E-Paper
Advertisement

ఛార్జింగ్ కేబుల్ సరిగ్గా పిన్ దగ్గరే ఎందుకు కట్ అవుతుంది? ఆ చిన్న తప్పే దీనికి అసలు కారణమా?

ఛార్జింగ్ కేబుల్ సరిగ్గా పిన్ దగ్గరే ఎందుకు కట్ అవుతుంది? ఆ చిన్న తప్పే దీనికి అసలు కారణమా?
Advertisement

Mobile Charging Hacks: రోజంతా గంటల కొద్ది స్మార్ట్‌ఫోన్ వాడాలంటే.. దానికి ఇంటర్నెట్ ఎంత ముఖ్యమో, ఛార్జింగ్ పెట్టే కేబుల్ అంత కంటే ఎక్కువ ఇంపార్టెంట్. కానీ ఎంత ఖరీదైన ఒరిజినల్ కేబుల్ కొన్నా.. కొద్ది రోజులకే అది పిన్ దగ్గర నలిగిపోవడమో లేదా విరిగిపోవడమో జరుగుతుంటుంది. అప్పుడు మనం కంపెనీ వాళ్లను తిట్టుకుంటాం. కానీ నిజానికి తప్పు మనదే అని మీలో ఎంత మందికి తెలుసు? కేబుల్స్ ఎందుకు అంత త్వరగా పాడవుతాయో, దాని వెనుకున్న అసలు సంగతేంటో ఇప్పుడు చూద్దాం.

వంచడం వల్లే డ్యామేజ్:

కేబుల్‌ను చుట్టేటప్పుడు లేదా ఫోన్ వాడుతూ ఛార్జింగ్ పెట్టేటప్పుడు అది విపరీతంగా బెండ్ అవుతుంది. ఇలా వంచిన ప్రతిసారీ కేబుల్ లోపల ఉండే సన్నని వైర్లు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి. దీనిని సైన్స్ భాషలో ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటారు. అంటే.. వైరు ఒకసారి గట్టిగా వంగితే అది మళ్లీ తన పాత స్థితికి రాలేనంతగా దెబ్బతింటుంది. బయటకు వైరు బాగున్నట్టు కనిపిస్తుంది కానీ, లోపల మాత్రం అది మెల్లమెల్లగా నలిగిపోతూనే ఉంటుంది.

పిన్ దగ్గరే ఎందుకు?

Advertisement

కేబుల్ అంతా బాగున్నా.. సరిగ్గా ఆ చివరన పిన్ దగ్గరే ఎందుకు విరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఫోన్ వాడుతున్నప్పుడు కేబుల్‌ను ఆ చివరనే ఎక్కువగా వంచుతాం. దీన్నే ర్యాచెటింగ్ ఎఫెక్ట్ అంటారు. దీంతో పదే పదే ఒకే చోట ఒత్తిడి పడటం వల్ల లోపల ఉండే వైర్లు తమ బలాన్ని కోల్పోతాయి. దీనివల్ల కేబుల్ మన్నిక దాదాపు 30 శాతం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: ఇంట్లోనే థియేటర్ వైబ్స్ ఇచ్చే టాప్-5 JBL Soundbars.. మూవీ నైట్ ఇక నెక్ట్స్ లెవల్!

కరెంటు కూడా కారణమే:

Advertisement

కేబుల్ పాడవడానికి కేవలం వంచడం మాత్రమే కారణం కాదు.. దాని గుండా ప్రవహించే కరెంట్ కూడా మరో కారణమే. కేబుల్ వంగి ఉన్నప్పుడు విద్యుత్ ప్రవాహం వల్ల కొంత వేడి పుడుతుంది. ఆ వేడి వల్ల లోపల ఉండే మెటీరియల్ ఇంకా త్వరగా బలహీనపడుతుంది. ముఖ్యంగా ఫోన్‌ను వేలాడదీసి ఛార్జింగ్ పెట్టడం లేదా వైరును గట్టిగా లాగి పట్టుకోవడం వల్ల ఈ నష్టం చాలా వేగంగా జరుగుతుంది.

ఎంత వంచితే అంత డ్యామేజ్:

కేబుల్‌ను ఎంత టైట్‌గా వంచితే అది అంత త్వరగా పాడవుతుంది. వంపు తిరిగే చోట వైశాల్యం తక్కువగా ఉంటే.. ఆ పాయింట్ దగ్గర ప్రెజర్ పెరిగి వైర్లు లోపల తెగిపోతాయి. అందుకే కేబుల్‌ను ఎప్పుడూ గుండ్రంగా, వదులుగా చుట్టాలి. పిన్ దగ్గర వైరు నేరుగా ఉండేలా చూసుకుంటే.. అది చాలాకాలం మన్నిక వస్తుంది.

ఈ మార్పులు చేసుకుంటే:

కేబుల్స్ ఎక్కువ కాలం రావాలంటే క్వాలిటీతో పాటు దానిని వాడే పద్ధతి కూడా మారాలి. ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్ పట్టుకుని కేబుల్ మీద ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. అవసరమైతే కేబుల్ చివరన ప్రొటెక్టివ్ స్లీవ్స్ లేదా స్ప్రింగ్స్ లాంటివి వాడటం మంచిది. దీనివల్ల వంపు ఒకే చోట పడకుండా సమానంగా సర్దుకుంటుంది. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు.. మాటిమాటికీ కొత్త కేబుల్ కోసం షాపులకు పరుగులు పెట్టక్కర్లేదు.

Also Read: ఇన్‌స్టా రీల్స్‌ చూసి AC గదిలో బకెట్‌‌ నీళ్లు పెడుతున్నారా? వైద్యులు చెబుతున్న ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిస్తే..

Related News

ఏంది భయ్యా ఇది.. జియోలో రూ.350 లోపు.. ఇంత మంచి ప్లాన్స్ ఉన్నాయా!

గూగుల్ డ్రైవ్‌లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

Big Stories

Advertisement
×