E-Paper
Advertisement

WhatsApp Scam:- ఇంటర్నేషనల్ నెంబర్లతో వాట్సాప్ కాల్స్.. తస్మాత్ జాగ్రత్త..!

WhatsApp Scam:- ఇంటర్నేషనల్ నెంబర్లతో వాట్సాప్ కాల్స్.. తస్మాత్ జాగ్రత్త..!
Advertisement

WhatsApp Scam:- ఎంతోమంది తెలివైన వ్యక్తులు టెక్నాలజీ పెరుగుదలను తప్పుడు విషయాలకు ఉపయోగించుకుంటున్నారు. దానిని అడ్డం పెట్టుకొని పలు రకాల క్రైమ్స్‌కు పాల్పడుతున్నారు. గత కొన్నేళ్లలో టెక్నాలజీతో పాటు సైబర్ క్రైమ్స్ శాతం కూడా పెరుగుతూ వస్తోంది. సైబర్ సెక్యూరిటీ సెల్ సైతం ఈ క్రిమినల్స్‌ను పట్టుకోవడానికి చాలా కష్టపడుతోంది. తాజాగా మరో కొత్త టెక్నిక్‌తో దేశవ్యాప్తంగా హ్యాకర్లు.. నేరాలకు పాల్పడడానికి సిద్ధపడ్డారు. నేరాలు చేయడానికి వాట్సాప్‌ను ఆయుధంగా మార్చుకున్నారు.

Advertisement

ఇండియాలోని ఎంతోమంది వాట్సాప్ యూజర్లకు ఇంటర్నేషనల్ నెంబర్ల నుండి కాల్స్ రావడం మొదలయ్యింది. మొదట్లో కొంతమంది యూజర్లు.. ఈ కాల్స్‌ను కొట్టిపారేసినా.. చాలామందికి ఇదే విధంగా జరగడంతో యూజర్లతో పాటు టెక్ నిపుణులు కూడా సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టారు. గత కొన్నిరోజులుగా చాలామందికి ఇలాగే ఇంటర్నేషన్ నెంబర్ల నుండి కాల్స్ వస్తున్నాయని చాలామంది బయటపెట్టారు. దీంతో ప్రభుత్వం కూడా దీనిపై ఫోకస్ పెట్టింది.

సైబర్ నేరగాళ్లు ఒకప్పుడు కూడా ఇలాంటి నెంబర్స్‌తో కాల్స్ చేసి యూజర్ల బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బులకు కన్నం వేసేవారు. ఇప్పుడు కూడా వాళ్లు అలాంటి టెక్నికే ఫాలో అవుతున్నారు. అందుకే వాట్సాప్‌లో వస్తున్న ఈ మిస్టరీ కాల్స్ వల్ల యూజర్లు తమ అకౌంట్‌లో డబ్బులకు ఏమైనా హాని జరుగుతుందేమో అని భయపడుతున్నారు. అంతే కాకుండా ఒకసారి ఈ కాల్స్ లిఫ్ట్ చేస్తే.. యూజర్ల చాట్ హిస్టరీ, వాట్సాప్ పర్సనల్ డేటాను కూడా ఈ కాల్స్ ద్వారా కాజేస్తారని సమాచారం.

Advertisement

వాట్సాప్‌లో వారికి ఎదురవుతున్న సమస్యను ట్విటర్ ద్వారా బయటపెట్టారు పలువురు భారతీయులు. వారికి వచ్చే ఇంటర్నేషనల్ కాల్స్ ఎక్కువగా ఆఫ్రికా, సౌత్ఈస్ట్ ఏషియా నుండి వస్తున్నట్టు తెలియజేశారు. ప్రస్తుతం ఇండియాలో దాదాపు 500 మిలియన్ యూజర్లు వాట్సాప్‌ను వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. పలువురు వ్యాపారవేత్తలు కూడా తమ వాట్సాప్‌కు ఇలాంటి కాల్స్ వస్తున్నాయని ట్విటర్‌లో వాపోయారు. మిగతా యూజర్లను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు.

వాట్సాప్ బిజినెస్ వినియోగిస్తున్న వారికి కూడా ఈ కాల్స్ వల్ల ఇబ్బంది తప్పడం లేదని తెలుస్తోంది. ఈ ఫోన్ కాల్స్ నెంబర్లు ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, యూథోపియా.. వంటి దేశాల కోడ్స్ చూపిస్తున్నా కూడా ఒరిజినల్‌గా అవి అక్కడి నుండి రావడం లేదని నిపుణులు గుర్తించారు. కొంతమంది ఈ కాల్స్‌ను అటెండ్ చేయకుండా వదిలేసినా కూడా ఈ కాల్స్ మళ్లీ మళ్లీ వస్తున్నాయని చెప్తున్నారు. ఇది మాత్రమే కాకుండా స్పామ్ కాల్స్‌పై వాట్సాప్ కొత్త ఫీచర్‌ను యాడ్ చేయాలని యూజర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

సుప్రీంకోర్టులో Vi కి భారీ ఊరట.. రూ.363 కోట్ల జీఎస్టీ వివాదంలో కేంద్రానికి షాక్!

ఐఫోన్ నీళ్లలో పడిందా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా.. ఈ ఒక్క షార్ట్‌కట్‌తో నీటిని బయటకు పంపండి!

బడ్జెట్‌లో బిగ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ చూస్తే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది!

Sony vs Bose.. ఈ రెండింటిలో ఏ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ కొంటే మీ డబ్బులు వృధా కావు?

రూ.27,000కే ఇంత స్ట్రాంగ్ ఫోనా? 7200mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో అద్భుతమైన ఫీచర్లు!

మడతపెడితే క్రీజు కూడా కనిపించదు.. టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న హువావే కొత్త ఫోన్!

ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఈ 5 గ్యాడ్జెట్స్ పక్కా ఉండాలి.. బ్యాగ్‌లో ఇట్టే పట్టేస్తాయి!

వాట్సప్ న్యూ ఫీచర్ అదిరింది.. ఇకపై అకౌంట్ లేకపోయినా కాల్స్ జాయిన్ అవ్వొచ్చు!

Big Stories

Advertisement
×