E-Paper
Advertisement

ఇన్‌స్టా రీల్స్‌ చూసి AC గదిలో బకెట్‌‌ నీళ్లు పెడుతున్నారా? వైద్యులు చెబుతున్న ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిస్తే..

ఇన్‌స్టా రీల్స్‌ చూసి AC గదిలో బకెట్‌‌ నీళ్లు పెడుతున్నారా? వైద్యులు చెబుతున్న ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలిస్తే..
Advertisement

AC Room Tips: ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఏసీ గదిలో ఒక బకెట్‌లో నీళ్లు పెడితే చర్మం బాగుంటుంది, గొంతు నొప్పి రాదు అంటూ తెగ వీడియోలు కనిపిస్తున్నాయి. బయట ఎండలు మండిపోతుండటంతో మనమూ అవి నిజమే అనుకుని గుడ్డిగా ఫాలో అయిపోతున్నాం. కానీ, అసలు విషయం ఏంటంటే.. ఇలా నీళ్ల బకెట్ పెట్టడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గదిలో నీళ్లు అలా నిల్వ ఉంచడం వల్ల బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్ ఉందట. మరి ఏసీ వల్ల వచ్చే ఆ గొంతు నొప్పిని, చర్మం పొడిబారడాన్ని ఎలా ఆపాలి? దాని కోసం చేయాల్సిన ప్రత్యామ్నాయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మిషన్ సాయంతో తేమను పెంచడం:

ఏసీ గాలిని పీల్చినప్పుడు మన ముక్కు, గొంతు ఎండిపోకుండా ఉండాలంటే గాలిలో తేమ ఉండాలి. దీనికోసం మార్కెట్లో ‘హ్యూమిడిఫైయర్’ అనే చిన్న మిషన్లు దొరుకుతాయి. బకెట్ నీళ్ల కంటే ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే.. బకెట్‌లోని నీరు గాలిలోకి కలవడానికి చాలా టైం పడుతుంది. కానీ ఈ మిషన్ నీటిని చిన్న చిన్న ఆవిరి తుంపర్లలా గది మొత్తం సమానంగా పంపుతుంది. తక్కువ బడ్జెట్‌లోనే మంచి మిషన్లు వస్తున్నాయి, వీటిని వాడటం వల్ల హాయిగా ఊపిరి తీసుకోవచ్చు.

తడి గుడ్డతో పాతకాలపు చిట్కా:

Advertisement

మిషన్లు కొనలేని వాళ్లు మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి పాత పద్ధతిని ట్రై చేయొచ్చు. ఏదైనా తెల్లటి కాటన్ టవల్‌ని నీళ్లలో తడిపి, గదిలో ఏసీ గాలి తగిలేలా ఒక పక్కన వేలాడదీయండి. బకెట్ నీళ్ల కంటే ఈ తడి గుడ్డ చాలా స్పీడ్‌గా గాలిలోకి తేమను పంపుతుంది. దీనివల్ల గాలిలో డ్రైనెస్ తగ్గి, ఉదయం లేవగానే గొంతు గీచుకుపోయినట్టు ఉండదు. ఇది రూపాయి ఖర్చు లేని చాలా సులభమైన మార్గం.

Also Read: వన్‌ప్లస్ vs ఒప్పో.. 7000mAh బ్యాటరీతో రచ్చ లేపుతున్న ఈ రెండింటిలో ఏది కొనాలి?

ఇండోర్ ప్లాంట్స్ పెంచుదాం:

Advertisement

ఏసీ ఉన్న గదిలో.. స్నేక్ ప్లాంట్, కలబంద లాంటి మొక్కలను పెంచితే అవి గాలిని శుభ్రం చేయడమే కాకుండా, సహజంగా తేమను విడుదల చేస్తాయి. ఇవి చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఏసీ గాలి వలన మనకు ఇబ్బంది కలగకుండా మారుస్తాయి. ప్రకృతి సిద్ధంగా గదిలో తేమను పెంచడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్.

కిటికీలు, తలుపులు తీయాల్సిందే:

చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే.. ఏసీ వేయగానే గదిని ఎక్కడా గాలి చొరబడకుండా గంటల తరబడి మూసేస్తాం. దీనివల్ల గదిలో గాలి బిగుసుకుపోయి డ్రైనెస్ పెరిగిపోతుంది. అందుకే, కనీసం రెండు మూడు గంటలకోసారి ఒక ఐదు నిమిషాల పాటు కిటికీయో లేదా తలుపో తీసి ఉంచండి. బయట ఉండే సహజమైన గాలి లోపలికి వస్తే, గదిలో వాతావరణం మారుతుంది. ఇది చిన్న విషయమే అయినా మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

ఏసీతో పాటు ఫ్యాన్ కూడా..

చాలామంది ఏసీ వేస్తే ఫ్యాన్ వేయకూడదు అనుకుంటారు. కానీ ఏసీని మరీ తక్కువ డిగ్రీల దగ్గర (16 లేదా 18) పెట్టకుండా, ఒక 24 డిగ్రీల దగ్గర ఉంచి ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో వేయండి. ఇలా చేయడం వల్ల ఏసీ చల్లదనం గది మొత్తం సమానంగా త్వరగా వ్యాపిస్తుంది. దీనివల్ల ఏసీ మీద లోడ్ తగ్గుతుంది. గాలి కూడా మరీ డ్రైగా అవ్వదు. పైగా కరెంటు బిల్లు కూడా ఆదా అవుతుంది.

Also Read: Sony నుంచి మరో సెన్సేషన్.. Xperia 1 VIII ధర, ఫీచర్లు లీక్ అయ్యాయోచ్, లాంచ్ ఎప్పుడంటే?

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×