం. అయితే మన మెసేజ్‌లు వేరేవాళ్లు చూడకుండా వాట్సప్ సెక్యూరిటీ ఇస్తుంది కానీ, మనం చేసే ఒక చిన్న పొరపాటు వల్ల మన పాత చాట్స్ అన్నీ హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందన్న విషయం మీకు తెలుసా?

బ్యాకప్‌కు రక్షణ లేకపోతే ముప్పే:

సాధారణంగా మనం వాట్సప్‌లో పంపే మెసేజ్‌లు సురక్షితంగానే ఉంటాయి. వాటిని మధ్యలో ఎవరూ చూడలేరు. కానీ, ఫోన్ పోయినా లేదా కొత్త ఫోన్ మార్చినా పాత మెసేజ్‌లు పోకూడదని మనం గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లో బ్యాకప్ తీసుకుంటూ ఉంటాం. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. ఈ బ్యాకప్‌కు మనం సరైన రక్షణ కల్పించకపోతే.. ఒకవేళ మీ క్లౌడ్ అకౌంట్ హ్యాక్ అయినప్పుడు మీ పాత చాట్స్, పర్సనల్ ఫొటోలు అన్నీ ఇతరుల చేతికి వెళ్లే అవకాశం ఉంది.

End-to-end encrypted బ్యాకప్ అంటే?

Advertisement

మన పర్సనల్ చాట్స్ ఎవరూ చూడకుండా ఉండేందుకు వాట్సప్‌లో ఉండేదే End-to-end encrypted ఫీచర్. ఇది మన చాట్ బ్యాకప్‌ను క్లౌడ్‌లోకి పంపే ముందే పూర్తిగా లాక్ చేస్తుంది. దీనివల్ల బ్యాకప్‌ను కేవలం మనం క్రియేట్ చేసిన పాస్‌వర్డ్ లేదా ఒక ప్రత్యేక కీ ద్వారా మాత్రమే ఓపెన్ చేయగలరు. గూగుల్, యాపిల్ లేదా ఆఖరికి వాట్సప్ సంస్థ కూడా ఈ డేటాను చూడలేదు.

Also Read: జియో బ్రాడ్‌బ్యాండ్ ధమాకా ఆఫర్.. ఒకసారి రీఛార్జ్ చేస్తే 13 నెలల పాటు నెట్, ఓటీటీలు ఫ్రీ!

ఈ సెట్టింగ్‌ను ఎలా ఆన్ చేసుకోవాలి?

Advertisement

ఈ సెట్టింగ్‌ను ఆన్ చేయడం చాలా సులువు. ముందుగా మీ వాట్సప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్కడ Chats అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి Chat Backup లోకి వెళ్లాలి. అక్కడ మీకు End-to-end encrypted backup అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై టాప్ చేసి, స్క్రీన్‌పై వచ్చే సూచనలను పాటిస్తూ ఒక స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాలి.

ఇప్పుడే అలర్ట్ అవ్వడం మంచిది:

సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న ఈ కాలంలో, మన వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఫోన్ మార్చేటప్పుడు డేటా సురక్షితంగా ఉండాలన్నా, హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలన్నా ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ వాట్సప్ సెట్టింగ్స్ చెక్ చేసుకొని, ఈ ఆప్షన్‌ను ఆన్ చేసుకోండి.

Also Read: 10000mAh భారీ బ్యాటరీతో రియల్‌మీ కొత్త 5G ఫోన్లు.. ఒక్క ఛార్జ్‌తో 2 రోజుల బ్యాకప్?

Related News

AC ఫ్యాన్ మోడ్.. కరెంట్ బిల్లు సగానికి తగ్గించుకునేందుకు సూపర్బ్ ట్రిక్!

ఈ జాకెట్ తొడుక్కుంటే.. గాలి నుంచే మంచినీళ్లు.. ఇదేదో భలే ఉందే!

ఇదేందయ్యా ఇది.. ఈ ఫ్రిడ్జ్‌లో మనుషులు కూర్చోవచ్చా? జపానోళ్లది బుర్రే బుర్ర!

లండన్ వేదికగా Galaxy Unpacked 2026 ఈవెంట్.. ఈసారి ఏమేం రాబోతున్నాయంటే?

9,720mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ కొత్త టాబ్లెట్ లీక్స్ రివీల్!

రూ.6 వేలకే ఇలాంటి హోమ్ థియేటరా.. భారత్‌లోకి పోర్ట్రానిక్స్ సరికొత్త సౌండ్ సిస్టమ్!

అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?

Big Stories

Advertisement
×