WhatsApp: ఐఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇక నుంచి ఒకే డివైజ్ ద్వారా రెండు వాట్సప్ అకౌంట్లను క్రియేట్ చేసుకోవచ్చు. చాలా కాలంగా ఈ మల్టీ అకౌంట్ ఫీచర్ పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పడు రెండు నెంబర్లున్న ఒకే ఐఫోన్‌లో రెండు వాట్సప్ అకౌంట్లు వాడుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇది వరకు లాగా రెండు వాట్సప్ అకౌంట్ల కోసం వాట్సప్ బిజినెస్ యాప్ లేదా వెబ్ వంటి గారడీలు చేయాల్సిన పనిలేదు. ఆండ్రాయిడ్ యూజర్లకు 2023 నుంచే ఈ మల్టీ అకౌంట్ సపోర్ట్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సౌలభ్యాన్నే ఇప్పుడు ఐఫోన్ యూజర్లు కూడా పొందుతారు. అదెలాగంటే..
iOS బీటా వర్షన్ యాప్‌ను పరీక్షించే టెస్ట్‌ఫ్లైట్‌లో కొత్తగా కనిపిస్తున్న వాట్సప్ బీటా యాప్, ఒకే ఐఫోన్‌లో రెండు వేర్వేరు వాట్సాప్ అకౌంట్లను వాడుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇప్పుడు డ్యూయల్ సిమ్ ఐఫోన్లు అందుబాటులో ఉడటం వలన.. ఒకటి ఆఫీస్ లేదా బిజినెస్ నెంబర్, మరొకటి పర్సనల్ నెంబర్ కోసం రెండు వాట్సప్ అకౌంట్లు వాడొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లో రెండు అకౌంట్లు వేర్వేరుగా ఉంటాయి. ఐఫోన్‌లో మాత్రం ఒకే అకౌంట్ కనబడుతుంది. దీనిని రెండు నంబర్ల మధ్య అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. మరో విశేషమేంటంటే.. ఏ నెంబర్ సమాచారం దానిదే. ఒకదానితో ఇంకొకదానికి సంబంధం ఉండదు. అంతేకాదు.. ప్రతి అకౌంట్‌కి సెట్టింగ్స్, చాట్స్, నోటిఫికేషన్స్, ప్రైవసీ ఆప్షన్లు కూడా వేర్వేరుగా ఉంటాయి. కేవలం.. రెండు సెకన్లలో అదే అకౌంట్లో నుండి వేరే నంబర్ వాట్సప్స్‌కు మారిపోవచ్చు.
Read Also: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?
కొందరు వాట్సాప్ యూజర్లు వర్క్ ప్రైవసీ కోసం పర్సనల్‌గా వాట్సాప్‌ను వాడుతుంటారు. ఇలాంటి యూజర్లు గతంలో మరో డివైజ్ లేదా వాట్సాప్ బిజినెస్ యాప్ వాడేవారు. కానీ, ఇప్పుడు ఆ ఇబ్బంది ఉండదు. ఎందుకుంటే.. ఇకపై టెస్ట్‌ఫ్లైట్ వెర్షన్ మల్టీ అకౌంట్ సపోర్టును తెస్తోంది. ఈ ఫీచర్ త్వరలోనే రెగ్యులర్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుందని సమాచారం.
యాపిల్ అధికారిక బీటా ప్లాట్‌ఫామ్ అయిన TestFlightలో కొత్తగా విడుదలైన WhatsApp బిల్డ్‌లో ‘Account List’ అనే సెక్షన్ కొత్తగా వచ్చింది. మెసేజింగ్ యాప్ వాట్సప్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే.. ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచే రెండో అకౌంట్‌ను యాడ్ చేయడం లేదా మార్చుకోవడం చేయవచ్చు.
ఈ మల్టీ అకౌంట్ సపోర్ట్ ఫీచర్ iOS పబ్లిక్ బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. పూర్తి పరీక్షల తర్వాత.. కొన్ని వారాల్లో ఇది అందరి ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి రావొచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వాట్సాప్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే.. ఆండ్రాయిడ్ బీటా యూజర్లలో కూడా ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది.
Read Also: ఏఐలకే బాబు ఏజెంటిక్ ఏఐ.. మానవ ప్రమేయం అక్కర్లేదట!