E-Paper
Advertisement

Best Rated Smart ACs: వాయిస్ కంట్రోల్ ఫీచర్లతో బెస్ట్ ఏసీలు.. ‘హే గూగుల్.. ఏసీ ఆన్ చెయ్’ అంటే చాలు!

Best Rated Smart ACs: వాయిస్ కంట్రోల్ ఫీచర్లతో బెస్ట్ ఏసీలు.. ‘హే గూగుల్.. ఏసీ ఆన్ చెయ్’ అంటే చాలు!
Advertisement

Best Rated Smart ACs: ప్రస్తుత వేసవిలో మధ్యాహ్నం పూట ఆఫీసు నుండి లేదా బయట పని ముగించుకుని ఇంటికి వెళ్లేటప్పుడు మనందరికీ వచ్చే మొదటి ఆలోచన ‘అబ్బా.. ఇంటికి వెళ్లగానే గది చల్లగా ఉంటే ఎంత బాగుంటుందో’ అని. అప్పట్లో అయితే ఇంటికి వెళ్లాక ఏసీ ఆన్ చేసి, అది గదిని చల్లబరిచే వరకు చెమటలు కక్కుతూ వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది.

మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ ఎంత తెలివైందో, ఇప్పుడు మనం వాడే ఏసీలు కూడా అంతే స్మార్ట్ అయిపోయాయి. ఇంటికి చేరుకోవడానికి 10 నిమిషాల ముందే ఆఫీసు నుంచే ఫోన్‌తో ఏసీ ఆన్ చేసేయొచ్చు. డైకిన్, ఎల్‌జీ లాంటి కంపెనీలు వై-ఫై, వాయిస్ కంట్రోల్ వంటి క్రేజీ ఫీచర్లతో మన పనిని ఇంకా ఈజీ చేసేశాయి. ఈ సమ్మర్‌లో మీ లైఫ్‌ని కూల్‌గా మార్చేసే ఆ టాప్-5 స్మార్ట్ ఏసీల ముచ్చట్లేంటో ఓసారి చూద్దాం రండి!

Daikin Smart Inverter AC

Advertisement

ఏసీల విషయంలో డైకిన్ పేరు వినని వాళ్లు చాలా తక్కువ. ఈ బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్ మోడల్ కేవలం చల్లదనం ఇవ్వడమే కాదు, మన అలవాట్లను బట్టి మారిపోతుంది. దీని అసలు టాలెంట్ ఏంటంటే.. మనం ఆఫీసులో ఉన్నప్పుడే ఫోన్ యాప్‌తో ఏసీని ఆన్ చేయొచ్చు. అలా అని కరెంట్ బిల్లు బాదుతుందేమో అని భయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఇది కరెంట్‌ను చాలా తక్కువగా వాడుకుంటుంది. గదిలోని వేడిని బట్టి అదే కూలింగ్‌ను అడ్జస్ట్ చేసుకోవడం దీని స్పెషాలిటీ.

LG Dual Inverter AC

ఎల్‌జీ అంటేనే చాలామంది నమ్మకమైన బ్రాండ్. కొత్తగా వచ్చిన స్మార్ట్ ఏసీల్లో ఉండే ThinQ యాప్ గురించి చెప్పుకోవాలి. రిమోట్ ఎక్కడో వెతకాల్సిన అవసరమే లేదు, అలెక్సా లేదా గూగుల్ అసిస్టెంట్‌తో ‘ఏసీ ఆన్ చేయి’ అని చెబితే చాలు, కూలింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసేస్తుంది. గాలిని క్లీన్ చేసే ఫీచర్లు ఉండటం వల్ల ఇంట్లో గాలి చాలా తాజాగా, హెల్దీగా ఉంటుంది.

Advertisement

Also Read: ఏంటి భయ్యా నిజమా.. రూ.25వేల లోపే బ్రాండెడ్ స్ప్లిట్ ఏసీలా? డోంట్ మిస్!

Panasonic MirAIe Platform AC

పానాసోనిక్ నుంచి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన మిరాయ్ ప్లాట్‌ఫామ్ ACలో మీరు పడుకునే టైమ్‌ని బట్టి ఏ గంటకి ఎంత టెంపరేచర్ ఉండాలో ముందే సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల అర్ధరాత్రి చలి ఎక్కువై నిద్ర లేవాల్సిన ఇబ్బంది ఉండదు. ఏసీలో ఏదైనా చిన్న రిపేర్ వచ్చినా ఈ ఏసీ యాప్ వెంటనే మీకు చెప్పేస్తుంది కాబట్టి టెన్షన్ ఉండదు.

Samsung WindFree Technology AC

చాలామందికి ఏసీ గాలి నేరుగా మీద పడటం నచ్చదు. అలాంటి వారి కోసమే శాంసంగ్ WindFree మోడల్‌నుస్ తెచ్చింది. ఇవి గదిని చాలా సైలెంట్‌గా, త్వరగా చల్లబరుస్తాయి. స్మార్ట్ థింగ్స్ యాప్ వాడి ఏసీ ఎంత కరెంట్ ఖర్చు చేస్తుందో ఫోన్‌లోనే చూసుకోవచ్చు. బయట ఎండలు ఎంతున్నా, ఇంట్లో మాత్రం భలే హాయిగా ఉంటుంది.

Blue Star Smart AC

భారతదేశంలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఈ వేడిని తట్టుకోవడంలో బ్లూ స్టార్ బ్రాండ్ ఏసీలు ముందుంటాయి. ఈ ఏసీల్లోని స్మార్ట్ మోడల్స్ మన మాటలకు చాలా ఫాస్ట్‌గా స్పందిస్తాయి. వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఉన్నా ఏమీ అవ్వదు. అంత స్ట్రాంగ్‌గా వీటిని తయారు చేశారు. యాప్ ద్వారా ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీ.

Also Read: కరెంటు బిల్లును 33% తగ్గించే కొత్త ఏసీ టెక్నాలజీ.. ఐఐటీ ఢిల్లీ పరిశోధకుల ముందడుగు!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×