E-Paper
Advertisement

భారీ వ‌ర్షం, గంట‌లోపే గ్రౌండ్ సిద్ధం..బంగ్లాదేశ్‌ను చూసి నేర్చుకో అంటూ బీసీసీఐపై ట్రోలింగ్

భారీ వ‌ర్షం, గంట‌లోపే గ్రౌండ్ సిద్ధం..బంగ్లాదేశ్‌ను చూసి నేర్చుకో అంటూ బీసీసీఐపై ట్రోలింగ్
Advertisement

BAN VS PAK:  బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan, 1st Test) మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టులో నాలుగు రోజులు ఆట ఇప్పటికే పూర్తయింది. నిన్న వర్షం పడగా ఇవాళ కూడా ఢాకాలో భారీ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే సోమవారం రోజున గ్యాప్ లేకుండా దాదాపు రెండు గంటల పాటు వర్షం పడింది. వర్షం ఆగిపోయిన తర్వాత కేవలం గంట లోపే గ్రౌండ్ ను సిద్ధం చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. అత్యధిక టెక్నాలజీతో గ్రౌండ్ లో ఎలాంటి వాటర్ లేకుండా.. నీట్ గా చేసేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: PAK VS BAN: పాకిస్తాన్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ? జ‌ట్టులో గిల్, అక్ష‌ర్, తిల‌క్ వ‌ర్మ కూడా, వామ్మో ఎందిరా ఇది

బంగ్లాదేశ్‌ను చూసి నేర్చుకో అంటూ బీసీసీఐపై ట్రోలింగ్

Advertisement

అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ( Bangladeh cricket board) పని తీరును చూసిన క్రికెట్ అభిమానులు… భారత క్రికెట్ నియంత్రణ మండలి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల ఆస్తులు ఉన్న బీసీసీఐ, వర్షం కొడితే.. గ్రౌండ్లను వేగంగా సిద్ధం చేయడంలో విఫలమవుతోందని మండిపడుతున్నారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ను చూసి నేర్చుకోవాలని చురకలు అంటిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ద్వారా డబ్బులు సంపాదించడమే కాదు.. అంతర్జాతీయంగా కూడా ఇండియా పరువు కాపాడాలని కోరుతున్నారు. డబ్బులు సంపాదించడమే కాదు ఇండియా వ్యాప్తంగా ఉన్న గ్రౌండ్ల పైన ఖర్చు కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే భారత పరువు పోతుందని హెచ్చరిస్తున్నారు.

ఉత్కంఠ భరితంగా సాగుతున్న బంగ్లా, పాకిస్తాన్ మ్యాచ్

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan) మధ్య నాలుగు రోజుల కిందట ఢాకాలో (Shere Bangla National Stadium, Dhaka) తొలి టెస్ట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 413 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అటు మొదటి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ కూడా కాస్త పోరాడింది. 386 పరుగులు చేసిన తర్వాత ఆల్ అవుట్ అయింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ రెండవ కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా వర్షం పదేపదే అడ్డు తగిలింది.

Advertisement

అయినప్పటికీ 50 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్ 3 వికెట్ల నష్టానికి 152 పరుగులు సాధించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ 179 పరుగుల లీడ్ సంపాదించింది. ఇక ప్రస్తుత మ్యాచ్ పరిస్థితులను చూస్తే… డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్ లో నాలుగు రోజులు పూర్తయ్యాయి. రేపు ఒక్కరోజు మాత్రమే మ్యాచ్ మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ముందు భారీ టార్గెట్ పెట్టి.. డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువ.

Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువ‌రాజ్ రొమాన్స్..ఇంత‌కు ఎవ‌రీ నవ్య నాయర్ ?  

 

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×