E-Paper
Advertisement

10000mAh భారీ బ్యాటరీతో రియల్‌మీ కొత్త 5G ఫోన్లు.. ఒక్క ఛార్జ్‌తో 2 రోజుల బ్యాకప్?

10000mAh భారీ బ్యాటరీతో రియల్‌మీ కొత్త 5G ఫోన్లు.. ఒక్క ఛార్జ్‌తో 2 రోజుల బ్యాకప్?
Advertisement

Realme P4 Series 5G: బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లతో ఫోన్లను పరిచయం చేసే రియల్‌మీ.. తాజాగా ఫిలిప్పీన్స్ మార్కెట్లోకి Realme P4 Series 5G లాంచ్ చేసింది. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ధరల్లో, భారీ బ్యాటరీలు, 5G కనెక్టివిటీతో ఈ సిరీస్‌ను తీసుకొచ్చారు. ఇందులో Realme P4 Power, Realme P4x, Realme P4 Lite అనే మూడు మోడల్స్ ఉన్నాయి. వీటి ప్రారంభ ధర సుమారు రూ.7,560 నుంచి మొదలై, టాప్ మోడల్ ధర రూ.30,880 వరకు ఉంది.

ఏకంగా 10001mAh భారీ బ్యాటరీ:

ఈ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఫోన్ Realme P4 Power 5G. ఫిలిప్పీన్స్ మొబైల్ రంగంలోనే తొలిసారిగా 10001mAh భారీ బ్యాటరీని అందించారు. రోజంతా ఫోన్ వాడేవారికోసం, గేమర్స్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్. దీనికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆల్ట్రా ప్రాసెసర్, 144Hz కర్వ్‌డ్ డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో వచ్చే ఈ ఫోన్ ధర దాదాపు రూ.30,880గా ఉంది. జూన్ 10 వరకు ఇది ఆన్‌లైన్ ఆఫర్‌లో లభిస్తుంది.

Advertisement

Also Read: సంచలనం.. ఫోల్డబుల్ iPhoneతో పాటు 11 కొత్త డివైజ్‌లు.. యాపిల్ మాస్టర్ ప్లాన్ అదిరింది!

Realme P4x ప్రత్యేకతలివే:

మధ్యస్థ బడ్జెట్‌లో పవర్‌ఫుల్ ఫోన్ కావాలనుకునే వారి కోసం Realme P4x మోడల్ వచ్చింది. దీనిలో 8000mAh బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ ఫోన్ సులభంగా రెండు రోజుల పాటు వస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేక ఏఐ ఫీచర్లు, 6.8 ఇంచుల 120Hz డిస్‌ప్లే దీని సొంతం. మిడ్‌నైట్ బ్లూ, రేసింగ్ వైట్ రంగుల్లో లభించే ఈ ఫోన్ ప్రస్తుతం ప్రీ-బుకింగ్స్‌కు అందుబాటులో ఉంది.

తక్కువ ధరలో రియల్‌మి P4 లైట్:

Advertisement

సరికొత్త ఫీచర్లు కావాలి, కానీ బడ్జెట్ తక్కువ అనుకునే వారికి Realme P4 Lite బెస్ట్ ఛాయిస్. ఇందులో 7000mAh బ్యాటరీతో పాటు ఫోన్ వేడెక్కకుండా గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్‌ను ఇచ్చారు. ఆర్మీ గ్రేడ్ క్లాస్ బాడీతో వచ్చే ఈ ఫోన్ కిందపడినా పగిలిపోకుండా గట్టిగా ఉంటుంది. దీని 4GB + 64GB వేరియంట్ ధర దాదాపు రూ.7,560 పెసోలుగా ఉంది. ప్రస్తుతం ఇవి షాపీ, టిక్‌టాక్ షాప్‌ల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

Also Read: గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టిన Honor Magic V6 ఫోల్డబుల్ ఫోన్.. ఫీచర్లు అమోఘం.. మీరూ ఓ లుక్కేయండి!

Related News

AC ఫ్యాన్ మోడ్.. కరెంట్ బిల్లు సగానికి తగ్గించుకునేందుకు సూపర్బ్ ట్రిక్!

ఈ జాకెట్ తొడుక్కుంటే.. గాలి నుంచే మంచినీళ్లు.. ఇదేదో భలే ఉందే!

ఇదేందయ్యా ఇది.. ఈ ఫ్రిడ్జ్‌లో మనుషులు కూర్చోవచ్చా? జపానోళ్లది బుర్రే బుర్ర!

లండన్ వేదికగా Galaxy Unpacked 2026 ఈవెంట్.. ఈసారి ఏమేం రాబోతున్నాయంటే?

9,720mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ కొత్త టాబ్లెట్ లీక్స్ రివీల్!

రూ.6 వేలకే ఇలాంటి హోమ్ థియేటరా.. భారత్‌లోకి పోర్ట్రానిక్స్ సరికొత్త సౌండ్ సిస్టమ్!

అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?

Big Stories

Advertisement
×