E-Paper
Advertisement

Phone Battery Replacement: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ 4 మార్పులు కనిపిస్తే.. దాని బ్యాటరీ పని అయిపోయినట్టే!

Phone Battery Replacement: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ 4 మార్పులు కనిపిస్తే.. దాని బ్యాటరీ పని అయిపోయినట్టే!
Advertisement

Phone Battery Replacement: స్మార్ట్‌ఫోన్ కొన్న కొత్తలో బ్యాటరీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. కానీ రెండేళ్లు దాటాక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఈ క్రమంలో పదే పదే ఛార్జింగ్ పెట్టడం, ఎక్కడికి వెళ్లినా వెంట పవర్ బ్యాంక్ తీసుకెళ్లడం వంటివి విసుగు తెప్పిస్తుంటుంది. అలా అని ఫోన్ పాతదైపోయిందని పక్కన పడేయాల్సిన అవసరం లేదు. కేవలం బ్యాటరీ మార్చుకుని దానిని మళ్లీ కొత్త ఫోన్‌లా వాడుకోవచ్చు. మరి బ్యాటరీ ఎప్పుడు మార్చాలో తెలిపే సంకేతాలేవో తెలుసుకుందామా..

యాప్స్ స్లో అవ్వడం:

ఫోన్ ఫుల్ ఛార్జింగ్‌లో ఉన్నా సరే.. యాప్స్ ఓపెన్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంటే, స్క్రీన్ యానిమేషన్లు సరిగ్గా పనిచేయకపోతే.. మీ బ్యాటరీ ఫోన్ ప్రాసెసర్‌కు అవసరమైన వోల్టేజీని సరిగ్గా అందించలేకపోతోందని అర్థం. ఇది బ్యాటరీ బలహీనపడిందనడానికి మొదటి సంకేతం.

Advertisement

Also Read: కరెంటు బిల్లును 33% తగ్గించే కొత్త ఏసీ టెక్నాలజీ.. ఐఐటీ ఢిల్లీ పరిశోధకుల ముందడుగు!

ఉన్నట్టుండి ఛార్జింగ్ పడిపోవడం:

ఫోన్‌కు 100% ఛార్జింగ్‌ పెట్టుకున్న కొద్దిసేపటికే అది 50%కి పడిపోతుంటే, కనీసం బేసిక్ పనులు కూడా చేయకముందే బ్యాటరీ డ్రైన్ అవుతుంటే.. ఫోన్ బ్యాటరీ పని అయిపోయిందని అర్థం. ఇలాంటి స్థితిలో బ్యాటరీని మార్చడమే మీ ముందు ఉన్న ఏకైక మార్గం.

ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం:

Advertisement

ఫోన్‌లో ఇంకా 20% లేదా 30% ఛార్జింగ్ చూపిస్తున్నా.. ఒక్కసారిగా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే దాని బ్యాటరీ వోల్టేజ్ స్థిరంగా లేదని గుర్తించాలి. ఈ కారణంగానే ఫోన్ సడన్‌గా ష‌ట్‌డౌన్ అవుతుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే కొత్త బ్యాటరీని అమర్చుకోవడం మంచిది.

బ్యాటరీ ఉబ్బిపోవడం:

ఫోన్ వాడుతున్నప్పుడు లేదా ఛార్జింగ్ పెట్టినప్పుడు విపరీతంగా వేడెక్కుతున్నా, ఒకవేళ బ్యాటరీ ఉబ్బినట్లు అనిపించినా అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఉబ్బిన బ్యాటరీ పేలే ప్రమాదం ఉంది కాబట్టి.. ఇలాంటి సందర్భాల్లో వెంటనే సర్వీస్ సెంటర్‌కు వెళ్లి బ్యాటరీని మార్చుకోవాలి.

Also Read: వాయిస్ కంట్రోల్ ఫీచర్లతో బెస్ట్ ఏసీలు.. ‘హే గూగుల్.. ఏసీ ఆన్ చెయ్’ అంటే చాలు!

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×