E-Paper
Advertisement

WhatsApp Search By Date Feature : వాట్సాప్​ ‘సెర్చ్​ బై డేట్’ ఫీచర్​.. ఎలా వాడాలంటే?

WhatsApp Search By Date Feature : వాట్సాప్​ ‘సెర్చ్​ బై డేట్’ ఫీచర్​.. ఎలా వాడాలంటే?
Advertisement

WhatsApp Search By Date Feature

WhatsApp Search By Date Feature : వాట్సాప్ ప్రముఖ చాటింగ్ యాప్. ప్రస్తుత కాలంలో స్నేహితులు,కుటుంబ సభ్యులతో ఉదయం గుడ్ మార్నింగ్ నుంచి రాత్రి గుడ్ నైట్ చెప్పుకోవడం వరకు వాట్సాప్‌లోనే జరుగుతుంది. ఈ యాప్ మన జీవింలో ఒక భాగమైపోయింది. వాట్సాప్‌ను లేని ఫోన్ ఉండదు.. తేలియని మనిషి ఉండరు. దీన్ని గల్లీ వ్యాపార అవసరాల నుంచి కార్పొరెట్ స్థాయి వరకు వాడుతున్నారు.

Advertisement

ఈ నేపథ్యంలో వాట్సాప్ యూజర్లకు మరింత సౌకర్యవంతమైన చాట్ అనుభవాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ క‌ృషి చేస్తోంది. అందులో భాగంగానే పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. సెర్చ్ చేయడాన్ని మరింత సులభతరం చేయడానికి మరో కొత్త ఫీచర్ యూజర్లకు పరిచయం చేసింది.

Read More : దేశంలో ఇంటర్నెట్ వాడనోళ్లు ఇంతమంది ఉన్నారా!

Advertisement

వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా తాజాగా ” సెర్చ్-బై-డేట్” అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఈ ఫీచర్ ఆధారంగా యూజర్స్ నిర్దిష్ట తేదీల ఆధారంగా చాటింగ్‌ను సెర్చ్ చేయవచ్చు. ఈ విధంగా యాజర్లు గతంలో పంపిన లేదా వచ్చిన ముఖ్యమైన సమాచారాన్ని సులువుగా చూడొచ్చు.

సాధారణంగా సెర్చ్ బై వర్డ్ వల్ల అవసరం లేని సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. కానీ కానీ సెర్చ్ బై డేట్ ఫీచర్ ద్వారా ఆ రోజు వచ్చిన మెసేజెస్ మాత్రమే కనిపిస్తాయి. ప్రస్తుతం ఉన్న వాట్సాప్‌లో ఇది వరకు చాటింగ్ చూడాలంటే ఎంతో ఓపికతో స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం చాలా ఎక్కువ సమయం కూడా పడుతుంది. తాజాగా వచ్చే సెర్చ్ బై డేట్‌తో ఆ సమస్య చెక్ పెట్టొచ్చు.

మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తన అధికారిక వాట్సాప్ ఛానెల్‌లో సెర్చ్ బై డేట్ ఫీచర్‌ను ఎలా యూజ్ చేయాలో వివరిస్తూ ఒక పోస్ట్ షేర్ చేశారు. దాని ఆధారంగా సెర్చ్ బై డేట్ ఎలా వాడాలో తెలుసుకుందాం..

సెర్చ్ బై డేట్ ఫీచర్​

  • ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి.
  • ఆ తర్వాత మీ పర్సనల్​ లేదా గ్రూప్​ చాట్​ ఓపెన్ చేయాలి.
  • ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్లి సెర్చ్ ఆప్షన్‌ని ఎంచుకోవాలి.
  • వెంటనే రైట్ ‌సైడ్ క్యాలెండర్ ఐకాన్ కనిపిస్తుంది.
  • దానిపై ట్యాప్ చేసి. మీకు కావాల్సిన తేదీని ఎంచుకోవాలి.
  • ఇక ఆలస్యం చేయకుండా ఆ తేదీలోని చాట్స్​, మీడియా ఫైల్స్ అన్నీ ప్రత్యక్షమవుతాయి.

వాట్సాప్ హెల్ప్‌లైన్

నేడు డీప్ ఫేక్ ఫొటోల, వీడియోలు వంటి తప్పుడు ప్రచారాలు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు మెటా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు వాట్సాప్‌లో ప్రత్యేకంగా ఒక హెల్ప్‌లైన్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

Tags

Related News

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

Big Stories

Advertisement
×