E-Paper
Advertisement

WhatsApp New Feature: వాట్సాప్ సేఫ్టీ ఫీచర్.. ఇక వాటిని స్క్రీన్‌షాట్ తీయలేరు!

WhatsApp New Feature: వాట్సాప్ సేఫ్టీ ఫీచర్.. ఇక వాటిని స్క్రీన్‌షాట్ తీయలేరు!
Advertisement
WhatsApp New Feature
WhatsApp New Feature

Safety Feature in WhatsApp: భారత్ 5జీతో టెక్నాలజీతో దూసుకుపోతుంది. దీంతో స్మార్‌ఫోన్ల వాడకం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో యువత స్మార్ట్‌ఫోన్స్‌లోని యాప్స్‌ను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఈ యాప్స్‌లో వాట్సప్ మొదటి స్థానంలో ఉంటుంది. పొద్దున్నే గుడ్ మార్నింగ్ ‌నుంచి నైట్ గుడ్‌నైట్ వరకు వాట్సాప్‌లోనే జరిగిపోతున్నాయి. వాట్సాప్ లేని ఫోన్ ఉండదు. ఇప్పటికే ఈ యాప్ 500 కోట్లకు పైగా డౌన్‌లోడ్స్‌తో ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకుంది.

ఇందులో భాగంగానే యాజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను చాలానే తీసుకొచ్చింది. అయితే పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో వాట్సాప్ యాజర్ల భద్రతపై ఫోకస్ పెట్టింది. యూజర్లకు, మహిళల భద్రతకు ముప్పు వాటిళ్లుతుందని భావించి కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. త్వరలో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.

Advertisement

మెటా తెలిపిన వివరాల ప్రకారం.. వాట్సాప్‌లో ఈ న్యూ ఫీచర్ వస్తే వాట్సాప్ కాంటాక్ట్ ప్రొఫైల్ ఫోటోను స్క్రీన్‌షాట్ తీయలేము. స్క్రీన్‌షాట్ తీయడాన్ని వాట్సాప్ బ్లాక్ చేస్తుంది. ఈ ఫీచర్ భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ యాజర్లకు అందుబాటులోకి రానుంది.

Also Read: వాట్సాప్ నుంచి మరో అద్భుతమైన ఫీచర్..!

Advertisement

ఈ కొత్త ఫీచర్ వల్ల వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోలను స్క్రీన్ షాట్ తీయలేము. మీరు తీయాలని ప్రయత్నించినట్లయితే ఎటువంటి ఎర్రర్, హెచ్చరిక ఇవ్వదు. కానీ ప్రొఫైల్ ఫోటో స్థానంలో బ్లాంక్‌గా చూపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి రాలేదు.

ఐఓఎస్ డివైజ్‌లో ప్రొఫైల్ ఫోటో స్క్రీన్‌షాట్ తీసే ఫీచర్‌ ఉండబోదని సంస్థ తెలిపింది. ఇది కేవలం ఆండ్రాయిడ్ డివైజ్‌లలో మాత్రమే తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రొఫైల్ ‌ఫోటో సెలెక్టెడ్ కాంటాక్ట్స్‌కు కనిపించే విధంగా మరో ఫీచర్ కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.

గత నెలలో వాట్సాప్ చాట్ ఫిల్టర్ ఆప్షన్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్, ఐఓస్ డివైజ్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ఎలా వినియోగించాలో చూద్దాం.

Also Read: ఐఫోన్ 14పై క్రేజీ డీల్.. ధర. రూ.25 వేలు లోపే!

మీరు ఇంకా ఈ చాట్ ఫిల్టర్ ఆప్షన్ చూడనట్లయితే.. వాట్సాప్ ఓపెన్ చేయండి. సెర్చ్ బార్‌కు వెళ్లి మీకు ఏ సమాచారం కావాలో టైప్ చేయండి. వెంటనే సంబంధిత సమాచారాన్ని లేద చాటింగ్‌ని చూపుతుంది. దీనివల్ల పాత చాటింగ్‌లను సులభంగా చూడొచ్చు. గతంలో పాత చాటింగ్ చూడాలంటే గంటల తరబడి స్క్రోల్ చేయాల్సి ఉండేది. ఈ కొత్త చాట్ ఫిల్టర్ ఆప్షన్‌తో యూజర్లు చాట్‌లను టైమ్ వేస్ట్ అవకుండా త్వరగా చూడొచ్చు.

Tags

Related News

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

Big Stories

Advertisement
×