E-Paper
Advertisement

Pink Sky: వామ్మో.. పింక్ రంగులోకి మారిపోయిన ఆకాశం.. మొత్తానికి మిస్టరీ వీడింది!

Pink Sky: వామ్మో.. పింక్ రంగులోకి మారిపోయిన ఆకాశం.. మొత్తానికి మిస్టరీ వీడింది!
Advertisement

‘‘ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్లు లేదూ.. సూర్యుడు నెత్తురు గడ్డలా లేడూ? అయినా మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలి’’ ఈ డైలాగ్ మీరు ఎప్పుడైనా విన్నారా? ఓ మూవీలో రావు గోపాలరావు చెప్పిన ఈ డైలాగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీనే. ఆకాశం ఎర్రగా కనిపించినప్పుడల్లా ఈ డైలాగ్ గుర్తుకొస్తుంది. రెడ్‌గా మారితే ఒకే.. మరి పింక్ రంగులోకి మారిపోతే? నేటి జెన్-జెడ్‌కు వెంటనే గుర్తుకొచ్చేది ‘స్ట్రేంజర్ థింగ్స్’ వెబ్ సీరిసే. అందులో కూడా ఆకాశం రెడ్‌గా రకరకాల రంగుల్లోకి మారిపోతుంది. తాజాగా ఓ యూరోపియన్ నగరంలో ఆకాశం నియోన్ పింక్ రంగులోకి మారిపోయింది. దీంతో చాలామంది ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఇంతకీ ఆకాశానికి ఆ రంగు ఎలా వచ్చింది? ఉంటే నీలంగా ఉండాలి లేదా ఆరెంజ్, రెడ్, యెల్లో కలర్‌లో ఉండాలి. ఇదేంటీ కొత్తగా పింక్ కలర్? అని ఇలా ఒకటేమిటీ రకరకాల సందేహాలు నెలకొన్నాయి. మరికొందరైతే ఒక అడుగు ముందుకేసి.. ఇది తప్పకుండా ఏలియన్స్ పనే అంటూ ఈ అద్భుతాన్ని గ్రహాంతరవాసుల అకౌంట్లోకి వేసేశారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది?

ఆకాశానికి పింక్ రంగు ఎవరు వేశారబ్బా?

ఐరోపా దేశాలను గోరెట్టి తుఫాను వణికించింది. అయితే, తుఫాన్ రావడానికి ముందు దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. దానికి తోడు విపరీతమైన మంచు వర్షం కురిసింది. అదే సమయంలో బర్మింగ్‌హమ్ (Birmingham) నగరంలోని గగనతలం ఒక్కసారే నియోన్ పింక్ రంగులోకి మారిపోయి మెరవడం మొదలైంది. పింక్ రంగు ఆహ్లాదకరంగానే కనిపించినా.. ఏదో జరిగిపోతుందనే భయం ప్రజలను ఆందోళనకు గురి చేసింది. రాత్రి వేళ సుమారు నాలుగు గంటలపాటు ఈ పింక్ వెలుగులు కనిపించాయి. ఆ తర్వాత మాయమయ్యాయి. కాసేపు జనాలకు ఏం జరిగిందో అర్థం కాలేదు. పింక్ కలర్ ఆకాశం వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతూ కనిపించాయి. చివరికి మిస్టరీ వీడింది. ఇది సైన్స్ చేసిన గమ్మత్తు అని తేలింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

Advertisement

కారణాలు ఇవే..

ఆకాశం పింక్ రంగులోకి మారడానికి కారణం.. అక్కడి ఫుట్‌బాల్ స్టేడియం. మ్యాచ్‌‌లో భాగంగా స్టేడియం మొత్తాన్ని పింక్ కలర్ ఎల్‌ఈడీ లైట్లతో ముస్తాబు చేశారు. అయితే, ఆ లైట్లను పైకి ఫోకస్ చేయడం వల్ల ఆకాశం మొత్తం పింక్ రంగుతో నిండిపోయింది. సాధారణ వాతావరణంలో ఈ లైట్లు అంతగా ప్రభావం చూపి ఉండకపోవచ్చు. తుఫాన్ వల్ల ఆ నగరం చుట్టూ తెల్లని మేఘాలు కమ్ముకున్నాయి. అవి చాలా కింద నుండి ప్రయాణించాయి. మరోవైపు మంచు వర్షం.. దానివల్ల ఆ పింక్ రంగు లైట్లు రిఫ్లెక్ట్ అయ్యాయి. మేఘాలు, మంచులోని నీటి, మంచు బిందువులు అద్దంలా పనిచేసి.. ఆకాశాన్ని మరింత ప్రకాశవంతంగా మార్చేసింది. దీంతో ఊరు మొత్తం పింక్ రంగులోకి మారిపోయింది. అసలు విషయం తెలిసి జనాలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రక్రియను సాంకేతిక భాషలో ఫొటోసింథసిస్ (photosynthesis) అని అంటారు. ప్రకృతికి మానవ సాంకేతికత తోడైతే ఎలా ఉంటుందో చూశారుగా. మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి లైట్లు కనిపిస్తే కంగారు పడకండి. ఎక్కడో ఏదో ఈవెంట్ జరుగుతుందని ధైర్యం తెచ్చుకోండి.

Advertisement

Also Read: బిల్డింగ్‌పై వేలాడుతోన్న బస్సు.. కంగారు పడొద్దు, ఆ డిజైనే అంత!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×