WhatsApp: ప్రస్తుతం వాట్సప్ అనేది ఓ అత్యవసరం మారిపోయింది. ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లోనూ కచ్చితంగా వాట్సాప్ యాప్ ఉంటుంది. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. కొన్ని కోట్లమంది వాట్సాప్‌ను వాడుతున్నారు. అయితే, వినియోగదారులకు మంచి అనుభూతిని ఇచ్చేందుకు వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చేసుకుంటూ వస్తోంది. అయితే, యూజర్ల సెక్యూరిటీ కొరకు కొన్ని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. సాఫ్ట్‌వేర్ అప్డేట్ అవ్వని ఫోన్లలో వాట్సప్ పనిచేయదట. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా పాత ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ ఇకపై పని చేయదట. ఆ వివరాల్లోకి వెళితే..
ఆర్థిక స్తోమత బాగాలేకో, ఇంకొన్ని కారణాల వల్లనో కొంతమంది సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొంటుంటారు. అలా ఉపయోగించిన హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుని కొనడం ఉత్తమం. లేదంటే.. తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఉపయోగించిన ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఆ ఫోన్ వాట్సాప్‌కు మద్దతు ఇస్తుందో లేదో ముందే తనిఖీ చేయడం అవసరం.
వాట్సప్.. Android 5.0, అంతకంటే ఎక్కువ, iOS 15.1, అంతకంటే ఎక్కువ వెర్షన్‌లలో మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ మీరు సెకండ్ హ్యాండ్ కొనుగోలు చేయబోతున్నట్లయితే, అది Android 5 కంటే తక్కువ వెర్షన్‌తో లేదా iOS 15.1 కంటే తక్కువ వెర్షన్‌తో ఉన్న iPhoneతో అనుకూలంగా ఉందో లేదో చూసుకోవాలి. దీని కోసం ఫోన్ సెట్టింగ్‌లను తనిఖీ చేయాలి. ఇవన్నీ తనిఖీ చేయకుండానే సెకండ్ హ్యాండ్ ఫోన్‌ను కొనుగోలు చేయడం వల్ల తరువాత ఇబ్బంది పడవచ్చు.
మీరు కొనుగోలు చేసిన ఫోన్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లో నడుస్తోందో తెలుసుకోవడం సులభమే. మీ ఫోన్ సెట్టింగ్స్‌లలో About ఆప్షన్‌కు వెళ్లాలి. తర్వాత ఈ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా మీకు పూర్తి వివరాలు అక్కడ కనిపిస్తాయి. అలాగే iPhoneలోని ఆపరేటింగ్ సిస్టమ్‌ను తెలుసుకోవడానికి జనరల్‌కు వెళ్లి, ఆపై About విభాగానికి వెళ్లాలి. ఇక్కడే మీ ఫోన్ ఏ OSలో నడుస్తుందో తెలుసుకోవచ్చు.
వాట్సప్ సేవలు పాత OSలలో ఎందుకు పనిచేయయడం లేదంటూ.. చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే, వాట్సప్ తమ ఫీచర్లను మెరుగుపరచడం, యాప్ భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతుంది. సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను స్వీకరించలేని స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సప్ ఇకపై పనిచేయదు. పాత వెర్షన్ OSలకు మద్దతును నిలిపివేయడం ద్వారా కంపెనీ ఇప్పటికే ఉన్న కస్టమర్ల భద్రతపై దృష్టి పెడుతుంది.