E-Paper
Advertisement

Manchu Family: మంచు ఇంట మొదలైన సంక్రాంతి సంబరాలు.. ఉద్యోగులకు బట్టలు, డబ్బు పంపిణీ..

Manchu Family: మంచు ఇంట మొదలైన సంక్రాంతి సంబరాలు.. ఉద్యోగులకు బట్టలు, డబ్బు పంపిణీ..

Manchu Family: సంక్రాంతి సంబరాలు అప్పుడే మొదలైన సంగతి తెలిసిందే. అటు సెలబ్రిటీల ఇళ్లల్లో ఇప్పటికే ఈ సంబరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా తమ వద్ద పనిచేస్తున్న పనివాళ్లకు, ఉద్యోగులకు సంక్రాంతి సందర్భంగా ముందుగానే డబ్బులు, దుస్తులు పంపిణీ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని కుటుంబం తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో ఉద్యోగులతో సంక్రాంతి సంబరాలు మొదలుపెట్టారు. ఉద్యోగుల సమక్షంలో సంబరాలు జరుపుకున్న అక్కినేని నాగచైతన్య , ఆయన భార్య శోభిత ధూళిపాల సరదాగా గడపడమే కాకుండా స్వయంగా వారికి భోజనం వడ్డించి ఉద్యోగులతో తమకున్న అనుబంధాన్ని చూపుకున్నారు.

మంచు కుటుంబంలో సంక్రాంతి సంబరాలు..

అయితే ఇప్పుడు మరోవైపు మంచు ఫ్యామిలీలో కూడా ఈ సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా తమ కుటుంబం కోసం పనిచేస్తున్న పనివాళ్లకు, ఉద్యోగులకు డబ్బులు, బట్టలను స్వయంగా మంచు కుటుంబ సభ్యులు పంచిపెట్టారు. ముఖ్యంగా మంచు విష్ణు వారసురాళ్ళు డబ్బులు పంపిణీ చేయగా.. మోహన్ బాబు దగ్గరుండి మరీ తన మనవడు అవ్రామ్ తో కలిసి పని వాళ్లకు బట్టలు పంచిపెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.ఇకపోతే అంతా బాగానే ఉన్నా ఇక్కడ ఎప్పటిలాగే ఈసారి కూడా మంచు మనోజ్, ఆయన సతీమణి మౌనిక, వారి పిల్లలు కనిపించలేదు. ఒక మంచు కుటుంబంలో సంక్రాంతి సంబరాలు మొదలవడంతో అభిమానులు కూడా సంతోషంతో ఈ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మంచు మోహన్ బాబు కెరియర్..

మంచు మోహన్ బాబు విషయానికి వస్తే.. భక్తవత్సలం నాయుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన.. ఆ తర్వాత దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు ప్రోత్సాహంతో తనకంటూ ఒక మంచి పేరు దక్కించుకున్నారు.. ముఖ్యంగా డైలాగ్ కింగ్ గా, కలెక్షన్ కింగ్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు మోహన్ బాబు. ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి.. విలన్ గా పలు చిత్రాలలో నటించి ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్నారు. సినిమా రంగంలోనే కాకుండా ఇటు విద్యారంగంలో కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మోహన్ బాబు విశ్వవిద్యాలయంతో పాటు మోహన్ బాబు యూనివర్సిటీలను నడుపుతూ ప్రపంచ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు. రాజకీయ రంగంలో కూడా ఒక వెలుగు వెలిగిన విషయం తెలిసిందే..

మంచు వారసులు..

ఇకపోతే మంచు కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మి, మంచు విష్ణు, మంచు మనోజ్ తమ తమ స్థానాలలో మంచి స్థాయికి ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. మంచు లక్ష్మీ ప్రస్తుతం వరుస చిత్రాలతో అటు లీడ్ రోల్ పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. ఇటు మంచు విష్ణు ‘మా’ కి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే మంచు విష్ణు ఇటీవలే భైరవం సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఈ సినిమాతో పరవాలేదు అనిపించుకున్న ఈయన.. మిరాయ్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. ప్రస్తుతం వాట్ ది ఫిష్ తో పాటు మరికొన్ని చిత్రాలలో నటిస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related News

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

Big Stories

×