BigTV English

Viral Video : అరేయ్ ఏంట్రా ఇది.. కొంచె అటూ ఇటూ అయితే?

Viral Video : అరేయ్ ఏంట్రా ఇది.. కొంచె అటూ ఇటూ అయితే?

Riding a bike with a cow : టెక్నాలజీ యుగంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. చిన్న పిల్లాడి నుంచి పెద్దోళ్ల వరకు స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ.. వారి టాలెంట్‌ను బయటపెడుతున్నారు. కొంతమంది అయితే లైక్స్, షేర్స్ కోసం రీల్స్ చేస్తూ వెలుగులోకి వస్తున్నారు. వింత టాలెంట్లతో, ఫన్నీ వీడియోలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. వాటిని చూసిన వారు నవ్వుకుంటూ.. వారి టాలెంట్‌ను అభినందిస్తున్నారు. ఇప్పుడు అటువంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


సాధారణంగా పెట్స్‌ను వాహనాలపై తీసుకెళ్లడం కామన్‌గా చూస్తుంటాం. కుక్క పిల్లలు, పక్షులను తమ వెంట తీసుకెళ్తుంటారు. గ్రామాల్లో అయితే దూడలు, మేకలు, గొర్రెలు, బర్రెలు, దూడలు వెంటబెట్టుకొని పోతుంటారు. దీని కోసం వెహికల్ రూల్స్ క్రాస్ చేయరు. అయితే ఒక వ్యక్తి మాత్రం ఈ రూల్స్‌ను బ్రేక్ చేశాడు.

మోటర్ సైకిల్‌పై ఏకంగా ఒక ఆవును కూర్చోబెట్టుకొని ప్రయాణించాడు. ఆవుతో రైడ్ చేస్తూ జాలీగా ఎంజాయ్ చేశాడు. ఈ ఘటనను చూసిన అందరూ ఏమి టాలెంట్ గురూ అంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడయా ప్లాట్ ఫామ్ ఎక్స్‌లో వైరల్ అవుతోంది. నరేష్ నంబిసాన్ అనే ఖాతా నుంచి వీడియో అప్ లోడ్ అయింది. దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Read More : కాలీఫ్లవర్‌లో దూరిన పాము..! వీడియో వైరల్

కుక్కలు, మేకలు చిన్నగా ఉంటాయి. కాబట్టి వాటిని బైక్‌పై తీసుకెళ్లడం సులభం. జనాలు కూడా ఇటువంటి జంతువులను వారి వాహనాలపై తీసుకెళ్తుంటారు. కానీ ఇలా ఆవును బైక్ ఎక్కించుకోవడం మామూలు విషయం కాదు. అందులోనూ ఆవుతో రైడింగ్ చేయడం చిన్ని మాటరేమీ కాదు. అతడు ఆవును అచ్చం తన చంటి బిడ్డలా ముందు కూర్చోబెట్టుకుని వెళ్తున్నాడు.

Read More : ఏంటీ బ్రో ఇది.. గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే చాలా..!

అయితే అతడు చేసిన ఈ విన్యాసాన్ని కొందరు ప్రయాణికులు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఉన్న వింత విషయం ఏమిటంటే ఈ ఆవు కూడా అతడిని ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా బైక్‌పై కూర్చుంది. ఆ ఆవు అటు ఇటు కదిలితే.. మనోడి ఒల్లు గుల్ల అయినట్లే..!

ఈ వీడియో చూసిన ఎక్స్ యూజర్లు షాకవుతున్నారు. తమ అభిప్రాయాలను భిన్నమైన రీతిలో తెలియజేస్తున్నారు. కొందరైతే..ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కి ఆవుతో రైడింగ్ చేస్తున్నాడని విమర్శిస్తుంటే.. మరికొందరు ఆవు అడ్డం తిరిగితే నీకు మూడిందే అంటున్నారు. మరి ఈ వీడియో చూసి మీరేమి అంటారో కామెంట్ చేయండి.

Related News

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Big Stories

×